Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీరు అచేతనంగా చేసేవన్నీ, సచేతనంగా కూడా చేయవచ్చు. అజ్ఞానానికి, జ్ఞానోదయానికి మధ్య తేడా ఇదే.
మనసు ఒక పిచ్చి. మీరు మనసుకు అతీతంగా వెళ్ళినప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది.
మట్టి ఒక సజీవ అస్తిత్వం - అది మన సొత్తు కాదు. అది మనకు వారసత్వంగా వచ్చిన సంపద. భవిష్యత్ తరాలకు మనం దాన్ని సజీవమైన మట్టిగా అందించాలి.
ఈ సృష్టి మానవ కేంద్రితం కాదు. ఈ విశ్వంలో మీరు ఒక చిన్న రేణువు మాత్రమే.
మీలో ప్రతి ఒక్కరూ ధ్యానలింగాన్ని అనుభూతి చెందాలని నా ఆకాంక్ష మరియు ఆశీస్సులు. ప్రపంచంలో మీరెక్కడ ఉన్నా, ఈ సంభావ్యతకు సుముఖంగా ఉంటే, విముక్తి బీజం మీ సొంతం.
అధికారం సత్య ప్రమాణం కానక్కర్లేదు, సత్యమే ఏకైక ప్రమాణం.
నిర్ధారణలు, స్పష్టత లేకుండానే మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ప్రమాదకరం.
ఇవ్వడంలో, తృప్తి ఉంటుంది.