Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
కృతజ్ఞత అనేది ఒక వైఖరి కాదు. మీరు పొందిన దానిని మీరు గుర్తించినప్పుడు కలిగే ఆనందంలో, మీలోనుంచి అభివ్యక్తమయ్యే భావమే కృతజ్ఞత.
మీరు ప్రత్యేకంగా ఉండాలని ఎంతగా ప్రయత్నిస్తే, అంతగా గాయపడతారు. ఊరికే ఉండండి, కరిగి గాలిలో భూమిలో భాగమైపోండి; సృష్టి ఉద్దేశించినట్లుగా ప్రతిదానిలో భాగమైపోండి.
మీరు నిర్బంధంగా వ్యవహరిస్తే, బాహ్య పరిస్థితులు ప్రస్తుతం మీరు ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. మీరు ఎరుకతో స్పందిస్తే, మీ శ్రేయస్సు కచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది.
ఓ మనిషిగా, మీరో నిర్ణీత ఉనికి కాదు, మీరు రూపుదిద్దుకుంటున్నారు, ఇదో నిరంతర ప్రక్రియ. ఏదీ స్థిరపరచి లేదు – మీరు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు.
పోటీదారులు శత్రువులు కాదు. వాళ్ళు మీ లోపాల్ని మీకెప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళు మీ క్వాలిటీ కంట్రోల్ లాంటోళ్ళు.
ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకునే వారికంటే సంతోషంగా, బాధ్యతాయుతంగా, కొంచెం వివేకంతో ఉండే మనిషి సవాళ్ళతో కూడిన పరిస్థితులను మరింత మెరుగ్గా ఎదుర్కోగలడు.
ఇది గ్రహణశీలతకు, కృపకు, జ్ఞానోదయానికీ, పరమోన్నత విముక్తికి అనువైన రోజు. మీలో అత్యున్నతమైన దాని కోసం ప్రేరణ కలగాలని ఆశిస్తున్నాను.
ఈ జీవితం చాలా చిన్నది – మీకు నిజంగా ముఖ్యమైనవి చేయడమే, మీ జీవితాన్ని సార్ధకం చేసుకునే ఏకైక మార్గం.
ఆనందంతో నిండిన ముఖం ఎప్పుడూ అందంగానే ఉంటుంది.
మీరు జీవితంతో కాస్త సరదాగా ఉంటే, ప్రతి క్షణం ఒక పండుగలాగే ఉంటుంది.