Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ధ్యానం, మీ ఉనికికున్న సౌందర్యాన్ని తెలుసుకునేందుకు ఒక మార్గం.
మీరు ఏం చేస్తున్నా దాన్ని మనస్ఫూర్తిగా చేయొచ్చు లేదా మనసు లేకుండా చేయొచ్చు. మనస్ఫూర్తిగా చేస్తే అది స్వర్గం అవుతుంది. మనసు లేకుండా చేస్తే అది నరకం అవుతుంది.
సుఖం కేవలం ఆనందం యొక్క నీడే. మీలో ఆనందం లేనప్పుడు, మీరు సుఖం కోసం చూస్తారు.
మీ జీవితం మీరు చేసుకుంటున్నదే. దేవుడు దాంట్లో జోక్యం చేసుకోడు.
మనం ఎంత పని చేశామన్నది కాదు, మన జీవితానుభూతి ఎంత లోతుగా ఉంటే, మన జీవితం అంత సుసంపన్నంగా సంతృప్తికరంగా ఉంటుంది.
గతంలో ఎన్నడూ లేనంతగా, నేడు మానవ చైతన్యాన్ని పెంచడం ఎంతో ముఖ్యం, అప్పుడే సాంకేతికత విధ్వంసకారి కాకుండా, సాధికారతను చేకూర్చేదిగా అవుతుంది.
మీరు నిజంగా మీకు ముఖ్యమైనదని అనుకున్నది సృష్టిస్తున్నట్లయితే, మీ జీవితమంతా ఓ సెలవులానే ఉంటుంది.
సంతలో అయితే తక్కువిచ్చి ఎక్కువ పొందడం తెలివైనదిగా భావిస్తారు. స్వచ్చమైన అనుబంధంలో, తిరిగి మీరేం పొందుతారన్న ఆలోచన లేకుండా ఇవ్వగలిగినదంతా ఇస్తారు.
జీవన్మరణాలు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాంటివి. అవెప్పుడూ కలిసే ఉంటాయి.
మీరు సృష్టిలో ఓ భాగం అయితే, సృష్టికర్త కచ్చితంగా మీలోనే ఇమిడి ఉన్నాడు. తెలుసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా అంతర్ముఖులవ్వడమే.
అమీబా నుంచి ఏనుగు దాకా అన్ని జీవులూ పర్యావరణానికి హితం చేస్తున్నాయి. కేవలం మనుషులమైన మనమే విధ్వంస వైఖరితో ఉన్నాం, పైగా తెలివైనవాళ్ళమని అనుకుంటున్నాం.
ప్రేమ ఎప్పుడూ విముక్తిని కలిగించే ప్రక్రియలా ఉండాలేగాని, చిక్కుకుపోయేలా ఉండకూడదు.