Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు, శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు.
స్త్రీత్వం జీవం యొక్క ఓ శక్తిమంతమైన పార్శ్వం. ఆ స్త్రీత్వం లేదా శక్తి లేకపోతే, ఈ అస్తిత్వంలో ఏదీ ఉండేది కాదు.
నవరాత్రులను ఉత్సవ స్ఫూర్తితో జరుపుకోవడమే ఉత్తమమైన మార్గం. జీవిత రహస్యం ఇదే: తీవ్రంగా పరిగణించకుండానే, సంపూర్ణంగా నిమగ్నమవ్వడం.
భూమిపై స్థిరంగా నిలబడి ఉండి, అదే సమయంలో ఆకాశాన్ని అందుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియ సారాంశం.
మనశ్శరీరాలు ఎంతో గాఢంగా అనుసంధానించబడి ఉంటాయి. శరీరం నిశ్చలమైనప్పుడు, మనసు సహజంగానే దానిని అనుసరిస్తుంది.
మానవుడిగా ఉండటం అంటే ప్రకృతి నియమాలుగా చెప్పబడే వాటిని అధిగమించి, మనకన్నా ఉన్నతమైనదేదో సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటమే.
మీ వంశపారంపర్యత ఒక బంధనంగా కాకుండా మీ పురోగతికి ఒక సోపానంగా చేసుకోండి. మహాలయ అమావాస్య ఆ అవకాశాన్ని కల్పిస్తుంది.
ఎవ్వరి మీద ఎప్పుడూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకండి. ఈ క్షణంలో వారు ఎలా ఉన్నారన్నదే ముఖ్యం.
భయం అనేది ఎరుక లోపించడం వల్ల కలిగే పర్యవసానం. భీతి మనల్ని రక్షించదు. మనం నిజంగా జీవితాన్ని సృజించుకోగలిగేది ఎరుకతో ఉండడం ద్వారా మాత్రమే.
జ్ఞానోదయం అనేది వెలుగు గురించి కాదు – అది వెలుగు చీకటులకు అతీతమైన ఒక దృష్టి.
మీకు నచ్చినా నచ్చకపోయినా, జీవితం మీతో అన్ని రకాల సర్కస్‌లు, గారడీలు ఇంకా విన్యాసాలు చేయిస్తుంది. మీరు సంసిద్ధులై ఉంటే, వాటిని ఆనందంగా చేయవచ్చు.
సుఖశాంతుల మూలాలు అంగడిలోనో, అడవిలోనో లేవు, అవి మీ లోపలే ఉన్నాయి.