ఇప్పటికే రిజిస్టర్ అయ్యారా?

మీ శరీరంపై, బుద్ధిపై, భావోద్వేగాలపై, ఇంకా జీవ శక్తులపై పట్టు సాధించటానికి అలాగే జీవితాన్ని సంపూర్ణంగా, సంతోషంగా జీవించటానికి అవసరమైన సాధనాలను అందించే ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్

ఇన్నర్ ఇంజినీరింగ్ ఇప్పుడు సరికొత్త ఫార్మాట్‍లో!

కొత్తగా ఏమున్నాయి?

  • సద్గురు నుంచి కొత్త కంటెంట్

  • ప్రోగ్రామ్ అంతటా, ఆకట్టుకునే అనుభూతి కోసం అనేక విజువల్ మరియు ఇంటరాక్టివ్ అంశాలతో సుసంపన్నం చేయబడింది

  • మొబైల్ నోటిఫికేషన్‌లు మరియు రిమైండర్‌లతో, రోజువారీ జీవితంలో సాధనాలను భాగం చేసుకోవడానికి సహాయపడేలా రూపొందించబడింది

ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‍లో ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ కోర్సులో ఉన్న అన్ని అంశాలతో పాటు శక్తివంతమైన 21 నిమిషాల శాంభవి మహాముద్ర క్రియ ప్రసరణ కూడా ఉంటుంది.

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్‍కి ఇంతకుముందే రిజిస్టర్ చేసుకున్న వారి కోసం:

  • తగ్గింపు ఫీజుతో కొత్త ప్రోగ్రామ్ ఫార్మాట్‍కి రిజిస్టర్ చేసుకునేందుకు, ఇదొక మంచి అవకాశం. మీకు వర్తించే ఫీజుని తెలుసుకునేందుకు ఈ క్రింద ఉన్న ఫామ్‍లో మీ వివరాల్ని ఇవ్వండి.

  • మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మీ ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రయాణాన్ని నిరంతరాయంగా కొనసాగించవచ్చు. ఉదాహరణకు, మునపటి ప్రోగ్రామ్ వర్షన్‍లో మీరు సెషన్ 2 పూర్తి చేసి ఉన్నట్లయితే, ఇప్పుడు కొత్త ప్రోగ్రా‍మ్‍లో స్టెప్పు 3 తో ప్రారంభించవచ్చు.

మీరు ఇప్పటికే శాంభవి మహాముద్ర క్రియలోకి దీక్ష తీసుకున్నట్లయితే, ఇప్పుడు తగ్గింపు ఫీజుతో మీరు ప్రోగ్రా‍మ్‍కి మళ్ళీ రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ప్రోగ్రామ్ వివరాలు

మొత్తం వ్యవధి: సుమారు 25 గంటలు
లేదా
సెషన్‌లు అన్నీ ఆన్లైన్‌లో జరుగుతాయి.

మొదటి 6 స్టెప్పులు, మీ వీలును బట్టి అనుకూలంగా పూర్తి చేయొచ్చు. 

స్టెప్ 1

జీవితపు విధి విధానాలు

“ఈ భూమి మీద అత్యంత అధునాతనమైన యంత్రం మానవ శరీరం. కానీ మీరు ఇంకా వినియోగదారుల సూచనల పుస్తకాన్ని చదవలేదు. ఇప్పుడైనా తెలుసుకుందాం” —సద్గురు

స్టెప్ 2

ఒకే ఒక బంధనం

“మీ కోరికల్ని పూర్తిగా విహరించనివ్వండి; వాటిని పరిమితం చేసుకోకండి. ఎల్లలు లేని మీ కోరికలోనే మీ అత్యున్నత స్వభావం దాగుంది.” -సద్గురు

స్టెప్ 3

సంపూర్ణంగా జీవించడం

“మీరు నిరంతరాయంగా విస్తరిస్తున్నప్పుడే, జీవం మీకు సంపూర్ణంగా జీవించే అవకాశాన్ని ఇస్తుంది. సంపూర్ణంగా జీవించడం అనేదే ఒక జీవంగా మీరు పొందగల ఏకైక సార్ధకత.”—సద్గురు

స్టెప్ 4

మీరు మీ ఆలోచన కాదు

"అనుక్షణం మీ జీవితాన్ని సుముఖతతో నిర్వహించినప్పుడే, మీరు దాన్ని స్వర్గంగా మలుచుకోగలరు. మీరు విముఖంగా చేసే ప్రతీ పనీ ఖచ్చితంగా నరకమే అవుతుంది." - సద్గురు

స్టెప్ 5

మనస్సు - ఒక అద్భుతం

“చాలామంది వాళ్ళ మనసును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు మీ మనసును దాని పూర్తి సంభావ్యతకు విముక్తి చేయాలన్నదే నా కోరిక.” -సద్గురు

స్టెప్ 6

మీకు కావలసినది సృష్టించుకోండి

“మీ కుశలత ఇంకా రుగ్మత, మీ ఆనందం ఇంకా దుఃఖం, అన్నీ మీ లోపలి నుండే పుడతాయి. మీరు శ్రేయస్సు పొందాలంటే, అంతర్ముఖులవ్వాల్సిన సమయం వచ్చింది.” -సద్గురు

7 వ స్టెప్పు, నిర్ణీత తేదీల్లో లైవ్‌లో అందించబడుతుంది.

స్టెప్ 7

శాంభవీ క్రియ ప్రసరణ

“శాంభవి మహాముద్ర, సృష్టి మూలాన్ని స్పృశించే సాధనం. మీ అంతర్గత మూలాన్ని స్పృశించడం ద్వారానే , పరివర్తన సాధ్యమవుతుంది.”-సద్గురు

శాంభవి మహాముద్ర క్రియ గురించి సద్గురు మాటల్లో

ప్రోగ్రామ్‍ని

కొనసాగించండి

Isha Logo
Loading...

Secure payment gateway is opening.
Do not refresh or press the back button.