భావోద్వేగాల గురించి ఈ 7 సూత్రాల ద్వారా తెలుసుకోండి..
ArticleJul 22, 2016
ఈ శరీరాన్ని, భావోద్వేగాలనూ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా చేసుకుంటున్నారా లేదా మీ అభ్యున్నతికి వాటినే నిచ్చెన మెట్లుగా మలుచుకుంటున్నారా అనేదే ప్రశ్న. భావోద్వేగాల గురించి సద్గురు ఏమంటున్నారో ఈ ఏడు సూత్రాలా ద్వారా తెలుసుకుందాం.
- భావోద్వేగాలు, ఆలోచనలు వేర్వేరు విషయాలు కావు. మీరు ఆలోచించే తీరే, మీరు అనుభూతి చెందే తీరు.
- మీ ఆలోచన, భావోద్వేగాల పరంగా మిమ్మల్నిమీరు ఈ ప్రపంచం నుండి ఎంత ప్రత్యేకం చేసుకుంటారో, మీరు జీవితం నుండి అంతగా దూరమై పోతారు.
- మనసు ఓ శక్తివంతమైన పరికరం. మీరు సృష్టించే ప్రతి ఆలోచనా, ప్రతి భావోద్వేగం అసలు మీ శరీర రసాయనికతనే మార్చేస్తుంది.
- మీరు ప్రతి విషయం గురించీ మరీ గంభీరంగా ఉంటే, మీకు కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు మాత్రమే తెలుస్తాయి. మీకు జీవితం తెలియదు.
- మీ ఆలోచనలు, భావోద్వేగాలకు మించి జీవితం మరెంతో ఉంది. మానసిక పరిధి నుండి జీవితపు పరిధి వైపు కదలాల్సిన సమయం ఇదే.
- మీ ఆలోచనలనూ, భావోద్వేగాలనూ మీరు ఎక్కువగా పట్టించుకుంటే, మిగిలిన అస్థిత్వం నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటారు.
- మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీ మనసులో మీరు సృష్టించుకునే నాటకమే. దాన్నిఎక్కడో ఓ చోట మీరు ముగించగలగాలి.