సద్గురు వారం రాబోయే నవరాత్రి ప్రత్యేకత ఏమిటో, మనిషిలోని గుణాన్ని అది విశ్లేషిస్తుందో, లక్షణం మనల్ని ఇతర జీవరాశులనుండి  వేరుచేసి చూపిస్తుందో – వీటన్నిటి గురించి ప్రస్తావిస్తారు. సందర్భంలో దేవి ... మహిషాసురుణ్ణి మర్దించడం వెనుకనున్న ప్రతీకాత్మత ఏమిటో వివరిస్తారు.

దైవత్వానికి ప్రతిబింబాలైన భూమి, చంద్రుడు, సూర్యుడు మొదలైన వాటితో మానవ నిర్మాణానికి గల అనుబంధాన్ని సునిశితంగా మన సంస్కృతి పరిశీలన చేసింది. మన సంస్కృతి మూలాలకు ఇదే పునాది. ఇదే మనం పండుగలను ఎప్పుడు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము అన్న దానిలో కూడా ప్రతిబింబిస్తుంది. మనం ఇప్పుడు దేవికి ప్రీతిపాత్రమైన సమయాన్ని సమీపిస్తున్నాము. ఆ సమయమే దైవత్వంలోని స్త్రీత్వాన్ని ప్రకటించే సమయం కూడా. నవరాత్రి అన్నదానికి  "తొమ్మిది రాత్రులు" అని అర్ధం. ఈ తొమ్మిదింటినీ, అమావాశ్య దాటిన మొదటిరోజు నుండి లెక్కిస్తారు. చాంద్రమాసంలో, మొదటి తొమ్మిదిరోజులూ స్త్రీత్వానికి ప్రతీకలుగాభావిస్తారు. తొమ్మిదవరోజుని నవమి అంటారు.  పౌర్ణమికి చుట్టుపక్కల ఒకటిన్నర రోజులు తటస్థంగా ఉండే రోజులు. మిగిలినరోజులన్నీ పుంసత్వానికి ప్రతీకలు. ఈ స్త్రిత్వానికి ప్రతీక అయిన సమయమే దేవికి చెందినది. అందుకనే మన సంప్రదాయంలో, నవమి వరకు చేసే పూజలన్నీ దేవికే అంకితం.

రాబోయే నవరాత్రి చాలా ప్రముఖమైనదిగా పరిగణించబడడానికి కారణం  అది విద్యకు అధిదేవత అయిన శారదకి  అంకితం చెయ్యబడటమే

ఏడాదిలోని పన్నెండుసార్లు వచ్చే ఈ తొమ్మిదిరోజుల కాలమూ దేవీ మీదా, దేవతలోని భిన్న పార్శ్వాలమీదా కేంద్రీకరించబడింది. రాబోయే నవరాత్రి చాలా ప్రముఖమైనదిగా పరిగణించబడడానికి కారణం  అది విద్యకు అధిదేవత అయిన శారదకి  అంకితం చెయ్యబడటమే. మనుషులు చెయ్యగలిగిన అనేక పనుల్లో, మన సంస్కృతి విద్యకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది. మిగతా జీవరాశులు మనకంటే వేగంగా పరిగెత్తగలవు; అవి మనకంటే బలమైనవి; మనం చెయ్యలేని అనేకపనులు అవి చెయ్యగలవు... కానీ, అవేవీ మనం నేర్చుకోగలిగినట్టు నేర్చుకోలేవు. మనిషికి గర్వకారణమైన విషయం ... అతనికి కోరిక ఉంటే, దేన్నైనా నేర్చుకోగలిగిన శక్తి కలిగి ఉండడం. కనుక ఈ నవరాత్రి మీరు ఏదైన కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండండి.

మిగతా జీవులనుండి మనన్ని ప్రత్యేకించి చూపించే ముఖ్యమైన విషయం దేవి మహిషాసురుణ్ణి మర్దించే రూపకల్పనలో అందంగా చిత్రించబడింది. సాంప్రదాయికంగా సగం మనిషీ, సగం దున్నపోతుగా చిత్రించబడ్డ మహిషాసురుడు, మనిషిలోని పశుత్వాన్ని సూచిస్తుంది. పరిణామక్రమం కారణంగా ఈ రోజు ఇలా ఉన్న మనలో, ఇంకా అమీబాకీ, వానపాముకీ, మిడతకీ, దున్నపోతుకీ, ఇలా అన్ని పశువులకీ చెందిన కొన్ని లక్షణాలు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకోలేని లక్షణాలు. ఆధునిక నాడీ శాస్త్రం మన మెదడులో కొంతభాగం ఇప్పటికీ సరీసృపానికి చెందినదిగా గుర్తిస్తుంది.  సరీసృపపు మెదడు ఈ పరిణామక్రమంలో అంతఃప్రేరణ ప్రబలంగా ఉన్నప్పటి సమయాన్ని సూచిస్తుంది.

