Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మీకు నచ్చినా నచ్చకపోయినా, జీవితం మీతో అన్ని రకాల సర్కస్‌లు, గారడీలు ఇంకా విన్యాసాలు చేయిస్తుంది. మీరు సంసిద్ధులై ఉంటే, వాటిని ఆనందంగా చేయవచ్చు.
సుఖశాంతుల మూలాలు అంగడిలోనో, అడవిలోనో లేవు, అవి మీ లోపలే ఉన్నాయి.
మీ పిల్లలు బాగా పెరగాలంటే, మీరు గొప్ప తెలివితేటలు గలవారు కావాల్సిన పని లేదు. మీరు ప్రేమగా, ఆనందంగా, నిజాయితీగా ఉండాలి అంతే.
మీరు అందరి కంటే మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ అత్యున్నత స్థాయిలో ఉండాలి.
భూమిపై స్థిరంగా నిలబడి ఉండి, అదే సమయంలో ఆకాశాన్ని అందుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియ సారాంశం.
అది సులభమైనా, కష్టమైనా - మీ గమ్యంపై నుండి దృష్టిని ఎన్నడూ మరల్చకండి.
నియంత్రణ అంటే కొన్ని నిర్దిష్ట హద్దులకు పరిమితం చేయడం. మీ మనస్సును నియంత్రించకండి - దానికి విముక్తి కల్పించండి.
ఇతరుల ఎలా ప్రవర్తించాలి అన్నదాని పట్ల మీకు ఏ అపేక్షలు లేనప్పుడు, మీ సంబంధం ఫలప్రదమైనదిగా అవుతుంది.
ఎవ్వరి మీద ఎప్పుడూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోకండి. ఈ క్షణంలో వారు ఎలా ఉన్నారన్నదే ముఖ్యం.
కర్మ మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది, మీరు మీ శరీరానికి అంటిపెట్టుకుని ఉండేలా చేసే జిగురు. మీ కర్మనంతటినీ కడిగేసుకున్న తక్షణమే మీరు నిష్క్రమిస్తారు.
నిజమైన కరుణ అనేది ఇవ్వడం ఇంకా పుచ్చుకోవడం గురించి కాదు. అవసరమైనది చేయడం గురించి.
జీవితంతో మమేకం కానప్పుడే విసుగు పుడుతుంది. ఎందుకంటే మీరు మీ సొంత ఆలోచనల్లో, భావోద్వేగాల్లో మునిగిపోయుంటారు.