మీ శరీరాన్ని బాగా ఉంచుకోవాలనుకుంటే, మీరు దాన్ని ఉపయోగించాలని, ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, అది అంత మెరుగ్గా తయారవుతుందని, ఆరోగ్యం అనేది ఒక ఆవిష్కరణ లేదా ఆలోచన కాదని - శరీరం, మనస్సు ఇంకా జీవ శక్తులు బాగా ఉపయోగానికి పెట్టినప్పుడు ఆరోగ్యం సహజంగానే వస్తుందని సద్గురు వివరిస్తున్నారు.