మనిషి నిటారుగా నడవడం ప్రారంభించిన తర్వాత వెన్నెముక తిన్నగా తయారయి, ఈ సరీసృపపు మెదడుమీద "మస్తిష్క వల్కలం" Cerebral Cortex రూపొందింది. మనల్ని మనుషులుగా చేసేది అదే. విశ్వమంతా నిండిన అస్తిత్వంగురించి మిమ్మల్ని అలోచింపజేసి అన్ని ఒకటే అన్న విషయాన్ని మీరు గుర్తించేలా చేసేదీ ఇదే.  అదే మిమ్మల్ని శాస్త్రజ్ఞుడిగానో, వేదాంతిగానో మార్చేది. కానీ, మీరు మళ్ళీ సరీసృపపు మెదడు దగ్గరకి పొయినట్లయితే, మీకు కేవలం మిగిలేది మీ ఉనికి కొనసాగించడానికి కావలసిన అంతఃచేతన మత్రమే. విద్యా, జ్ఞాన సముపార్జన, ధ్యానం మొదలైన మానవ యత్నాలన్నీ, ఈ సరీసృపపు మెదడునుండి మస్తిష్క వలయానికి చేసే ప్రయాణం. ఇది జీవితంలో అన్నిటినీ కలుపుకుని పోయే తత్త్వాన్ని ప్రసాదిస్తుంది. మీరు మీ సరీసృపపు మెదడు పరిధిలోనే పనిచెయ్యడం ప్రారంభిస్తే, మీకు తెలిసేదల్లా సరిహద్దుల్ని గీసుకోవడం ఒక్కటే.

మీకూ, మీ చుట్టుపక్కల నున్న వారికీ సమస్యలు వస్తున్నాయంటే, అవి మౌలికంగా మీకూ వారికీ మధ్య నున్న హద్దుల గురించో, మీకు చెందినదీ వారికి చెందినదానికీ మధ్యనో అయి ఉంటుంది. మీరు మీ మెదడులో ఒక భాగం పరిమితులకులోబడి మాత్రమే పనిచెయ్యదలుచుకుంటే, మీరు చెయ్యవచ్చునేమోగాని, మీకున్న పరిపూర్ణమైన శక్తిని వినియోగించుకుని పనిచెయ్యలేరు. యోగా వ్యవస్థలో కొన్ని పద్ధతులున్నాయి, వాటిద్వారా ఒక రకంగా మీ సరీసృపపు మెదడుని మేల్కొలిపి, అది మస్తిష్క వల్కలంతో సమాచారాన్ని పంచుకుంటూ రెండూ ఒక్క మెదడుగా పనిచేసేట్టు చెయ్యవచ్చు. కొన్ని ధ్యాన మార్గాలు అనుసరించడం ద్వారా దీనిని సాధించవచ్చునని కొన్ని అధ్యయనాలు ఋజువుచేస్తున్నాయి. పువ్వు వికసించాలి. అందుకనే యోగ సంప్రదాయంలో పూర్తిగా వికసించిన కలువపూవు మనిషిలోని అన్ని శక్తి చక్రాలకీ ప్రతీక గానూ, అన్నిటికంటే పెద్ద పుష్పం తలమీదనున్న సహస్రార చక్రన్ని సూచించేదిగానూ ఉంటుంది.

మెదడులో శక్తి వికసిస్తే, మనిషిలోని మేధస్సు అందరినీ కలుపుకుంటూ పోయేదిశలో  పనిచెయ్యడం ప్రారంభిస్తుంది.

మెదడులో శక్తి వికసిస్తే, మనిషిలోని మేధస్సు అందరినీ కలుపుకుంటూ పోయేదిశలో  పనిచెయ్యడం ప్రారంభిస్తుంది. ఈ కలుపుకుంటూ పోవడం అన్నది వెదాంతం కదు. అది అస్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ సత్యాన్ని మరే ఇతర జీవీ గుర్తించలేదు. మీరందరూ సరిహద్దుల్ని సరిగా నిర్థారించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. కుక్క ఒక వస్తువుమీద మూత్ర విసర్జనచేస్తే, అది దానికి మూత్రవిసర్జన సమస్య ఉందని కాదు, అది దాని రాజ్యానికి హద్దులు గీసుకుంటోందని అర్ధం . మనుషులు అదే పని వేరే విధంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా తమ హద్దుల్ని గీసుకుంటూ, సాధ్యపడినపుడల్లా పెంచుకుంటూ పోతున్నారు. దేవి మహిషాసురుణ్ణి మర్దించడంలొని ప్రతీకాత్మత  మనిషిలోని మృగస్వభావాన్ని అణచడం.  అంటే మీరు పూర్తిగా వికసించిన పద్మం అవుతున్నారన్నమాట. మీకు మీ సరీసృప మెదడుని మేల్కొలిపే అవకాశం ఉంది. లేకపోతే, దేవి మిమ్మల్ని అణిచివేస్తుంది.

దాని మరోప్రతీకాత్మత, అంతః చేతనతో బ్రతకడం, పుంసత్వపు సహజలక్షణమని  సూచించడం. దానర్థం, సరీసృపపు మెదడు గట్టిగా బిగించిన పిడికిలి లాంటిది. స్త్రీత్వం లోన ప్రవేసిస్తే అది వికసిస్తుంది. అది వికసించినపుడు పుంసత్వం లేదా  పశుస్వభావం దాని పాదాల చెంత దాసోహమంటుంది. దేవీ- మహిషాసురుల ప్రతీకాత్మత సరిగ్గా అదే... ఆవిడలోని సంపూర్ణమైన శక్తి ఉప్పొంగింది... మహిషాసురుడనే పశుస్వభావం అణచబడింది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు