Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
జీవితంలో మీరు ఎన్ని ప్రోగుచేసుకున్నా, చివరిలో పార్శెల్ సర్వీసు ఏమీ ఉండదు. ప్రోగు చేసుకునే తత్వం నుంచి నిజమైన జీవోద్ధరణ దిశగా నడవడానికి ఇదే సరైన సమయం.
ప్రతి మనిషి కృషి చేయగల ఒక విషయం ఏమిటంటే, మీరు వచ్చినప్పటి కంటే మీరు వదిలి వెళ్ళేటప్పుడు ఈ ప్రపంచాన్ని ఇంకొంచెం మెరుగైనదిగా చేయాలి.
ఒక క్షణం పాటు పరిపూర్ణ కృతజ్ఞతాభావం, మీ పూర్తి జీవితాన్నే మార్చేయగలదు
మీ పని మీకు నిజంగా ప్రియమైన వాటిని సృష్టించడం గురించే అయితే, పనిని ఇంకా జీవితాన్ని సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం లేదు – జీవితమే పని, పనే జీవితం.
శ్రేయస్సుకై వెతుకుతూ, ఈ భూమిపై మనం ఎన్నో పిచ్చి పనులు చేసాము. మీరు కోరుకునేది శ్రేయస్సే అయితే - బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం అంతర్ముఖులవ్వడమే.
మీ జీవితం అద్భుతమయ్యేది మీరు సేకరించిన, దాచుకున్న వాటితో కాదు, మీ అనుభూతిలోని గాఢత వల్లనే.
ప్రపంచంలోని చాలా మంది నిజంగా బిజీగా లేరు - వాళ్ళు పరధ్యానంలో ఉన్నారంతే.
మంచి ఉద్దేశాలు ఉంటే సరిపోదు. అవసరమైన ఫలితాలను సాధించడానికి సరైన ఎరుకతో, సరైన పనులు చేయాలి.
మీకు తెలిసింది అతి స్వల్పం. మీకు తెలియనిది, అది అనంతమైన అవకాశం.
తర్కం అనే చట్రంలోనే ఉండి పనిచేస్తే, జీవితమనే సర్కస్లో మీరు ఒక జోకర్లా మిగిలిపోతారు.
ఈ గురుపూర్ణిమ రోజున, మిమ్మల్ని మీరు మీ అంతర్గత శ్రేయస్సుకై అర్పించుకోండి. మీ సాధన, ధ్యానం చేయండి. మీ మనసును ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకోండి.మీ గురువు కృప మీతో ఉంది.అమితమైన ప్రేమాశీస్సులతో
నాకు తెలీదు' అనేది ఒక గొప్ప సంభావ్యత. 'నాకు తెలీదు' అని మీరు గుర్తించినప్పుడే, తెలుసుకోవాలనే ఆకాంక్ష, అన్వేషణ, ఇంకా తెలుసుకునే అవకాశం పుడతాయి.