loader
Back to Homepage

రిజిస్ట్రేషన్లు ముగిసాయి

“రుద్రాక్ష” అన్న పదానికి, “శివుని కన్నీటి బిందువులు” అని అర్థం. మహాశివరాత్రి నాడు స్వయంగా సద్గురు శక్తిమంతం చేసిన ఒక రుద్రాక్ష, ఈ దీక్షలో భాగంగా మీకు లభిస్తుంది. రుద్రాక్ష దీక్ష ద్వారా పరమ శివుని అనుగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి.

రుద్రాక్ష దీక్షను ఎవరు పొందవచ్చు?
గృహస్తులతో సహా అందరూ స్వీకరించవచ్చు
పరిమితులేవీ లేవు
రుద్రాక్ష ప్రయోజనాలు
మీ శరీరాన్ని, మనసుని మరింత శక్తిమంతం చేస్తుంది
ధ్యానం చేయడంలో మీకు సహాయం చేస్తుంది.
మీరు ప్రకాశించేలా చేస్తుంది
దుష్ట శక్తుల నుండి సంరక్షిస్తుంది.
రిజిస్ట్రేషన్లు ముగిసాయి
“రుద్రాక్ష దీక్ష అనేది మనం ఆదియోగి కృపకు పాత్రులమయ్యేందుకు గల ఒక శక్తివంతమైన సాధనం”
-సద్గురు
రుద్రాక్ష దీక్ష సమర్పణలు
రుద్రాక్ష
దీనిని ధరించే వారికి శారీరకంగా, మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి.
ఈశా విభూతి
ధ్యానలింగం సమక్షంలో శక్తీకరించబడిన విభూతి
అభయ సూత్రం
ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన ఈ సూత్రం, మీ కోరికలను నెరవేర్చి, భయాన్ని తొలగించడంలో సహకరిస్తుంది.
ఆదియోగి ఫోటో
“‌బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం అంతర్ముఖంలోకి చూడటమే” అని మానవాళికి గుర్తు చేసే ఒక శక్తివంతమైన స్ఫూర్తి.
ఈ సమర్పణలతో పాటు వీటిలో ఒక్కొక్క దానిని ఉపయోగించుకునే విధానంతో కూడిన సూచనలూ అందించబడతాయి
రుద్రాక్ష వృత్తాంతం
రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. రుద్రాక్షలు అనేవి శివుని కంటి నుండి జాలువారిన బిందువులు. పురాణాల్లో ఇలా చెబుతారు, శివుడు చాలా కాలం పాటు ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన పొందిన ‌పారవశ్యం ఎలాంటిదంటే, దానివల్ల ఆయన పూర్తి నిశ్చలంగా మారి, కదలకుండా ఉండిపోయాడు. ఊపిరి పీల్చుతున్న ఆనవాలు కూడా లేదు. అందరూ ఆయన మరణించాడని అనుకున్నారు. బ్రతికే ఉన్నాడనడానికి ఒకే ఒక గుర్తు – ఆయన కళ్ళ వెంబడి కారుతున్న ఆనంద భాష్పాలు. ఈ ఆనంద భాష్పాలు భూమిపై పడి, రుద్రాక్షలుగా, “శివుని కన్నీటి బిందువులు” గా మారాయి.
రుద్రాక్ష దీక్షను పంచుకోండి
ఈ అవకాశాన్ని మీ కుటుంబం, ఇంకా స్నేహితులకు అందించి, వారి జీవితాలలో ఒక చుక్క ఆధ్యాత్మికతను తీసుకురండి.
‌ఈశా మహాశివరాత్రి 2026 ఉత్సాహభరితమైన వేడుకలలో
15 February 2026
సా. 6 గంటల నుండి
ఉ. 6 గంటల వరకు
తరచుగా అడిగే ప్రశ్నలు