Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
దేవుడికి మీ భక్తి అక్కరలేదు. మానవ హృదయానికే ఆ అత్యున్నత మనోభావాన్ని అనుభూతిచెందవలసిన అవసరం ఉంది.
వ్యామోహం అనేది ప్రేమ కాదు. ఒకరితో అంటుకుపోయి ఉండటం అవతలి వ్యక్తికి సంబంధించిన విషయం కాదు - అది మీలోని అసంపూర్ణతా భావనకు సంబంధించినది.
మీరు ఆర్జించింది మీది కావచ్చు. అది ఎప్పటికీ ‘మీరు’ కాలేదు.
మీ ఆలోచనలు, మనోభావాలు మీ భూతాలే. మీరే వాటిని సృష్టిస్తారు, ఆపై అవి అదుపుతప్పి మిమ్మల్ని పీడిస్తాయి. ఇది సరిగా డైరెక్ట్ చేయని హర్రర్ మూవీ లాంటిది.
ఎరుక అనేది మీరు చేసేది కాదు. మీరుగా ఉన్నది ఏదో అదే ఎరుక
మీ మనసు వీధిలోని చెత్తకుండి. దారిన పోయేవాళ్ళందరూ దానిలో ఏదో వేస్తూనే ఉంటారు.
ఒకరు తాము చాలా మంచివారమనే బిరుదును ఆపాదించుకున్నప్పుడు, అనివార్యంగా వారు చాలా క్రూరంగా మారతారు.
స్వేచ్ఛ అంటే మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకునే శక్తిని కలిగి ఉండడం, అది వేరే దేనిచేతా నిర్ణయింపబడక పోవడం
మీ ప్రస్తుత అస్థిత్వ పరిధులను దాటాలని మీరనుకుంటే, మీ హృదయంలో పిచ్చి ఉండాలి, కాని మీ బుర్రలో మాత్రం పరిపూర్ణమైన సమతుల్యత ఉండాలి.
ఇద్దరు వ్యక్తులు ఒకటైనప్పుడు, అది ఆనందాన్ని పంచుకోవడానికే కావాలి కానీ, ఒకరి నుండి ఒకరు ఆనందాన్ని పిండుకోవడానికి కాదు.
ఒత్తిడి అనేది మీ జీవిత పరిస్థితుల వల్ల కాదు. మిమ్మల్ని మీరు ఎలా నిర్వహించుకోవాలో తెలియక పోవడం వల్లే వస్తుంది.
మీలోని జీవన మూలమే మీ అత్యున్నత ప్రామాణికమైతే, మీ చుట్టూ ఉన్న వారి అభిప్రాయాలు, తీర్పులు మీపై ప్రభావం చూపలేవు.