FILTERS:
SORT BY:
సమృద్ధి మీ బట్టలకు, ఇంటికి, కారుకు సంబంధించినది కాదు. నిజమైన సమృద్ధి మీరెంత ఆనందంగా, ప్రేమగా, ఉల్లాసంగా ఉన్నారన్నదానికి సంబంధించినది.
శ్వాస, హృదయ స్పందనలు శరీరానికి ఎంతో ముఖ్యం. ధ్యాన స్థితిలో ఉండడం మనిషికి ఎంతో ముఖ్యం.
యోగ అంటే ఐక్యం. యోగ అంటే పరమోత్తమ సాధికారత కూడా. మీరు అన్నింటితో ఐక్యమై ఉంటే, అది మహత్తరమైన సాధికారత.
ఏకాగ్రత, నైపుణ్యం మరియు ఉత్తేజం కలిగిన యువతను తయారుచేయగలిగితే, ఈ ప్రపంచం ఇదివరకు ఎన్నడూ చూడని గొప్ప అద్భుతంగా భారతదేశం అవతరిస్తుంది.
మీ కలలు నిజం కాకూడదు గాక, మీ ఆశలు నెరవేరకూడదు గాక, ఎందుకంటే అవి మీ పరిమిత జ్ఞానం నుండే పుట్టాయి. మీరు ఇంతకు ముందెన్నడూ స్పృశించని సరికొత్త అవకాశాలను అన్వేషించాలి.
ఈ రోజు నుంచి, మీ అడుగులను భారంగా వేయకండి. మీరేం చేస్తున్నా, ఏం జరుగుతున్నా, మీ జీవితమంతా ఓ నాట్యంలా గడిపేయండి.
మన జీవనానికి ఆధారమైన నేల, పశుసంపద, గాలి, నీరు మరియు మనుషుల పట్ల కృతజ్ఞతతో జరుపుకునే వేడుకే సంక్రాంతి. ఆనందోత్సాహాలతో జరుపుకోండి.
కర్మకు మంచి చెడులతో సంబంధం లేదు, అది కేవలం కార్యకారణ సంబంధమైనది.
మీరు ఆనందంగా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనూ సంఘర్షణ ఉండదు, అప్పుడు మీరు అత్యంత అద్భుతమైన పనులు చేస్తారు.
ప్రేమ వివేకాన్ని ఇవ్వదు. అది ఒక మంచి ఉద్దేశాన్ని మాత్రమే ఇస్తుంది.
గత సంవత్సరం భారాలను వదిలించుకొని, తాజాగా, నూతనోత్సాహంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది.
మీ జీవితంలో ఏ పరిస్థితులు తలెత్తినా, మీరు వాటినుంచి మరింత శక్తిమంతంగా బయటపడొచ్చు లేదా వాటి వల్ల చితికిపోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంటుంది.