Sadhguruఇప్పటివరకూ జరిగింది: దేవ దానవుల మధ్య యుద్ధం నిరంతరం సాగుతోంది. అసురుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవిని సాయంతో చనిపోయిన అసురులను ప్రతిసారీ తిరిగి బతికిస్తున్నాడు. దేవతలు నిస్పృహులు అవుతున్నారు. దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు, తనని శిష్యుని చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వెళతాడు. శుక్రాచార్యుడు అందుకు అంగీకరించగా, అది గిట్టని అసురులు కచుడిని చంపుతారు. కచుని ప్రేమించిన శుక్రాచార్యుని కూతురు ‘దేవయాని’ తండ్రిని వేడుకోగా ఆయన కచుని బ్రతికిస్తాడు.

అసురులు తిరిగి కచుడిని చంపి అతని శరీర భాగాలను నూరి శుక్రాచార్యుని పానీయంలో కలిపి, అయన చేత త్రాగించారు. ఇప్పుడు కచుడు శుక్రాచర్యుని కడుపులో ఉండిపోయాడు, అతనిని బ్రతికించాలంటే శుక్రాచార్యుడు చనిపోవాలి. తప్పని పరిస్థితిలో సంజీవిని కచుడికి నేర్పించి అతను బ్రతికిన తరువాత, తనను బ్రతికించి అక్కడినుండి వెళ్ళిపొమ్మని శుక్రాచార్యుడు కచుడిని ఆదేశించాడు. అదేవిధంగా శుక్రాచార్యుడు కచుడిని బ్రతికించగా, చనిపోయిన శుక్రాచార్యుని, కచుడు బ్రతికించి అక్కడినుండి బయలుదేరగా దేవయాని వెళ్ళవద్దని ప్రాధేయ పడింది. కానీ, కచుడు వెళ్ళిపోయాడు.

దేవయాని శర్మిష్ఠ

అసుర రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ, దేవయాని తో స్నేహంగా ఉండేది. కురువంశానికి ఆది కారణం అనగల ఒక సంఘటన ఇక్కడ జరిగింది. ఇద్దరు స్నేహితురాళ్ళూ కలిసి నదీతీరానికి స్నానానికి వెళ్ళారు. శర్మిష్ఠ అసురులకు యువరాణి, దేవయాని శుక్రాచార్యుని కుమార్తె,  బ్రాహ్మణ వర్ణానికి చెందింది. అప్పటి సాంఘిక పరిస్థితులలో అగ్ర వర్ణంగా పరిగణింపబడేది. ఇద్దరూ తమ తమ బట్టలూ, నగలూ వేరువేరుగా పెట్టుకుని నదిలోకి స్నానానికి దిగారు.

మహాభారతం అంతా వరాలతోనూ, శాపాలతోనూ నిండి ఉంది. కానీ మీకు ఏది వరమో, ఏది శాపమో తెలియకుండా పోతుంది.

వారు నదిలో అటలాడుతుండగా పెద్ద గాలి వీచి వారి బట్టలు ఎగిరి ఒకటికొకటి కలిసిపోయాయి. ఇద్దరూ నదిలోనుండి బయటకు వచ్చాక, బట్టలు వేసుకునే తొందరలో కొన్ని దేవయాని బట్టలను శర్మిష్ఠ  వేసుకుంది. దేవయాని కొంత పరిహాసంగా, కొంత అహంభావంతో "నీ తండ్రి గురుపుత్రిక బట్టలను నీవెలా వేసుకున్నావు? అవి వేసుకంటే ఎలా ఉంది? ఇది ఎంతవరకు సమంజసం"? అని ప్రశ్నించింది.

శర్మిష్ఠ తప్పు తెలుసుకుంది కాని యువరాణి కావడంతో కోపంగా "నీ తండ్రి బిచ్చగాడు, నా తండ్రి ముందు తలవంచగా నా తండ్రి ఇచ్చిన దానితో మీరు జీవిస్తారు, నీ హోదా తెలుసుకుని ప్రవర్తించు" అంటూ దేవయానిని ఒక గోతిలోకి తోసి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వచ్చి దేవయాని తండ్రి వడిలో తలపెట్టి ఏడుస్తూ "యువరాణికి గుణపాఠం చెప్పాలి, పగతీర్చుకోవాలి" అని కోరింది. తన కూతురిని అవమానించినందుకు, యువరాణిని తన కూతురికి పనిమనిషిగా పంపాలని శుక్రాచార్యుడు కోరగా, సంజీవినీ విద్యతో తమకు యుద్ధంలో ఎంతో సహాయం చేస్తున్న అచార్యుని మాట కాదనలేక, దారిలేక, అసుర రాజు అందుకు ఒప్పుకున్నాడు.

మహాభారతం అంతా వరాలతోనూ, శాపాలతోనూ నిండి ఉంది. కానీ మీకు ఏది వరమో, ఏది శాపమో తెలియకుండా పోతుంది. జీవితానికి తనదైన ఒక విధానం ఉంది, ఈరోజు వరం రేపు శాపంగా, ఈరోజు శాపం రేపటి వరంగా మారవచ్చు. శర్మిష్ఠ, దేవయానికి పనిమనిషి కావడం శాపం అయింది. దేవయాని వివాహం యయాతితో కుదిరింది, శర్మిష్ఠ తనతో దాసిగా రావాలని దేవయాని పట్టుబట్టగా శర్మిష్ఠ అమెతో వెళ్ళింది.

యదు, కురు వంశ ఆరంభం

దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకున్న తరువాతైనా, అక్కడితో ఆ విషయం కట్టిపెట్టవలసింది, కాని ఆమె ఇంకాస్త బాధించాలనే అనుకుంటోంది, అందుకే పెళ్లి తరువాత కూడా శర్మిష్ఠ ఆమె దాసీగా వచ్చింది. యయాతి, దేవయానిలు భార్యా భర్తలుగా కాపురం చేస్తున్నారు. యయాతి, దేవయానిల పుత్రుడు “యదు”. యాదవులు ఈ యదు కులంలోని వారే.

దేవయాని దాసిగా ఉన్నా యువరాణి కావడంతో శర్మిష్ఠ ఎంతో హుందాగా, గౌరవనీయంగా ప్రవర్తించేది. దేవయాని కన్నాకూడా ఆకర్షణీయంగా ఉండేది. చివరికి యయాతి ఆమె ప్రేమలో పడ్డాక, వీరిద్దరి మధ్యా రహస్య సంబంధం ఏర్పడింది. వీరిద్దరి పుత్రుడు పురు, కురు వంశానికి తండ్రివంటివాడు. ఆసాంతమూ ఎన్నో రసవత్తరమైన కధలు ఉన్నాయి. మనం కాలగమనానికి తలవంచాలి.

మహాభారతం అంతా వరాలతోనూ, శాపాలతోనూ నిండి ఉంది. కానీ మీకు ఏది వరమో, ఏది శాపమో తెలియకుండా పోతుంది.

యయాతికి పెద్దకొడుకైన ‘యదు’ సహజంగా రాజు కావలసింది, మరో విచిత్ర సంఘటన వల్ల అతను రాజు కాలేదు. తన కుమార్తెకు ద్రోహంచేసి, దాసితో యయాతికి మరొక సంతానం కలిగినదని తెలిసి ఉగ్రుడై, శుక్రాచార్యుడు యయాతిని "నువ్వు యవ్వనం కోల్పోవుదువుగాక" అని శపించాడు. యయాతి ముసలి వాడైపోయాడు, ఇది సహించలేని యయాతి, తన కుమారుడు యదుడు యువకునిగా ఎదిగిన తరువాత "నీ యవ్వనం నాకు ఇచ్చి నన్ను కొన్నాళ్ళు సుఖపడనివ్వు తరువాత ఆ యవ్వనం నీకు తిరిగి ఇచ్చేస్తాను " అని కోరాడు. అందుకు యదుడు "మొదటనువ్వు నా తల్లికి ద్రోహం చేశావు, ఇప్పుడు నా యవ్వనానికి నన్ను దూరం చేస్తున్నావు" అంటూ నిరాకరించాడు. యయాతి కోపంతో "నువ్వు ఎప్పటికీ రాజువు కాకుందువు గాక" అని కొడుకుని శపించాడు.

శర్మిష్ఠకు పుట్టిన యయాతి రెండవ కుమారుడు “పురు” తనంతట తానే ముందుకు వచ్చి "మీరు నా యవ్వనాన్ని తీసుకోండి. ఇందులో నాకు ఎంతమాత్రమూ రుచిలేదు" అంటూ తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు. యయాతి యువకుడై కొంతకాలం అందులోని సౌఖ్యం అనుభవించి, పురుకి తిరిగి యవ్వనం ఇచ్చివేసి అతనిని రాజుని చేసాడు.

 

ఇంకా ఉంది..

మరిన్ని మహాభారత కథలు