Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
యోగ ఉద్దేశం మిమ్మల్ని మీరు విశ్వ జ్యామితితో సమన్వయం చేసుకోవడం. సృష్టిలో ఒక తునకగా ఉంటారా, లేక సృష్టి మూలంలో ఒక భాగంగా ఉంటారా అన్నది మీ ఇష్టం.
మీరు ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు. మిమ్మల్ని పరివర్తనం చేసేది, మీరు అందులో ఏ స్థాయిలో నిమగ్నత చూపుతున్నారు అనేదే.
ఈ భూమి మీదున్న ప్రతీ ఇతర జీవి తన శక్తి మేరకు చేయగలిగిన ఉత్తమమైనది చేస్తోంది. మానవులొక్కరే సంకోచిస్తుంటారు…
ఇక్కడ బాగా జీవించడానికి అలాగే ఈ జీవితానికి అతీతమైన ముక్తికి – సమస్తానికి పరిష్కారం మీలోనే ఉంది.
ఎప్పుడైతే మీకూ మీ శరీరానికి మధ్య, మీకూ మీ మనసుకు మధ్య కొంత ఎడాన్ని తీసుకువస్తారో, ఇక అదే దుఃఖానికి ముగింపు.
ఆధ్యాత్మికంగా ఉండటానికి పర్వత గుహలోకి వెళ్ళిపోనవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రక్రియ బయటి ప్రపంచానికి సంబంధించినది కాదు – అది మీ లోపల జరిగేది.
మీ పక్కన ఉన్న వ్యక్తిని ప్రేమించడమే అతిపెద్ద సవాలు. ఇక్కడ లేని వారిని ప్రేమించడం ఎల్లప్పుడూ సులభమే.
శారీరకంగా నొప్పి ఉండకూడదు అని ఎంచుకునే అవకాశం మీకు లేదు, కానీ ఎప్పుడూ బాధ లేకుండా ఉండే అవకాశం మీకుంది.
మీ జీవితంలో ప్రేమ, సృజనాత్మకత, సంగీతం, నృత్యం, నవ్వు వంటి అత్యంత సుందరమైన విషయాలు జరిగేది మిమ్మల్ని మీరు పక్కన పెట్టినప్పుడే. ఆ పరిత్యాగ స్థితిలోని ఆనంద పారవశ్యాలను మీరు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రపంచాన్ని గురించిన సమాచార సేకరణకు ఇంటర్-నెట్ సరిపోతుంది. కానీ జీవితాన్ని తెలుసుకోవడానికి ఇంకా అనుభూతి చెందడానికి, జీవితాన్ని ఓ గాఢానుభూతిగా గ్రహించగల ఇన్నర్-నెట్ అవసరం.
ఉనికిలో ఆధ్యాత్మికం కానిది ఏదీ లేదు. ప్రతిదీ ఆధ్యాత్మికమే, కాకపోతే గుర్తించబడలేదు.
ఒకే సమయంలో పూర్తి తీక్షణత మరియు సంపూర్ణమైన నిశ్చలతను కలిగి ఉండటమే యోగశాస్త్ర సారం.