మామూలుగా శివుడి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తన భూషణాల ప్రత్యేకత గురించి కూడా ప్రస్తావనకు వస్తుంటుంది. అసలు వీటి ప్రాధాన్యత ఏమిటో, వాటిని తన వద్ద పరమశివుడు ఎందుకు ఉంచాడో తెలుసుకుందాం.

చంద్రవంకmoon

చంద్రుణ్ణి మనం సోముడని కూడా అంటాం ,ఈయన మత్తుకి మూల బిందువు. శివుడు ఓ గొప్ప యోగి, ఈయన ఎల్లప్పుడూ మత్తులోనే ఉంటాడు, కానీ పూర్తి ఎరుకతో. అందుకే, చంద్రవంకను ధరిస్తాడు. మీరు మత్తుని అస్వాదించగలగాలంటే, మీరు పూర్తి ఎరుకతో ఉండాలి. యోగులు ఉండేది ఇలానే – ఎల్లపుడు మత్తులో, కానీ పూర్తి ఎరుకతో.

త్రినేత్రం

isha_shiva_info 3rdeye

శివుడిలో అత్యంత ప్రాధానమైన విషయం అయన మూడో కన్ను తెరవడమే. మనకున్న రెండు నేత్రాలతో, మనం కేవలం భౌతికమైనవి మాత్రమే చూడగలం. మన అవగాహనలో ఒక కొత్త కోణం – దేని ద్వార అయితే మనం అభౌతికమైనవి అవగాహన చేసుకోగాలమో, ఆ నేత్రమే త్రినేత్రం.

 

త్రిశూలం

trishul

జీవితంలోని మూడు మౌలికమైన అంశాలకు త్రిశూలం ప్రతీకగా నిలుస్తుంది. ఈ మూడు అంశాలను మనం పింగల, ఇడ, సుషుమ్న లేదా పురుషుడు, స్త్రీ, దివ్యత్వం అనవచ్చు. ఇవి మానవ వ్యవస్థలోని శక్తి శరీరంలోని మూడు మౌలికమైన నాడులు – ఒకటి ఎడమ పక్కన ఉండేది, ఒకటి కుడి పక్కన, ఒకటి మధ్యలో ఉంటాయి.

నాగేంద్రుడు

Snakes_01

శివుడి శక్తి  అత్యత్తమ స్థాయిలో ఉందని తెలిపేదే నాగభూషణం. పాము, కుండలినిని సూచిస్తుంది. కుండలిని మేలో అబివ్యక్తం కానీ శక్తి. ఒక పాము చుట్ట చుట్టుకొని, కదలకుండా ఉంటే అసలు కనపడదు. కుండలిని కూడా ఇలాంటిదే, అది కదిలినప్పుడే, మీలో అంత శక్తి నిక్షిప్తమై ఉందని మీరు గ్రహించగలరు

 

 

నంది వాహనం

nandi

నంది అనంతమైన  నిరీక్షణకు నిదర్శనం. ఎవరికైతే ఊరికే కూర్చొని నిరీక్షించగలరో వారు సహజంగానే ధ్యానంలో ఉంటారు. నంది ఏంతో చురుకైనది, పూర్తీ ఎరుకతో, పరిపూర్ణమైన జీవంతో ఉంటుంది, కానీ అలా కోర్చోని ఉండగలదు. ఇదే ధ్యానం అంటే..!