నన్ను చాలా కాలంగా ఎరిగున్నవారు “సద్గురు ఎందుకు వారణాసి యాత్ర చేస్తున్నారు? వయసు పెరిగే కొద్దీ, ఆయన స్వభావం మెతక పడుతోందా?’’ అని ఆలోచించడం మొదలు పెట్టారు. సరే, మరి ఇప్పుడు ఈ కాశీ ప్రయాణం ఎందుకు?  ముఖ్యంగా, ఈ ఉనికిని రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి,  దేవుడు అనేవాడు ఎక్కడో కూర్చుని, అతనికి ఏమీ పని లేనప్పుడు ఈ బాహ్య ప్రపంచాని సృష్టించాడు. ఇది ఒక రకమైన నమ్మక వ్యవస్థ. మరోలా  చెప్పాలంటే,  ప్రజల దృష్టిలో దేవుడు అనబడేవాడు సర్వోత్కృష్టమైనవాడు.

ఆయనకు ఈ సృష్టితో ఏ సంబంధం లేదు; ఈ సృష్టి అతని నుండే  బయటకు వెలువడింది

ఆయనకు ఈ సృష్టితో ఏ సంబంధం లేదు; ఈ సృష్టి అతని నుండే బయటకు వెలువడింది. ఇక రెండవ విధానం ఏమిటంటే, ఈ సృష్టి అనేది “కస్మోజెనిక్” అని.  ఈ “కస్మోజెనిక్ ” అనేది రెండు గ్రీక్ పదాలు ‘కాస్మోస్’, ‘జెనిసిస్’ నుండి వచ్చినది. గ్రీక్ లో కాస్మోస్ అనే పదానికి “క్రమానుగతము” అని అర్థం. అంటే, ఒక పధకం ప్రకారం సృష్టించినది అని కూడా అనవచ్చు, పద్ధతి లేకుండా ఇష్టమొచ్చినట్లు చేసింది కాదు. అదేదో ఒకరి నోరు లేక చేతుల నుండి వెలువడింది కాదు, అది ఎరుకతో సృష్టించబడింది. ఎవరైనా కొంచం శ్రద్ధపెట్టి చుస్తే, ఇదంతా అస్తవ్యస్తంగా యధాలాపంగా  జరిగింది కాదని స్పష్టంగా తెలుస్తుంది. అది ఎల్లప్పుడూ తనలో నుంచే పరిణామ ప్రక్రియలో జరుగుతోంది అని తెలుస్తుంది. స్వతహాగా పరిణామం చెందగలిగిన ఈ సృష్టి లక్షణాలు, అనంతంగా పరిణామం చెందగల దాని సామర్ధ్యం  చూసిన యోగులు స్వయంగా చేయాలనుకున్నారు. , ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ఇంకా ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లో అనేక అద్భుతమైన ప్రయత్నాలు  చేశారు.

గ్రీసు దేశం లోని, డెల్ఫీలో వారు ఓ  చిన్నపాటి  కాశీని రూపొందించారు. ఇది  మీరు తప్పకుండా  చూడవలసింది. ముఖ్యంగా, , ఈ సృష్టిలో, ప్రతిదీ, ఏదో ఒక విధంగా ఈ విశ్వసూక్ష్మ ప్రతిరూపమని చెప్పవచ్చు - అదే సూత్రం మానవ శరీరానికి కూడా వర్తిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ, సుక్ష్మంగా ఉన్న బ్రహ్మాండానికి ప్రతిరూపమే. ఈ సూత్రం అనుసరించి చాలా విషయాలు రూపొందించబడ్డాయి. కాశీ నగరాన్ని అండాండానికి బ్రహ్మండానికి సంగమమైన ఓ యంత్రంగా   రూపొందించారు. దీనితో ఈ చిన్న మానవ జీవి బ్రహ్మాండంతో ఏకం కాగల మహోత్తర అవకాశం, ఆ సంగమంలోని బ్రహ్మానందాన్ని, ఆ సుఖాన్నితెలుసుకునే అవకాశం కల్పించారు. క్షేత్ర(రేఖా)గణిత పరంగా, కాశీ క్షేత్రం, ఈ విశ్వం,  అండాండం బ్రహ్మాండాల సంగమానికి ప్రతిరూపం. ఇలాంటి ఉపకరణాలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇటువంటి అభివ్యక్తికరణకు ధ్యానలింగం  ఒక ఉదాహరణ. మాకున్న పరిధులలో మేము విశ్వం యొక్క చిన్న గుళిక సృష్టించ గలిగాము. సాధకుడు సిద్ధంగా ఉన్నట్లయతే, అది అనంత అవకాశాలను అందిస్తుంది, ఎందుకంటే అది సర్వోత్తమ అవకాశాన్ని సాధ్యం చేస్తుంది.

కాశీ నగరాన్ని అండాండానికి బ్రహ్మండానికి సంగమమైన ఓ యంత్రంగా   రూపొందించారు. దీనితో ఈ చిన్న మానవ జీవి బ్రహ్మాండంతో ఏకం కాగల మహోత్తర అవకాశం, ఆ సంగమంలోని బ్రహ్మానందాన్ని, ఆ సుఖాన్నితెలుసుకునే అవకాశం కల్పించారు.

కాశీ లాంటి ఒక నగరాన్ని సృష్టించాలనుకోవడం ఒక వెర్రి ఆకాంక్ష. అది వారు వేల సంవత్సరాల క్రితమే  చేశారు. మానవ శరీరంలో నాడుల సంఖ్యకు సమానంగా 72,000 మందిరాలు నిర్మించారు. ఈ ప్రక్రియ మొత్తం  ఏమిటంటే, ఒక పెద్ద మానవ శరీరం నిర్మించి తద్వారా విశ్వ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం. ఈ కారణంచేతనే ‘మీరు కాశీకి వెళ్ళారంటే అంతే! ఆ ప్రదేశం వదిలి వెళ్లాలనిపించదు. ఎందుకంటే  మీరు విశ్వ స్వభావంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు. వేరే చోటుకు వెళ్ళాలని ఎందుకనుకుంటారు?’ అనే నానుడి వచ్చింది. కాశీ పురాణమంతా శివుడు ఇక్కడ నివసించాడనే ఆధారంగానే నడచినది. ఇది ఆయన శీతాకాలపు విడిది. ఆయన హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో సన్యాసిగా జీవించాడు, కానీ ఆయన ఒక యువరాణిని వివాహం చేసుకోవడం వల్ల, రాజీ పడాల్సి వచ్చింది. ఆయన ఒక సంస్కార పూర్వకమైన మనిషి కాబట్టి, మైదాన ప్రదేశాలకు తరలిపోవడానికి నిశ్చయించుకున్నాడు, ఆ సమయంలో కాశీ అత్యంత మహత్తరంగా నిర్మించిన నగరం కావడం చేత, అక్కడికి తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.

"నేను రాజుగా  ఉండాలంటే శివుడు కాశీని వదలి వెళ్ళాలని’’ దివోదాసుడు షరతు విధించాడు. .

