ఆరోగ్యంగా, ధృడంగా ఉండడం, నిత్యం యోగా చేసుకోవడం ఆ తరువాత గుండెపోటా..? ఇదంతా ఎలా జరిగింది? ప్రవీణ్ కి దీని సమాధానం హాస్పిటల్ లో ఉండగానేనే తెలిసిపోయింది. ఏ కొలమానం ప్రకారం చూసినా ప్రవీణ్ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు. అతను సరైన బరువులోనే ఉంటాడు, పొగ త్రాగడం గాని, మద్యం సేవించడం గాని చేయడు. ప్రతిరోజు యోగ సాధన చేస్తాడు. ఒకరోజున ఇతనికి గుండెపోటు రావడం వల్ల ఆసుపత్రికి తీసుకువెళ్లవలసి వచ్చింది. అతని మనస్సంతా ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. ఈ గుండెపోటు ఎలా వచ్చింది...? అతని ప్రశ్నలకు ఒక సమాధానం దొరికింది.

నాకు ఏదో ప్రమాద పరిస్థితి ఉంది అని గ్రహించగలిగాను. నాకు ఛాతి భాగంలో కొంత అసౌకర్యంగా అనిపించింది. నిజానికి, చాలా అసౌకర్యంగా అనిపించింది. నేను హేమలతని నన్ను హాస్పిటల్ కి తీసుకునివెళ్ళమని చెప్పాలి అనుకున్నాను. ఈ ఆలోచనైతే నాలో వచ్చింది కానీ నాకు ఎంతో నిస్సహాయంగా అనిపించింది. నేనేమి చెప్పలేకపోయాను, ఏమి చేయలేకపోయాను. అలా నేల మీద  పడుకున్నాను అంతే. “అమ్మా, మేము స్కూల్ కి వెళ్లి వస్తాం” అని పిల్లలు ఆనందంగా చెబుతున్న శబ్దాలు నాకు వినిపించాయి. ఆ తరువాతి క్షణంలో నా కూతురు నా దగ్గరకు వచ్చి ఒక చిన్న స్వరంలో "నాన్న నువ్వు ఎందుకు ఇలా పడుకుని ఉన్నావు? ఇది నువ్వు ఉండే విధానం కాదు” అని తన అందమైన ముఖం, ఆ చిన్న ముఖం నాకు దగ్గరగా పెట్టి అంది. నేను, “ఏమి లేదమ్మా, నువ్వు స్కూల్ కి వెళ్లి రా” అని చెప్పాను.

“మీకు గుండెపోటు వచ్చింది, మీ ఆట్రి లో మీ రక్తం గడ్డ కట్టుకుపోయింది కాబట్టి మీకు గుండెపోటు వచ్చింద” ని డాక్టర్ చెప్పారు

కానీ తనకి తృప్తిగా అనిపించలేదు. తను వంట గదిలోకి వెళ్లి నా భార్య హేమలతతో నా గురించి చెప్పింది. తను చేసింది ఎంతో సరైన పని. హేమలత పిల్లలకి మీరు స్కూల్ కి వెళ్ళండి నేను నాన్నను చూసుకుంటాను అని చెప్పింది. తను బహుశా నాకు గుండెపోటు అని అర్ధం  చేసుకోలేదు. ఇదే నాకు మొదట కలిగిన గుండెపోటు. తను వెంటనే నా దగ్గరకు వచ్చి నన్ను చూసింది. “గుండెలో బాగా మంటగా ఉన్నట్టుంది. నేనేదైనా యాంటాసిడ్ ఇవ్వనా? ఆ తరువాత అది సరిగ్గా పని చేయకపోతే డాక్టర్ దగ్గరకి వెళ్దాం” అని చెప్పింది. దానికి నేను, “లేదు మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి” అని చెప్పాను. మేము  అరగంటలో ఒక హాస్పిటల్ చేరుకున్నాం. అదృష్టవశాత్తూ, విజయ హాస్పిటల్ లో డాక్టర్లు నన్ను వెంటనే ఐ.సి.యు లో పెట్టారు. వాళ్ళు అవసరమైన పరీక్షలు అన్నీ చేసారు. “మీకు గుండెపోటు వచ్చింది, మీ ఆట్రి లో మీ రక్తం గడ్డ కట్టుకుపోయింది కాబట్టి మీకు గుండెపోటు వచ్చింద” ని డాక్టర్ చెప్పారు.

మీరు గుండెపోటు మొదలవ్వగానే ఇక్కడకు వచ్చారు. అందుకని మేము ఒక ఇంజక్షన్ ద్వారా దీన్ని కరిగించడానికి ప్రయత్నిస్తాము. “మేము మూడు ఇంజెక్షన్లు ఇవ్వగలము. వచ్చే మూడు గంటల్లో మీ శరీరం కనక దీనికి అనుకూలించకపోతే, ఆ తరువాత ఇంకా సంక్లిష్టమైన ప్రక్రియను చేయాల్సి ఉంటుంది” అని డాక్టర్లు చెప్పారు. నేను అందుకు సుముఖంగా అంగీకరించాను. వారు ఇంజక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. మొదటి ఇంజక్షన్ ఇచ్చి, డాక్టర్ గారు గడియారాన్ని చూడడం మొదలుపెట్టారు. నర్సులు హార్ట్ మానిటర్ చూస్తూ వారి ముఖాలు కొంచెం విచారంగా, కొద్దిగా ఒత్తిడిలో ఉన్నట్టుగా కనిపించాయి. రెండో ఇంజక్షన్ ఇచ్చారు. డాక్టర్లు, నర్సులు నవ్వడం మొదలుపెట్టారు. ఒకరు వారి చేయిని ఆనందంగా ఎత్తి, “ఇతను బానే ఉన్నాడు” అని చెప్పారు. నేను కొద్ది సమయంలోనే మాములు పరిస్థితికి    చేరుకున్నాను. “రక్తంలో కట్టిన గడ్డ కరిగిపోయింది. మీరు ఎంతో అదృష్టవంతులు, మీరు ఇక్కడకు సరైన సమయానికి వచ్చారు. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది” అని డాక్టర్ నవ్వుతూ నాతో చెప్పారు.

నా నొప్పి తగ్గిపోయినప్పటికీ, నా మనస్సులో ఎన్నో వేల ప్రశ్నలు ఉన్నాయి. అసలు నాకిలాంటి గుండెపోటు ఎందుకు వచ్చింది అని నేను ఆశ్చర్యపోయాను. మూడు సంవత్సరాల క్రితం 2013 లో నేను "శాంభవి మహా ముద్ర  దీక్షను" తీసుకున్నాను. అప్పట్లో నాకు విపరీతమైన కీళ్ల నొప్పులు, ఇంకా నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతో ఎక్కువగా ఉండేవి. అప్పట్లో నేను మరొక సంస్థ నుంచి యోగ చేయడం నేర్చుకున్నప్పటికి ఇవి ఈ విధంగానే ఉన్నాయి. నేనెప్పుడు పొగ త్రాగడం గాని మద్యం సేవించడం గాని చేయలేదు. నా బరువు సమానంగా ఉండేది. అసలు నాకింత ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడానికి కారణం ఏవిటో తెలిసేది కాదు. నేనిది నాకు వంశపారంపర్యంగా వచ్చిందని సరిపెట్టుకున్నాను. మా నాన్నగారు నలభై ఏళ్లకే గుండెపోటుతో మరణించారు.

నేను రోజూ యోగ సాధన చేస్తున్నప్పటికీ గుండెపోటు ఎలా వచ్చింది? అన్నది మొదటి రెండు రోజులు నాకు కలిగిన తీవ్రమైన ప్రశ్న.

