మీరు మీలోని స్వర్గ నరకాలను రూపుమాపనంతవరకు, మీరు సత్యం దిశగా నడవలేరని సద్గురు వివరించారు. ఒక గుడ్డును పగలగొట్టినప్పుడు - అది బీటలు వారినప్పుడు, మీరు దానిలోపలికి పోలేరు, కానీ కొత్తదేదో బయటికి వస్తుందనే పోలిక చెప్పారు.

ప్రపంచంలో ప్రతిచోటా, మానవ సమాజాలమీద ఆధిపత్యానికి స్వర్గనరకాల విక్రయం జరిగింది. ఒక్కొక్క మనిషిని లేదా, మానవ సమూహాలను అదుపుచేయడం వాళ్లకు తెలియనప్పుడు, వాళ్లకు ఈ ఉపాయం వచ్చింది, "ఇప్పుడు నిన్ను మేము శిక్షించకపోతే, నిన్ను అక్కడ పట్టుకుంటారు. మీరు చూపించే ఈ మంచితనానికి, మీకు ఇక్కడ ప్రతిఫలం ఇవ్వలేకపోతే, తర్వాత అక్కడ అందిస్తాం".

కానీ సత్యమనేది ఈ ఉనికిలోని వాస్తవికత కన్నా భిన్నమైనధైతే, అక్కడికి వెళ్ళటం అంత విలువైనది కాదు. మనం "అసతోమా సద్గమయ" అని అన్నప్పుడు, దీని అర్ధం అసత్యం నుండి సత్యానికి గమనం అని అంటున్నట్టు. నిజానికి ఇది ప్రయాణం కాదు. "ప్రయాణం" అనే పదం పూర్తి చేయాల్సిన దూరం ఉందనే తలంపుని ఇస్తుంది. ప్రయాణించాల్సిన దూరమేమీ లేదు. తెలుస్కోవాల్సింది ఎంతో దూరంలో లేదు ఎందుకంటే మీకు తెలియాల్సినది కొండమీద ఏమీ లేదు, అది మీలోనే ఉంది.

స్వర్గనరకాలు ఉన్నవి మనలోనే

యోగా దాడి చేసే మొదటి అంశం స్వర్గ నరకాలే. స్వర్గ నరకాలున్నంతకాలం, అంతర్గత శ్రేయస్సు కోసం ఇంకా ముక్తి మార్గంలో నడిచే ప్రక్రియ అర్థరహితంగా ఉంటుంది ఎందుకంటే చిట్టచివరకు వెళ్ళవలసినవి రెండు చోట్లే - మీరు వెళ్తే చెడ్డ స్థలానికైనా వెళ్ళాలి లేదా మంచి స్థలానికి. ఎలాగోలా మీరు మంచి చోటుకు టికెట్ సంపాదించుకుంటే, మీరెలా జీవిస్తారనేది అనవసరం. ముఖ్యంగా మత సహకారాన్ని అడ్డం పెట్టుకుని, మనిషి ఎంతో మోటుగా జీవించేశాడు. మీరేం చేస్తారనేది అనవసరం, మీరు మతం చెప్పినదాన్ని నమ్మితే, కేవలం అదొక్కటి నమ్మితే, ఉత్తమగతికి మీకు టికెట్ సిద్ధం.

మీరు మీలో పనిచేస్తున్న స్వర్గ నరకాలను ఇప్పటినుండే నాశనం చేయకపోతే, నిజంగా మీరు సత్యంవైపు ప్రయాణం చెయ్యలేరు. ప్రస్తుతం, మీ ఈ శరీరం ఇంకా మనస్సు స్వర్గాన్నిగానీ నరకాన్నిగానీ సృష్టించగలవు; అవి రెండూ చేయగలవు. మీరెక్కడున్నారనేదానితో పనిలేదు, అవి స్వర్గం లేదా నరకాన్ని తయారుచేస్తున్నాయి.

మీ మనసు యొక్క విచక్షణా స్వభావం ఎటువంటిదంటే మీరు నరకాన్ని తయారుచేసుకుంటే, అది ఎక్కువ హింసాత్మకంగా మారినప్పుడు, మీరు కొద్దిగా వెనక్కి తగ్గుతారు. మీరు స్వర్గాన్ని తయారుచేసుకున్నప్పుడు, ఇది చాలా బావుంటుంది కాబట్టి, మీరు వాస్తవంతో సంబంధాన్ని కోల్పోతారు కానీ వాస్తవం మిమ్మల్ని మొట్టినప్పుడు, మీరు కొద్దిగా వెనక్కి తగ్గుతారు. కానీ మీరు మీ శరీరాన్ని కోల్పోయినప్పుడు, మీ విచక్షణ సామర్ధ్యాన్ని కూడా కోల్పోతారు. అప్పుడు, స్వర్గాన్ని సృష్టించే ప్రక్రియలో ఉన్న మనస్సు అదె పనిగా స్వర్గాన్ని సృష్టించటం మొదలుపెడుతుంది, లక్షల రెట్ల ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నరకాన్ని సృష్టించటంలో నిమగ్నమయ్యే మనస్సు దాని విచక్షణతో లక్షల రెట్ల నరకాన్ని అదే పనిగా సృష్టించేస్తుంది, మీరు అది ఎక్కువ అయ్యిందని గుర్తించి దానిని వెనక్కి తగ్గించే ఆస్కారముండదు ఎందుకంటే మీకు ఇప్పుడిక ఆ విచక్షణా సామర్థ్యం లేదు.

పూర్తి స్థాయి స్వర్గం లేదా నరకాన్ని నిర్మించటానికి కావాల్సిన నిర్మాణ సామాగ్రి, మీ శక్తులు పనిచేసే రూపంలోనే మీ చుట్టూనే ఉంటాయి. ఈ చట్రంలోనే ఇది ఎప్పుడూ ఇమిడి ఉంటుంది, కానీ ఇది స్వర్గ ప్రపంచం కావచ్చు లేదా నరక ప్రపంచం కావచ్చు. మీరు మీ విచక్షణ ననుసరించి నడుచుకుంటే, మీరు "నరకాన్ని నాశనం చేసి, స్వర్గాన్ని ఉంచుకుంటాను" అంటారు. కానీ అది ఎప్పటికీ జరుగదు ఎందుకంటే నిర్మాణ సామాగ్రి ఒకటే, అవే గదులు. కొంతమందికి అవి పారవశ్యపు గదులు, మరి కొందరికి అవి హింసాపూరిత గదులవుతాయి, ఏ క్షణమైనా ఇది ఒకదానినుంచి మరొకటిగా మారవచ్చు. ఇదొక లైట్ స్విచ్ లాంటిది. మీ దగ్గర రెండు రకాల స్విచ్ లు ఉంటే, ఒకటి తెలుపు లైట్, ఇంకోటి నీలం లైట్, మీరు నీలం లైట్ వేసుకుంటే, అది ఒకలాగ ఉంటుంది. మీరు తెలుపు లైట్ వేసుకుంటే, ఆకస్మాత్తుగా భిన్నమైన స్థలంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ చీకటిగా ఉన్నప్పుడు, ఎవరైనా స్విచ్ వేయటానికి తడబడితే, తెలుపు బదులు మీరు నీలం రంగు లైట్ వేయవచ్చు, అలాగే నీలం బదులు తెలుపు రంగు లైట్ వేయవచ్చు. ఇది తరచూ జరుగుతుంటుంది.

