స్త్రీల శివాంగ సాధన – దేవి కృపను పొందే అద్భుత అవకాశం!

devi8

స్త్రీల శివాంగ సాధన అనేది లింగభైరవి దేవి కృపను పొందటానికి స్త్రీలు చేసే 21 రోజుల సాధన. ఇది జనవరి 10న మొదలై, జనవరి 31, 2018న సమాప్తం అవుతుంది.

“మానవ మేధస్సు ప్రతీ విషయాన్ని కోసిచూసి, తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. మనోభావం ఐక్యమవ్వడం ద్వారా తెలుసుకుంటుంది. ‘స్త్రీల శివాంగ సాధన’ అనేది ఈ మనోభావాల ద్వారా గ్రహించడాన్ని పెంపొందించడానికి రూపొందించబడింది. ఎందుకంటే ఇది చాలా సులభమైన మార్గం. భక్తి అనేది దివ్యత్వాన్ని కోసి చూడటానికి కాదు, ఇది దివ్యత్వంతో కలిసి నృత్యం చేస్తూ, దానితో ఒకటి అవ్వటం. మీరు దివ్యత్వాన్ని కోసి చూడాలి అని అనుకుంటే మీరు ఏమీ తెలుసుకోలేరు. మీరు దానిని కౌగలించుకోవటమే అత్యుత్తమ మార్గం. మీరు ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు,  వారు మిమల్ని కౌగిలించుకోవటానికి కూడా అనుమతిస్తున్నారు. మీరు ఈ సాధనను పవిత్రమైన దానిగా పరిగణించి, కేవలం మనస్పూర్తిగా  చేస్తే, ఇది మీలో అధ్బుతాలను సృష్టిస్తుంది.

ఈ స్త్రీల శివాంగ సాధన మీలోని భక్తిని బయటికి తీసుకువచ్చే ఒక అవకాశం. ఈ 21 రోజుల సాధన ఉత్తరాయణం ఆరంభంలో, సూర్యుడు ఉత్తర గోలార్ధమునకు మారుతునప్పుడు, ఆధ్యాత్మిక విషయాలను గ్రహించడానికి అనువైన సమయంలో ఆరంభమవుతుంది. ఈ సాధన కోయంబత్తూరులోని లింగ భైరవి గుడిలో పవిత్రమైన తైపూసం, అంటే ధన్యపౌర్ణమి రోజున ముగుస్తుంది. దేవి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం కూడా ఇదే రోజు జరుగుతుంది. ప్రత్యేకమైన సాధనలు, క్రమశిక్షణ, అర్పణల ద్వారా సాధకులు దేవి కృపను పొందుతారు. ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా – ఆరోగ్యం, ధనం, జ్ఞానం లేక ముక్తి –వీటన్నిటినీ, ఇంకా వీటిని మించిన వాటిని ప్రసాదించే పరాశక్తి దేవి.”

“ ఈ సాధనను మీరు పవిత్రంగా భావించి, మనస్ఫూర్తిగా చేస్తే ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది .” – సద్గురు

సాధన వల్ల కొందరు భక్తులకు కలిగిన అనుభూతులు

“దేవి సాధనా సమయంలో, నా రోజువారి పనులలోనే కాక, నా సాధనలో కూడా ఆమె కృప నాకు ఎంతో సహాయపండింది. నా చూట్టూ ఉన్న శక్తిభరిత స్థలం వల్ల ఆమె ఎప్పుడూ నాతోనే ఉన్నట్లు – ఒక స్నేహితురాలిగా పంచుకుంటూ, అమ్మలా కాపాడుతూ, సదా నాకు మార్గనిర్దేశం చేసినట్లు అనిపించింది.”

స్ఫూర్తి, ఫాషన్ కన్సల్టెంట్,ముంబై

“నేను గత రెండు సంవత్సరాలుగా ఈ సాధన చేస్తునాను.ఈ సాధన చేసిన ప్రతీసారి దేవీ కృపతో నేను కప్పబడినట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ సాధన నాలో అందరితో కలిసిపోయే తత్వాన్నీ, అడ్డంకులని అధిగమించే దృడ సంకల్పాన్ని కలిగించాయి. ఈ అనుభవాన్ని పొందే అవకాశాన్ని నాకు కల్పించిన  సధ్గురుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని”

జయశ్రీ శంకర్ , డైరెక్టర్, సుబ్రమణ్య గ్రూప్ అఫ్ కంపనీస్, టూటికోరన్

రిజిస్ట్రేషన్ కొరకు మీ దగ్గరిలోని ఈశా యోగ సెంటర్‌ని సంప్రదించండి.

భారతదేశంలో : +91 83000 83111 లేదా shivanga@lingabhairavi.org
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *