Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
యోగ అంటే మీ వ్యక్తిత్వం యొక్క సరిహద్దులను చెరిపివేసి, విశ్వంతో ఏకత్వాన్ని అనుభూతి చెందడం.
మీరు అచేతనంగా చేసేవన్నీ, సచేతనంగా కూడా చేయవచ్చు. అజ్ఞానానికి, జ్ఞానోదయానికి మధ్య తేడా ఇదే.
ఈ సృష్టి మానవ కేంద్రితం కాదు. ఈ విశ్వంలో మీరు ఒక చిన్న రేణువు మాత్రమే.
మీకు ఎవరిపట్ల గానీ, దేనిపట్ల గానీ ఎలాంటి కర్తవ్యమూ లేదు. మీలో ప్రేమ, శ్రద్ధ ఉంటే అవసరమైనది మీరే చేస్తారు.
అధికారం సత్య ప్రమాణం కానక్కర్లేదు, సత్యమే ఏకైక ప్రమాణం.
నిర్ధారణలు, స్పష్టత లేకుండానే మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ప్రమాదకరం.
మనసు ఒక పిచ్చి. మీరు మనసుకు అతీతంగా వెళ్ళినప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది.
మట్టి ఒక సజీవ అస్తిత్వం - అది మన సొత్తు కాదు. అది మనకు వారసత్వంగా వచ్చిన సంపద. భవిష్యత్ తరాలకు మనం దాన్ని సజీవమైన మట్టిగా అందించాలి.