Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఈ భూమ్మీద ఇది మన కాలం - దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది.
చాలామంది, తమ జీవితాల్ని, వారి చుట్టూ ఉన్న సామాజిక వాస్తవికతకు తాకట్టు పెట్టేశారు. ఆ తాకట్టు నుంచి విముక్తి కల్పించడమే యోగా.
తాము స్వయంగా సృష్టించుకున్న హద్దులను అధిగమించని మనుషులు, వాటిలోనే చిక్కుకుపోతారు.
మీ మనశ్శరీరాలు, మీరు పోగు చేసుకున్నవే. మీరు పోగు చేసుకున్నవి మీవి కావొచ్చు, కానీ అవి ఎన్నటికీ మీరు కాలేవు.
ఎప్పుడైతే మీరు అపరిమితత్వాన్ని అనుభూతి చెందుతారో, అప్పుడు మీ జీవితంలో సంభావ్యతలు కూడా అపరిమితమవుతాయి.
యోగా అనేది కేవలం వ్యాయామం కాదు. మనుషులు తమ అత్యుత్తమ సామర్థ్యాన్ని సాకారం చేసుకునేందుకు ఇదొక ప్రక్రియ, ఒక విధానం.
గణేశుడు మేధస్సుకి ప్రతీక. ఇవాళ మీ బుద్ధిని పెంచుకోవాలే గానీ, మీ పొట్టను కాదు.
మనకు చెట్లు సమృద్ధిగా ఉంటే, వానలు సమృద్ధిగా కురుస్తాయి, తద్వారా మన నదులూ ప్రవహిస్తాయి.
మన జీవిత నాణ్యత నిజంగా మారేది మన అంతరంగంలో మార్పు కలిగినప్పుడే.
బాధలో ఉన్నప్పుడే జీవితం ఎంతో సుదీర్ఘమైనదిగా అనిపిస్తుంది - ఆనందంలో ఉంటే ఇదెంతో చిన్నది.
మీకు ఏది ఇచ్చినా సరే, దాని నుండి అందమైనదేదో సృష్టించగలిగితే, అదే మేధస్సు.
నా పుట్టుకనైనా, మీ పుట్టుకనైనా మీరు నిజంగా జరుపుకోవాలనుకుంటే, ఈ యోగాను మీ జీవితంలోనూ ఇంకా ఇతరుల జీవితాలలోనూ ఒక సజీవ సత్యం చేయండి.