దీపాలు అర్పేయడం

ఎవరూ కూడా కేవలం నరకాన్ని నాశనం చేసి స్వర్గాన్ని ఉంచుకోలేరు. కానీ మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండవచ్చు,ఇదేదో నరకాన్ని మీ మనసులోంచి అదృశ్యం చేసే అవకాశం వల్ల కాదు. మీ విచక్షణా ప్రక్రియను బలోపేతం చేయటంవల్ల. నరకం ఇక ఎప్పుడూ దాని తివాచీలను బయటకు తీయకుండా ఉండేలా మీరు చూడవచ్చు. అది వీలుకాక పోవటంవల్లకాదు,మీరు దానిపట్ల అప్రమత్తతో ఉండటంవల్ల. ఇలా అప్రమత్తతో ఉండగలగడం కొంతవరకే సాధ్యం. ఏది పడితే అది సృష్టించగల ఈ నిర్మాణ సామాగ్రినంతా మీరు పారేయగలిగితే, అప్పుడు మీరు తెలుపు లేదా నీలం వంటి ఎటువంటి రంగు అవకాశం లేని ఒక చీకటి గదిలో కూర్చుంటారు. కానీ మీరు ఇప్పుడు ఎటువంటి దిశకు తిరిగారంటే, మీకు ఇక వెలుగుతో పని లేనేలేదు. కళ్ళు తెరిచి ఎక్కడికయినా వెళ్లే వాళ్లకే లైట్ అవసరం. ఎక్కడో ఉండి కళ్ళు మూసుకుని ఉన్నవాళ్లకు లైట్ అవసరం లేదు. వాళ్లకు లైట్ అంటే చికాకు.

పెంకను పగలగొట్టటం

అందువలన అసత్యం నుండి సత్యం వైపు చేసే పయనం నిజానికి భౌగోళిక దూరాన్ని దాటటం కాదు. ఇది ఒక గుడ్డుపై పెంకు లాంటిది - ఇప్పుడు మీరు ఆ పెంకుకి బయట ఉన్నారు. మీరు లోపలికి తిరగాలనుకుంటే, మీరు టాక్, టాక్, టాక్, అని గుడ్డుని తట్టాలి. అది పగిలితే మీరు లోపలికి పోవచ్చు అనుకుంటారు, కానీ కాదు, కోడిపిల్ల బయటికి వస్తుంది – ఇదే అసలు విషయం. లోపలికి వెళ్లాలనుకునే మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు. మీరు పగలగొట్టినప్పుడు, ఎవరూ లోపలికి వెళ్లరు, కానీ పూర్తిగా కొత్త అవకాశమే పుట్టుకొస్తుంది. అందుకే యోగాలో వికసించే వెయ్యి రేకుల పద్మం సహస్రారానికి ప్రతీక. మీరు పెంకను పగలగొడితే, మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త అవకాశం బయటికి పుట్టుకొస్తుంది.

మీరు ఈ పెంకుని పగలగొట్టాలని అనుకుంటే, మీరుగా దానిని చేయలేరు ఎందుకంటే అది మీరే. మిమ్మల్ని మీరు ఎలా పగలగొట్టుకుంటారు? మీకింకా దాన్ని చేయగల హృదయం లేదు. మనసు ఇలా అంటుండొచ్చు, "అవును, పగలగొడదాం, కోడిపిల్ల ఒకటి బయటికి వస్తుంది" అని. లేదు, మీకు మీరుగా దానిని పగలగొట్టే హృదయం మీకు లేదు.

అందుకే మీకు బయటినుండి ఒక సుత్తి కావాలి, సాధారణంగా దానిని అనుగ్రహం అంటారు. అది మీవైపు వచ్చేట్లుగా మీరు మిమ్మల్ని తయారు చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడు తన పన్ను వదులుగా అయినప్పుడు " దీన్ని ముట్టుకోవద్దు, దీన్ని ముట్టుకోవద్దు!" అంటాడు. తండ్రి "నన్ను చూడనీ, నన్ను చూడనీ" అంటాడు, తర్వాత... చక్!...పన్ను చేతిలోకి వచ్చేస్తుంది, అది వచ్చేసినందుకు పిల్లవాడు చాలా సంతోషిస్తాడు. పన్ను అలా బయటకి వచ్చేసినప్పుడు ఉండే అనుభవం మీకు గుర్తుందా? ఆ నొప్పి పోయింది, కేవలం ఆ శూన్యమైన భావన. మీరు దానితో చాలా రోజులు ఆడుకుని ఉండొచ్చు, కానీ మీకు మీరుగా దానిని ఎప్పటికీ పీకి ఉండరు. మనం కేవలం ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. సాధన అంటే అదే - మీ నోటిని తెరవటం. మీకు తెలుసా? అది అంత సులభం కాదు!

ప్రేమాశీస్సులతో,

సద్గురు