Maha Annadanam

లక్షలాదిమందికి అన్నదానం చేయడానికై మాకు సహకరించండి!

చరిత్ర లిఖించడానికి మునుపే, ప్రపంచమంతటా ‘భోజనానికీ – ప్రాణానికీ’ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ప్రజలు గుర్తించారు. సంస్కృతంలో ‘అన్నదానం’ అంటే భోజనం పెట్టడమని అర్ధం.

భారతీయ సంస్కృతిలో అన్నదానం చేయడం ఎంతో పవిత్రమైన కర్తవ్యంగా భావించారు. భారత ఉపఖండంలోని అన్ని సమాజాలలో, పూజనంతరం ప్రసాదాన్ని వితరణ చేయకుండా లేదా అన్నదానం చేయకుండా ఏ పండుగా, ఏ ఉత్సవమూ పరిపూర్ణం అయినట్లుగా భావించరు.

మనం ఆహారాన్ని మన పితృదేవతలకు, దేవతలకు, సన్యాసులకు, పెద్దలకు, యాత్రికులకు, అంతే కాకుండా బంధు మిత్రులకు, అతిథులకు, జంతువులతో సహా ఆకలితో ఉన్న ఎవ్వరికైనా అర్పిస్తాం.

యుగ యుగాలుగా ఉన్న ఈ సంప్రదాయం మూలంగానే మునులు, ఋషులు దేశం నలుమూలలా ఆధ్యాత్మిక శాస్త్రాలను వ్యాపింపజేస్తు ఈ ఉపఖండంమంతా సంచరించగలిగారు.

ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన రాత్రి తెల్లవార్లూ జరిగే వేడుకలలో పాల్గొనే లక్షలాదిమందికి మహా అన్నదానం జరుపబడతుంది. అన్నదానానికి విరాళాలను అందించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము.