Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మేము పునరావృత వైఖరితో జీవించాలనుకోవడం లేదు. మా జీవితాలను మేమే రాసుకోవాలనుకుంటున్నాం.
ప్రేమకు ప్రతిస్పందన అవసరం – లేకపోతే అది ఎక్కువ కాలం నిలవదు. భక్తికి ఎవరి సహాయం అవసరం లేదు – మీరు స్వయంగానే జ్వలిస్తుంటారు.
సాధన ఉద్దేశ్యం ఎక్కడికో వెళ్లడం కాదు. మీరు ఊరికే ఇక్కడ ఉండగలిగే స్థితికి రావడం. ఇక్కడ ఉన్నది అంతటా ఉంది – ఇక్కడ లేనిది ఎక్కడా లేదు.
తనలోనున్న దివ్యత్వం అభివ్యక్తమైనప్పుడు ఆ ఒక్క వ్యక్తి జననమే ప్రపంచాన్ని మార్చి వేయగలదు. మీరు దివ్యత్వాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆనందభరితమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీలో ఉన్న సృష్టి మూలం వ్యక్తమవడానికి మీరు అనుమతిస్తే, మీరు ఆనందంగా ఉండటం తప్ప మరేలానూ ఉండలేరు.సకల చెడుల నుంచి రక్షణ కల్పించే ఉత్తమ బీమా ఆనందమే.మీరు స్పృశించే ప్రతీదాన్నీ ఆనందమయం చేయడంలోని సార్థకతను మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.అపారమైన ప్రేమాశీస్సులతో,
మీ ప్రేమ, ఆనందం, ప్రశాంతత ఇతరులపై ఆధారపడితే, మీవిగా ఈ గుణాలను మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.
ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో, ఎలా శ్వాసతీసుకోవాలో, అన్నీ ఎలా చేయాలో, మీ గుండె ఎలా కొట్టుకోవాలో, మీలోని జీవం ఎలా స్పందించాలో – అన్నింటి పట్లా ధ్యాస పెడితే, మీరు యోగాలో ఉన్నట్టు.
నిశ్చలత్వంలో, కాలం ఉండదు.
గురువుతో ఉండటం సౌకర్యం కోసం కాదు, అది మీ పరిమితులను ఛేదించే ఒక నిరంతర సాహసయాత్ర.
మీరు నడచినా లేక నృత్యం చేసినా, పని చేసినా లేక ఆటలాడినా, వంట చేసినా లేక పాటలు పాడినా – అది పూర్తి ఎరుకతో గాని, పూర్తి పరిత్యాగంతోగాని చేయండి. ఏవిధంగా చేసినా, మీరు సృష్టితో ఐక్యతలో ఉంటారు.
జీవి నిజంగా తపించినప్పుడు, విశ్వం తప్పక స్పందిస్తుంది.