ఇక్కడ ఒక అందమైన కథ ఉంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల శివుడు కాశీనీ వదిలి వెళ్ళ వలసి వచ్చింది. నగరాన్నిసరిగ్గా నిర్వహించకపోతే, కాశీ నగరం, ప్రాముఖ్యత కోల్పోతుందని దేవతలు భయపడ్డారు. వారు “దివోదాసుడు” అనే ఆయనను  రాజుగా ఉండమని  కోరారు. ‘‘శివుడు ఇక్కడ ఉంటే , ప్రజలు అందరు శివుని చుట్టూనే చేరుతుంటారు, అందుకని శివుడు ఇక్కడ ఉంటే  నేను రాజుగా ఉండడం సాధ్యం కాదు.  నేను రాజుగా  ఉండాలంటే శివుడు కాశీని వదలి వెళ్ళాలని’’ దివోదాసుడు షరతు విధించాడు. శివుడు, పార్వతి తో పాటు మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. కాని ఆయనకు అక్కడ ఉండాలని లేదు. శివుడు, కాశీకి తిరిగి రావాలనే ఉద్దేశంతో మొదట దూతలను పంపాడు. వారు వచ్చి నగరం నచ్చి, ముచ్చటపడి, తిరిగి వెళ్ళలేదు. అప్పుడు శివుడు 64 దేవతా స్త్రీలను  పంపుతూ “రాజు ఏదోవిధంగా అవినీతికి పాల్పడేలా చేయండి, ఆ కారణం చేత అతనిని కాశి నుండి బయటకు పంపి నేను కాశిలో ప్రవేశిస్తాను”  అని అన్నాడు. ఆ మహిళలు సమాజంలో అన్ని చోట్లకు చేరి, దానిని అవినీతిమయం చేసే ప్రయత్నం చేస్తుండగా, వారికి కూడా నగరం, నచ్చి, ముచ్చటపడి ఆ విషయం మరచిపోయి అక్కడే స్థిరపడిపోయారు. అప్పుడు శివుడు సూర్య దేవుణ్ణి  పంపించాడు, నగరంలోని అన్ని ఆదిత్య దేవాలయాలు ఆయనవే - ఆయన కూడా నగరాన్ని ఇష్టపడి తిరిగి వెళ్ళలేదు.

తను నియమించ బడిన కర్తవ్యం కన్నా, కాశీని ఎక్కువ ఇష్టపడిన కారణంచేత, శివునికి కావలసినది చేయలేక పోయానని సిగ్గుపడి, భయపడి, ఆయన ఆజ్ఞ అనుసరించలేదే అన్న బెంగతో సూర్యుడు దక్షిణం వైపుకు తిరిగి ఒక పక్కకు ఒరిగి స్థిరపడ్డాడు. అప్పుడు శివుడు బ్రహ్మని పంపారు. బ్రహ్మ స్వయంగా వచ్చి నగరం బాగా నచ్చడం వల్ల తిరిగి వెళ్ళలేదు. అప్పుడు శివుడు తను వేరెవ్వరినీ నమ్మలేనని. తనకు అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు గణాలను పంపాడు. వారిరువురూ వచ్చి, శివుడికి అతి నమ్మకస్తులు కావడంచే శివుడిని మరవలేదు. వారు కూడా కాశీతో ప్రేమలో పడ్డారు, వారు శివుడు ఉండడానికి కాశినే తగిన నగరమని, మందర పర్వతం కాదని, కాశీకి ద్వారపలకులుగా ఉండిపోయారు. శివుడు మరో ఇద్దరిని - గణేశుడు, ఇంకొకతన్ని పంపాడు. వారు వచ్చి నగర బాధ్యతలు స్వీకరించారు. తిరిగి వెళ్ళడంలో ఏమీ ఉపయోగం లేదని ఏమైనప్పటికీ శివుడు ఇక్కడికి రావాల్సిందేనని వారు నగర కాపలా, నగర నిర్మాణం  ప్రారంబించారు. దివోదాసుడు ఏ అవినీతికీ లొంగలేదు, అప్పుడు దివోదాసుడికి ముక్తి ఆశ చూపించి శివుడు మళ్ళీ కాశీకి తిరిగి వచ్చాడు.

ఇవన్నీ కాశీలో ఉండాలని వారు ఎంతగా ఆశించారో తెలియజెప్పే కథలు. వారు కాశీలో నివసించాలనుకున్నది సుఖాలకోసం కాదు, అక్కడ లబించే అంతులేని అవకాశాల కోసం. ఈ నగరం కేవలం ఒక నివాసస్థలం కాదు, ఇది అన్ని పరిమితులు దాటి వెళ్ళడానికి ఉపయోగపడే ఒక యాంత్రికత. ఈ చిన్న జీవి, బ్రహ్మాండంతో అనుసంధానం కాగలిగే యాంత్రికత, సాంకేతికత ఇది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు