యోగులు పంచభూతాల మీద ఎంతటి పట్టు సాధిస్తారో సద్గురు వివరిస్తూ, తమ శరీరాన్ని కూడా కరిగించుకునే శక్తి వాళ్ళకి ఉంటుందని చెప్పారు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఒక ఇంట్లో లింగ భైరవి యంత్రం వద్ద నీరు ప్రత్యక్షం అయన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. అంతేకాకుండా, ధ్యానలింగం సాన్నిధ్యంలో ఉండటం వల్ల, ముఖ్యంగా పంచభూత క్రియలో పాల్గొనడం వల్ల, మన శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసుకోవడమే కాకుండా, వాటి మీద పట్టు కూడా సాధించవచ్చని ఆయన వివరించారు. సద్గురు రూపొందించిన పంచభూత క్రియ ధ్యానలింగం సాన్నిధ్యంలో జరుగుతుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని, మనసును స్థిరపరుస్తుంది, మానసిక అస్థిరతలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, నిద్ర సమస్యలతో బాధపడేవారికి, ఎప్పుడూ భయంతో ఉండేవారికి ఇది చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి బలహీనమైన శరీర నిర్మాణం ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. పంచభూత క్రియ ప్రతి శివరాత్రికి, అంటే అమావాస్యకి ఒకటి లేదా రెండు రోజుల ముందు జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి https://isha.co/pbk-yt ని సందర్శించండి.