మీ శరీరంపై, బుద్ధిపై, భావోద్వేగాలపై, ఇంకా జీవ శక్తులపై పట్టు సాధించటానికి అలాగే జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా జీవించటానికి అవసరమైన సాధనాలను అందించే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్.
ఇన్నర్ ఇంజినీరింగ్ అనేది సద్గురు రూపకల్పన చేసిన ఒక పరివర్తనాత్మక ప్రోగ్రామ్. ఇందులో సులభమైన యోగా సాధనలు, సెషన్‌లు, సద్గురు చేయించే ధ్యాన ప్రక్రియలు, అలాగే శాంభవి మహాముద్ర క్రియ అనే శక్తివంతమైన 21 నిమిషాల యోగ సాధన యొక్క ప్రసరణ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మీలో ఆరోగ్యం, ఆనందం, పరవశం అనే బలమైన పునాదులను కలిగించి మీలో అమితానంద తత్వాన్ని పెంపొందిస్తుంది.
ఒత్తిడిలో 50% తగ్గుదల
మన శరీరపు సహజ యాంటిడిప్రెసెంట్స్ అయిన ఆనందమైడ్ స్థాయిలు పెరిగాయి
నిద్ర నాణ్యత మెరుగుపడింది
శక్తి స్థాయి, ఆనందం ఇంకా ప్రభావశీలత మెరుగయ్యాయి
భావోద్వేగాల్లో సమతుల్యత, మానసిక స్థిమితం పెంపొందాయి
వివరాలు చూడండి
“మనందరికీ పారవస్యంతో ఇంకా అంతర్గత శ్రేయస్సుతో జీవించగలిగే సామర్ధ్యం ఉంది – అందుకోసం మన లోపల సరైన వాతావరణం సృష్టించుకోవాలంతే”
1/4
జీవితపు విధి విధానాలు
“ఈ భూమి మీద అత్యంత అధునాతనమైన యంత్రం మానవ శరీరం. కానీ మీరు ఇంకా వినియోగదారుల సూచనల పుస్తకాన్ని చదవలేదు. ఇప్పుడైనా తెలుసుకుందాం” —సద్గురు
ఒకే ఒక బంధనం
“మీ కోరికల్ని పూర్తిగా విహరించనివ్వండి; వాటిని పరిమితం చేసుకోకండి. ఎల్లలు లేని మీ కోరికలోనే మీ అత్యున్నత స్వభావం దాగుంది.” -సద్గురు
సంపూర్ణంగా జీవించడం
“మీరు నిరంతరాయంగా విస్తరిస్తున్నప్పుడే, జీవం మీకు సంపూర్ణంగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. సంపూర్ణంగా జీవించడం అనేదే ఒక జీవంగా మీరు పొందగల ఏకైక సార్ధకత.”—సద్గురు
మీరు మీ ఆలోచన కాదు
"అనుక్షణం మీ జీవితాన్ని సుముఖతతో నిర్వహించినప్పుడే, మీరు దాన్ని స్వర్గంగా మలుచుకోగలరు. మీరు విముఖంగా చేసే ప్రతీ పనీ ఖచ్చితంగా నరకమే అవుతుంది." - సద్గురు
మనస్సు - ఒక అద్భుతం
“చాలామంది వాళ్ళ మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మీ మనసును దాని పూర్తి సంభావ్యతకు విముక్తి చేయాలన్నదే నా కోరిక.” -సద్గురు
మీకు కావలసినది సృష్టించుకోండి
“మీ కుశలత ఇంకా రుగ్మత, మీ ఆనందం ఇంకా దుఃఖం, అన్నీ మీ లోపలి నుండే పుడతాయి. మీరు శ్రేయస్సు పొందాలంటే, అంతర్ముఖులవ్వాల్సిన సమయం వచ్చింది.” -సద్గురు
7 వ స్టెప్పు, నిర్ణీత తేదీల్లో లైవ్‌లో అందించబడుతుంది.
స్టెప్ 7
శాంభవీ క్రియ ప్రసరణ
“శాంభవి మహాముద్ర, సృష్టి మూలాన్ని స్పృశించే సాధనం. మీ అంతర్గత మూలాన్ని స్పృశించడం ద్వారానే , పరివర్తన సాధ్యమవుతుంది.”-సద్గురు
యోగాలో పూర్వానుభవం అక్కర్లేదు.
వెబ్‌లో, అలాగే సద్గురు యాప్‌లో అందుబాటులో ఉంది
నిశ్సబ్దమయిన ఏకాంత స్థలం.
యోగ సాధనకు సరిపడేలా, సుమారు 3x6 అడుగుల స్థలం సరిపోతుంది.
15 ఏళ్ళు పైబడిన వారంతా అర్హులే.
మీరు 18 ఏళ్ల లోపు వాళ్ళు అయితే, మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, మీ తల్లి/తండ్రి/సంరక్షకుల చేత support.ishafoundation.org లో సపోర్ట్ రిక్వెస్ట్ నమోదు చేయించండి.
1/5
జ్ఞాననిధి లాంటి సద్గురు వీడియోలు మీ ఇన్నర్ ఇంజినీరింగ్ అనుభావాన్ని మరింత లోతుగా మారుస్తాయి.
సద్గురు యాప్ లో, 40 రోజుల గైడెడ్ శాంభవీ క్రియ మండల ఫీచర్‌ను పొందండి.
భావస్పందన, శూన్య ఇంటెన్సివ్, సంయమ లాంటి ఈశా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ లలో పాల్గొనండి.
సాధన సెషన్‌లు, సాధన రివ్యూలు, సాధన కరెక్షన్లు మరియు ప్రశ్నోత్తరాల సెషన్‌ల రూపంలో ప్రత్యక్షంగాను అలాగే ఆన్లైన్ ద్వారా సహకారం పొందండి.
ఈశా కార్యక్రమాలలో, పలు కేంద్రాలలో వాలంటీర్‌గా ఉంటూ సద్గురు తలపెట్టిన ”కాన్షియస్ ప్లానెట్“ లో భాగస్తులయి ఎన్నో రకాల కార్యకలాపాల్లో నిమగ్నం అవండి.
NaN/5
ఈ ప్రోగ్రామ్ ఇంగ్లీష్, తమిళం,
హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ ఇంకా బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
శ్రేయస్సుని చేకూర్చే సాధనాలను అందరికీ అందుబాటులోకి తేవాలనే మా ప్రయత్నంలో తక్కువ ఫీజుకే అందించబడుతోంది.
Frequently Asked
Questions
ప్రోగ్రామ్ సమాచారం
పాల్గొనేందుకు అర్హత
వ్యవధి ఇంకా వేళలు
తేదీ మార్చుకోవడం
సాంకేతిక పరమైనవి
ఇన్నర్ ఇంజినీరింగ్ రిట్రీట్
ఇండియా లోని ఈశా యోగా కేంద్రం లో, మరియు అమెరికాలోని ఈశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్ లో జరిగే నాలుగు రోజుల ప్రోగ్రామ్.
మీ సమీపంలోని సెంటర్లలో ఇన్నర్ ఇంజినీరింగ్
ప్రపంచ వ్యాప్తంగా అనేక సెంటర్లలో, శిక్షణ పొందిన 'ఈశాంగా'ల ద్వారా ఈ ప్రోగ్రాములు అందించబడుతున్నాయి.