ఆ తరువాత  నేను 'ఇన్నర్ ఇంజనీరింగ్  ప్రోగ్రాము’  చేశాను.  నాలో ఎన్నో అద్భుతమైన మార్పులు గమనించి నేను ప్రతిరోజూ 'శాంభవి మహా ముద్రను ' చేసుకుంటున్నాను. నేను ఆహార నియమాలు కూడా బాగా పాటిస్తున్నాను. నేను ఎంతో ప్రశాంతంగా తయారయ్యాను. నేను ఇదవరకటి కంటే బాగా వింటున్నాను అని మా ఆవిడ నన్ను పరిహాసం చేస్తూ ఉంటుంది. ఈ గుండెపోటు తరువాత నేను హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్నప్పుడు నేను రోజూ ‘శాంభవి’ చేసినప్పటికీ ఇలా ఎందుకు జరిగింది ? అని ఆలోచించడం మొదలుపెట్టాను. నా స్నేహితులు, బంధువులు నన్ను హాస్పిటల్ లో కలవడానికి వచ్చిన వారందరు నన్ను వ్యంగ్యంగా నీ సాధన ఏమైంది? అని అడిగారు. నేను రోజూ యోగ సాధన చేస్తున్నప్పటికీ గుండెపోటు ఎలా వచ్చింది? అన్నది మొదటి రెండు రోజులు నాకు కలిగిన తీవ్రమైన ప్రశ్న. ఆ తరువాతి రోజున నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. నాకు గుండె పోటు వచ్చిన సమయానికి నా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనుకూలమైన రేంజ్ లోనే ఉన్నాయి.

 

వారు నా గుండెపోటు రావడానికి కారణాన్ని world-health-day-heart-ful-of-yoga-IMG_6235తెలుసుకోలేకపోయారు. వారు కొన్ని సంవత్సరాల క్రితం నా హెల్త్ రిపోర్ట్స్ ని తీసుకుని చూసారు. దాని ప్రకారంగా నా కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు, “నువ్వు ఏం చేసావు? గత మూడు సంవత్సరాలుగా లెవెల్స్ ఎలా తగ్గాయి? ఏం మందులు తీసుకున్నావు?” అని అడిగారు. వారు దీన్ని నమ్మలేకపోయారు. “నువ్వు ఏం చేసినా సరే, అదే నీ జీవితాన్ని కాపాడింది, లేకపోతే ఇప్పుడు నీకు వచ్చిన హార్ట్ ఎటాక్ ఎంతో ప్రాణాంతకంగా ఉండేది” అని చెప్పారు.

ఈ డాక్టర్ గారు నా ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చారు. అప్పుడు నేను ఆయనకి “నేను తీసుకున్న ఒకే ఒక మందల్లా నేను రోజూ శాంభవి మహా ముద్రను చేస్తూ ఈశా హఠ యోగ చేశాను" అంతే  అని చెప్పాను. రెండు రోజుల తరువాత నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు. నాకు చాలా ఎక్కువ మందులను రాసిచ్చారు. నా జేబులో ఎప్పుడు ఒక మందుని పెట్టుకుని ఉండాలి అని చెప్పారు. బాత్రూం తలుపులు వేసుకోకండి, మీరు వేగంగా నడవకండి, ఏది కష్టమైన పని చేయకండి అని చెప్పారు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చాను. హేమలత అనుకున్నట్టుగా నేను బాగా వినడం మొదలుపెట్టలేదు. గత రెండు సంవత్సరాలుగా నేను ఎటువంటి మందు తీసుకోలేదు. నేను చెన్నై విప్రో మారథాన్ పది (10 ) కిలోమీటర్లని 63 నిమిషాల్లో పరిగెత్తాను. నాకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా  అనిపిస్తుంది. కచ్చితంగా నేను సరైన మార్గాన్నే ఎంచుకున్నాను.

సద్గురు మీకు నా ప్రణామాలు.

41 సంవత్సరాల ప్రవీణ్ చెన్నై లో నివసిస్తారు. ఈయన 'లక్ష్మి ఏజెన్సీస్ ఎఫ్ ఏం సి జి’ డీలర్. ఇది  వాళ్ళ కుటుంబ వ్యాపారం.