Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
మిమ్మల్ని కుంగదీస్తున్నది మీ పని ఒత్తిడి కాదు, మీ ఆలోచనలు, భావోద్వేగాలలో మీరు నిత్యం తలమునకలవ్వడమే దానికి కారణం.
మీరు దానికి సన్నద్ధం కానప్పుడే ఆటంకం మీకు ఒక ఆటంకంగా ఉంటుంది. అవసరమైన అంతర్గత కృషి చేసినప్పుడు, అది ఓ సోపానం అవుతుంది.
బుర్రలో ఎలాంటి స్పష్టత లేకుండానే ప్రజలు అపారమైన ధీమాతో ఉంటున్నారు. అది అనర్థదాయకం.
మంచితనం అనేది ఒక ఆపాదించుకున్న వైఖరి. కానీ ఆనందం అనేది నిజమైన అనుభూతి.
విశ్వంలో మరోచోట నుంచి మీరు భూమిని చూస్తే, మనందరం దివ్య జీవులమే.
ఈ రోజున, గౌతమ బుద్ధుడు సత్యం వైపు పయనించడం అంటూ ఏమీ లేదని గ్రహించాడు. మీరు అందుబాటులోకి వస్తే, అది ఇక్కడే ఉంది.
మానవ జీవితం కేవలం మనుగడతో ముగిసిపోదు. మనుగడ గురించి చింత లేనప్పుడే అసలైన మానవ జీవితం మొదలవుతుంది.
ప్రేమ ఒక లావాదేవీ కాదు. అది మీలో జరిగే ఓ మధురమైన విషయం. దాని వ్యక్తీకరణ బాహ్యంగా ఉండవచ్చు, కానీ అది అంకురించేది మీ అంతరంగంలోనే.
ఎవరినీ మెప్పించడానికి ప్రయత్నించకండి. మీరు నిజంగా ఆనందంగా ఉంటూ, మీలో మానవత్వం ఉట్టిపడుతుంటే, మీరు అందరితోనూ బాగుంటారు.