అతీతమైన పార్శ్వాన్ని తెలుసుకోండి.
ఉపదేశం ఇంకా ఉద్యాపన ఆన్లైన్ ద్వారా జరుగుతాయి.
28 డిసెంబరు 2021 న ఉపదేశం
Registration Closed
అతీతమైన పార్శ్వాన్ని తెలుసుకోండి.
ఉపదేశం ఇంకా ఉద్యాపన ఆన్లైన్ ద్వారా జరుగుతాయి.
28 డిసెంబరు 2021 న ఉపదేశం
Registration Closed
భైరవి సాధన అనేది లోపలి నుండి భక్తిని వెలికి తీసేందుకు ఒక అవకాశం.
ఈ సాధన ఉత్తరాయణం ప్రారంభంలో మొదలవుతుంది, అప్పుడు సూర్యుని కదలిక ఉత్తర అర్ధగోళానికి మారుతుంది, అది ఆధ్యాత్మిక గ్రహణశక్తికి అనుకూలమైన సమయం.
ఉపదేశం, స్త్రీలకు ఇంకా పురుషులకు ఒకే రోజున జరుగుతుంది, అయితే, స్త్రీలకు సాధన తాయిపూసం రోజున (తాయి మాసం లోని పౌర్ణమి రోజున) ముగుస్తుంది, అలాగే పురుషులకు తాయి అమావాస్య రోజున (తాయి మాసం లోని అమావాస్య రోజున) ముగుస్తుంది.
స్త్రీలకు ఉద్యాపన: జనవరి 18 2022
పురుషులకు ఉద్యాపన: జనవరి 31 2022
ఒకరు ఆకాంక్షించేది ఏదైనా సరే, అది ఆరోగ్యమైనా సంపద అయినా జ్ఞానమైనా ముక్తి అయినా - దేవి వాటన్నింటినీ ఇంకా వాటికి అతీతమైన వాటిని కూడా ప్రసాదించగలదు
గ్రహణ శీలతను పెంచుకునేందుకు ఒక తీక్షణమైన ప్రక్రియ.
ప్రత్యేక సాధనలు, క్రతువులు, ఇంకా అర్పణల ద్వారా దేవి అనుగ్రహాన్ని పొందండి.
మీ ఇంటి సౌకర్యం నుండే ఆన్లైన్‍లో ఉపదేశం ఇంకా ఉద్యాపన.
1వ స్టెప్పు: ఈ సాధన కోసం రిజిస్టర్ అవ్వండి
2వ స్టెప్పు: ఉపదేశం రోజుకి ముందు దీక్షకు సంబంధించిన ఓరియంటేషన్ వీడియోను చూడండి. (ఒకసారి రిజిస్టర్ అయ్యాక, మీకు అది ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది)
3వ స్టెప్పు: డిసెంబరు 28, 2021 న ఆన్లైన్ దీక్ష సెషన్‌కు హాజరుకండి (సమయము ఇంకా పాల్గొనేందుకు అవసరమైన లింకు మీకు మెయిల్ ద్వారా పంపబడతాయి)
4వ స్టెప్పు: చెప్పిన సమయం వరకు, సూచనల ప్రకారం సాధన చేస్తూ ఉండండి.
5వ స్టెప్పు: ఉద్యాపన రోజుకి ముందు, ఉద్యాపనకు సంబంధించిన ఓరియంటేషన్ వీడియోను చూడండి. (ఒకసారి రిజిస్టర్ అయ్యాక, మీకు అది ఈ మెయిల్ ద్వారా పంపబడుతుంది)
6వ స్టెప్పు: స్త్రీలు జనవరి 18 న, పురుషులు జనవరి 31 న ఆన్లైన్ ఉద్యాపన సెషన్‌కు హాజరుకండి.
భైరవి సాధన కిట్టు(ఈషా లైఫ్ లో ఆర్డర్ చేయండి). అందులో ఈ కిందివి ఉంటాయి:
దేవి ఫోటో
అభయ సూత్ర
కుంకుమ
దేవి స్తుతి
మీరు దేవి పెండెంట్‌ను (అప్పటికే ఉన్నదైనా లేదా కొత్తదైనా) ధరించాలి. కావాలంటే ఈషా లైఫ్‌లో దాన్ని కొనవచ్చు.
దీపం(నువ్వుల నూనె, నెయ్యి, లేదా ఆముదం ఉత్తమం, ఇవి లేకపోతే అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర వెజిటేబుల్ ఆయిల్ వాడొచ్చు) లేదా కొవ్వొత్తి వాడొచ్చు (తేనెపట్టు మైనంతో చేసినది ఉత్తమం).
రోజువారీ నైవేద్యానికి పచ్చి శెనగలు లేదా నల్ల నువ్వులు
కావాలనుకుంటే, దేవి ఫోటో కింద ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచవచ్చు, కాటన్ వస్త్రం ఉత్తమం.
సాధనకు అవసరమైన అదనపు వస్తువులు:
తేనె
నల్ల మిరియాలు
కర్పూరవల్లి (మెక్సికన్ పుదీనా/క్యూబన్ ఒరేగానో). అది అందుబాటులో లేకపోతే, వేప ఆకులను (లేదా వేప పొడిని) ఉపయోగించవచ్చు.
తెలుపు లేదా లేత రంగు దుస్తులు
మొలకెత్తిన పెసలు
హెర్బల్ స్నానపు పొడి లేదా పచ్చి శెనగ పొడి. (తరచుగా అడిగే ప్రశ్నల విభాగంలో దీన్ని తయారు చేసుకునే వివరాలను చూడవచ్చు.)
ఈ వస్తువులన్నీ ఉపదేశం రోజుకి ముందే సిద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఎలా ఉపయోగించాలి అనే వివరాలు ఉపదేశం రోజున మీకు తెలుపబడతాయి.
దీక్క్షకు సంబంధించిన సెషన్‌లో సూచనలు ఇవ్వబడతాయి. అయితే, సాధన సమయంలో గుర్తుంచుకోవలసిన విషయాలు:
హెర్బల్ స్నానపు పొడిని ఉపయోగించి రోజుకు రెండుసార్లు స్నానం చేయడం (రసాయన ఆధారిత ఉత్పత్తులు వాడరాదు)
పొగ త్రాగరాదు
మద్యం సేవించరాదు
మాంసాహారం తినరాదు
రోజుకి 2 భోజనాలు మాత్రమే. మొదటి భోజనం మధ్యాహ్నం 12 గంటల తర్వాత చేయాలి.
తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం మంచిది.
ఈషా లైఫ్ షాపీ
మరింత సమాచారం కోసం లేదా ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి:
ఈ మెయిల్: bhairavi.sadhana@lingabhairavi.org
ఫోన్: +91-83000 83111