Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఇక్కడ మనం ఉండేది కేవలం కొద్ది కాలం మాత్రమే. ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ దాన్ని మరింత తగ్గించనక్కర్లేదు.
మీ మనశ్శరీరాలతో సహా, మీ ఉపకరణాలను పూజ్యభావంతో చూసుకుంటే, అప్పుడు ప్రతి పని ఓ ఆనందకరమైన, ఫలప్రదమైన ప్రక్రియ అవుతుంది.
దేవి అనుగ్రహాన్ని పొందినవారు ధన్యజీవులు. మీరు మీ ఊహకు, శక్తి సామర్థ్యాలకు అతీతమైన జీవితాన్ని గడుపుతారు.
స్త్రీత్వం జీవం యొక్క ఓ శక్తిమంతమైన పార్శ్వం. ఆ స్త్రీత్వం లేదా శక్తి లేకపోతే, ఈ అస్తిత్వంలో ఏదీ ఉండేది కాదు.
జీవించడం తప్ప ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదు. మీరు పైపైనే జీవిస్తారా లేక గాఢంగా జీవిస్తారా అన్నది మాత్రమే మీకున్న ఏకైక ఎంపిక.
భద్రత అవసరం విడిచిపెట్టిన వారే, నిజానికి భద్రంగా ఉంటారు.
మనశ్శరీరాలు ఎంతో గాఢంగా అనుసంధానించబడి ఉంటాయి. శరీరం నిశ్చలమైనప్పుడు, మనసు సహజంగానే దానిని అనుసరిస్తుంది.
మానవుడిగా ఉండటం అంటే ప్రకృతి నియమాలుగా చెప్పబడే వాటిని అధిగమించి, మనకన్నా ఉన్నతమైనదేదో సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటమే.
విజయదశమి, అస్తిత్వపు మూల గుణాలైన తమస్సు, రజస్సు మరియు సత్వ గుణాలను జయించడం గురించి. ఈ రోజు మీకు విజయవంతమైన రోజు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రేమ మరొకరి గురించి కాదు. ప్రేమ ఒక చర్య కాదు. అది మీరు ఉండే విధానం.
భయం అనేది ఎరుక లోపించడం వల్ల కలిగే పర్యవసానం. భీతి మనల్ని రక్షించదు. మనం నిజంగా జీవితాన్ని సృజించుకోగలిగేది ఎరుకతో ఉండడం ద్వారా మాత్రమే.
జ్ఞానోదయం అనేది వెలుగు గురించి కాదు – అది వెలుగు చీకటులకు అతీతమైన ఒక దృష్టి.