Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ప్రజలు విజయవంతులు అవుతున్నారంటే, అది కఠిన శ్రమ వల్లనే కానక్కరలేదు. వాళ్ళు దాన్ని సరిగ్గా సఫలీకృతమయ్యే విధంగా చేయడం వల్ల.
మీ మనసులో, భావోద్వేగాల్లో, శరీరంలో మీకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోగలిగితే, మీ ఆరోగ్యం, ఆనందం, సంక్షేమం అన్నీ వాటంతట అవే వస్తాయి.
మీకిష్టమైన వాటి పరిమితుల్లో ఉండడం కన్నా, మీ పరిమితుల్ని అధిగమించి వెళ్ళడం మరెంతో ముఖ్యం.
ఏ పనీ ఒత్తిడితో కూడినది కాదు. మీ శరీరాన్ని, మనసుని, భావాల్ని సరిగ్గా నిర్వహించలేకపోవడమే దాన్ని ఒత్తిడిగా మారుస్తుంది.
తగినంత శ్రద్ధ పెడితే, దాదాపు దేనిపైనైనా పట్టు సాధించొచ్చు.
జీవం గురించి లోతైన అవగాహన పొందాలంటే, మీపై ఇతరులకున్న అభిప్రాయాలు మీకు ఏమాత్రం పట్టకూడదు.
కష్టకాలాలను మీరు అంతర్గత హుందాతో ఎదుర్కోగలిగితే, ఎదురయ్యే ప్రతి పరిస్థితీ జీవితాన్ని మెరుగుపరచుకోగల అవకాశమేనని మీరు గ్రహిస్తారు.
ధ్యానం, మీ ఉనికికున్న సౌందర్యాన్ని తెలుసుకునేందుకు ఒక మార్గం.
భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పార్శ్వాల్లో యోగా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే విషయం ఏమిటంటే, మీరు అది చెయ్యాలి.
జీవితంలో మీరు పురోగతి సాధిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే, మీరు నిన్నటి కన్నా ఈ రోజు మరికాస్త సంతోషంగా ఉన్నారా అని చూసుకోండి, చాలు.
మీకు ఏం జరిగినా, దాన్ని శాపంగా భావించి బాధపడొచ్చు, లేదా దాన్ని వరంగా భావించి ఉపయోగించుకోవచ్చు.
మనం ఎంత పని చేశామన్నది కాదు, మన జీవితానుభూతి ఎంత లోతుగా ఉంటే, మన జీవితం అంత సుసంపన్నంగా సంతృప్తికరంగా ఉంటుంది.