శివుడి రూపాలను అర్ధం చేసుకుందాం – భోళా శంకరుడు

Bholenath-blog-1050x700_tel

భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలో కొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు.  ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం….వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


భోళా శంకరుడు – ఈయన అమాయకుడు..!!

మనం శివుణ్ణి ఎంతో శక్తిమంతమైన వ్యక్తిగా చూస్తాము, కానీ ఆయనను ప్రాపంచిక లౌక్యం తెలియని వానిగా కూడా అనుకుంటాము. అటువంటి శివుడి రూపాల్లో ఒకదాన్ని భోళా శంకరుడు అని అంటారు, ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. “భోళా శంకరుడు” అంటే అమాయకుడు అని అర్ధం లేక అజ్ఞాని అని కూడా అనవచ్చు. ఎంతో మేధావులు కూడా ప్రాపంచిక విషయాల్లో తేలికగా మోసపోవటంచూస్తుంటాము. ఇలాంటివారు, వారి తెలివితేటలని లౌకికమైన వాటికి ఉపయోగించరు. నీచ స్థాయి తెలివితేటలు, కుటిలిమైన యుక్తి, ఇవి ఈ ప్రపంచంలోని మహా మేధావులను కూడా మోసగించగలవు. డబ్బు విషయంలోనో, సామాజిక విషయాలల్లోనో  అలాంటి తెలివితేటలుండటం గొప్పవిషయమే  కావచ్చు, కానీ, జీవితానికి సంబంధించినంతమటుకు  వాటికే  విలువా ఉండదు.

 ఆయన తెలివిలేనివాడని కాదు, కానీ లౌకికమైన వాటికి ఆయన తన మేధస్సును ఉపయోగించాలనుకోడు, అంతే!

ఇక్కడ మేధస్సు అని మనం అన్నప్పుడు మనం కేవలం యుక్తి గురించి మాట్లాడటం లేదు. మనం జీవితాన్ని పూర్తి స్థాయిలో వికసింప చేసే పార్శ్వాన్ని గురించి మాట్లాడుతున్నాము. శివుడు కూడా ఇలాంటి వాడే.ఆయన తెలివిలేనివాడని కాదు కానీ లౌకికమైన వాటికి ఆయన తన మేధస్సును ఉపయోగించాలనుకోడు, అంతే!

శివ పంచాక్షర స్తోత్రం

 

ప్రేమాశీస్సులతో,
సద్గురుఅనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *