Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీ అన్వేషణ తగినంత తీక్షణంగా మారితే, జ్ఞానోదయం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే అంతిమంగా మీరు దేనికోసం వెతుకుతున్నారో అది మీలోనే ఉంది.
అంకిత భావంతో ఉన్న వ్యక్తికి పరాజయం అంటూ ఏమీ ఉండదు - ఉండేవి, జీవన యాత్రలో నేర్చుకోవలసిన పాఠాలే.
ధైర్యవంతులు మూర్ఖపు పనులు చేస్తారు. భయస్తులు పెద్దగా ఏమీ చెయ్యరు. ఏ భయం లేనివాళ్ళు, జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసి, ఏది అవసరమో అది చేస్తారు.
ఒకరి ప్రవర్తనని బట్టి వారి ఆధ్యాత్మిక ప్రక్రియను అంచనా వేయకండి. ఆధ్యాత్మిక ప్రక్రియ మనః శరీరాల పోకడలకు అతీతమైనది.
ఇతరులు పరిస్థితులను మాత్రమే సృష్టించగలరు. వారు ఏదైనా చెప్పొచ్చు లేదా చేయొచ్చు, కానీ దాని వల్ల మీరు బాధపడాలా వద్దా అనేది మీ ఎంపికే.
జీవితంలో పరిస్థితులు ప్రతికూలమైనప్పుడే మీరు ఎలాంటి వారన్నది తెలుస్తుంది. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు అందరూ అద్భుతమైన వారిలా నటించగలరు.
మీరు చేస్తున్న దానికి మీరు పరిపూర్ణంగా అంకితమై ఉన్నప్పుడు మాత్రమే, ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఏదైనా మీరు సృష్టించగలరు.
జ్ఞానోదయం కోసం పరితపించకండి. మీ తపన ప్రస్తుతం మీకున్న పరిమితుల్ని త్వరగా ఎలా అధిగమించాలి అనే దానిపై ఉండాలి.
ప్రాథమికంగా, మీరు సమర్పించుకోగలిగింది మిమ్మల్ని మాత్రమే.