జీవితం ఆనందంగా ఉండాలని కొరుకున్తున్నపటికీ , మనసు భావోద్వేగాలు  కూడా అదే మార్గంలో  ఎలా  ఉంచాలో , ఆనందాన్ని ఎలా సృష్టించాలో అనే దాని గురించి  సద్గురు ఏమంటున్నారో  వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము.


మీకు మీ జీవిత ప్రాధాన్యత ఏమిటో తెలుసా? మీరు చేస్తున్న ప్రతిదీ ఎందుకు చేస్తున్నారు?

మీరు సముద్రం దగ్గరకి వెళ్ళాలనుకొని, సముద్రం వైపు వెళుతుంటే, పరవాలేదు. కానీ మీరు ఒక కొండని ఎక్కాలనుకుని, సముద్రం కేసి నడిస్తే, అది మూర్ఖత్వం. అవునా, కాదా? అది ఖచ్చితంగా మూర్ఖత్వమే.

ప్రాధమికంగా, మీరు మీ జీవితంలోని ప్రతి పనినీ ఆనందం పొందడానికే ప్రారంభించారు, ఆ మార్గంలో వెళుతూ మీరు ఎలా తయారయ్యారంటే మీరు ఇప్పుడు ఏది, ఎందుకు చేస్తున్నారో మీకే తెలియకుండా పోయింది. అంటే, మీరు దేనినైతే ప్రధానమైనదని అనుకుంటున్నారో, అది మీ ఆనందం కన్నా లేదా మీ చుట్టూ ఆనందాన్ని సృష్టించడంకన్నా ముఖ్యమైనదని మీరు మీ ప్రవర్తనతో నిరూపిస్తున్నారు. అలా మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికీ, మీకూ ఆనందం లేకుండా చేస్తున్నారు.

ప్రపంచమంతా ఆనందంగా ఉండి మీరొక్కరే బాధగా ఉంటే, ఉండవలసిన విధానం ఇది కాదని మీకు వెంటనే తెలుస్తుంది. 

బహూశ జనాభాలో చాలా మంది మీలానే ఉన్నారు కాబట్టి, మీకూ ఇలా ఉండటం పర్వాలేదని అనిపించవచ్చు. మీరు ఇలా ఉండటం పర్వాలేదని మీకు ఎందుకు అనిపిస్తోందంటే, ప్రపంచంలో మీ వంటి మూర్ఖులు, అంటే ఆనందంగా లేని మూర్ఖులు చాలా మంది ఉన్నారు. మీరు ఇది అర్ధం చేసుకోండి. ప్రపంచమంతా ఆనందంగా ఉండి మీరొక్కరే బాధగా ఉంటే, ఉండవలసిన విధానం ఇది కాదని మీకు వెంటనే తెలుస్తుంది. ఇక్కడ ఆనందంలేని వారితో నిండిన ఒక పెద్ద వాతావరణం ఉంది. బాధగా ఉండటానికి వారందరికీ ఒక కారణం ఉంది. ఆశ్రమంలో కూడా, జనాలు బాధ పడటానికి చాలా కారణాలు కలిగి ఉండటాన్ని మీరు చూస్తున్నారా? మీకు అసలు బాధ పడటానికి  కారణం ఉండనిది ఎక్కడో నాకు చెప్పండి?

బాధ పడటానికి సాకులు వెతికే వ్యక్తికి ప్రపంచంలో ఎక్కడ సాకు దొరకదో నాకు చెప్పండి. ఉత్తర ధృవమా లేక దక్షిణ ధృవమా? అక్కడ కూడా ఒక సాకు ఉంటుంది. ప్రతి చోటా ఒక సాకు ఉంటుంది. అక్కడ మనుషులెవరూ లేకపోయినా కూడా, బాధగా ఉండటానికి మీరు ఏదో ఒక సాకు వెతుక్కుంటారు. మీరు ఎందుకు బాధగా ఉన్నారన్నది ముఖ్యం కాదు. మీరు బాధగా ఉండటానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. కేవలం మీకు సరిగా జీవించే వివేకం లేదు, అంతే!

మీ జీవితం ఆనందంగా ఉండాలని  కోరుకుంటోంది, కానీ మీ  మనసు, భావోద్వేగాలు  ఎక్కడికో వెళుతున్నాయి. మీ ఉద్దేశ్యం ఒక వైపు వెళ్లాలని, కానీ మీ జీవ శక్తులు వేరే వైపు వెళ్ళాలని అనుకుంటున్నాయి. అప్పుడు మీరు గందరగోళంలో ఉంటారు. అది మీకు నరకంగా ఉంటుంది. వేరేగా ఉండే మార్గం లేదు. మీరు ప్రతిదీ తప్పుగా చేసి, అంతా సరిగ్గా కావాలని కోరుకుంటారు. అది అలా జరగదు.

మీకు ఎప్పటి నుండో పైకి చూసి దేవుడికి మొరపెట్టుకుంటే ‘ అంతా సరిగా అవుతుందని’ చెబుతూ వస్తున్నారు, కానీ అలా జరగడం లేదు.  

మీకు ఎప్పటి నుండో పైకి చూసి దేవుడికి మొరపెట్టుకుంటే ‘ అంతా సరిగా అవుతుందని’ చెబుతూ వస్తున్నారు, కానీ అలా జరగడం లేదు. దీనిని మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే వారి జీవితంలో ఏ విషయాల్లో సరైన పనులు చేసారో, అవి మాత్రమే బాగా ఉంటాయి. వారి జీవితంలో ఆ అంశాలే బాగా ఉంటాయి. బహుశా వారు సరైన పనులు చేయడానికి దేవుడి ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకుని ఉండవచ్చు లేదా ఎవరి  సహాయాన్నైనా పొంది ఉండవచ్చు.

మీరు ఎవరి సహాయాన్నైనా పొందండి, అది నాకు అనవసరం. మీరు సరైన పనులు చేస్తే తప్ప, ఈ ప్రపంచంలో ఫలితాలు రావు.  ఇది ప్రకృతి ధర్మం. బాహ్య పరిస్థితి గురించి అయినా లేక అంతర్గత పరిస్థితి గురించి అయినా, అది అంతే! అది ప్రకృతి  ప్రాధమిక ధర్మం. మీరు సరైన పనులు చేస్తే తప్ప, ఫలితాలు రావు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు