Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఒక క్షణం పాటు పరిపూర్ణ కృతజ్ఞతాభావం, మీ పూర్తి జీవితాన్నే మార్చేయగలదు
మీ పని మీకు నిజంగా ప్రియమైన వాటిని సృష్టించడం గురించే అయితే, పనిని ఇంకా జీవితాన్ని సమతుల్యం చేసుకోవాల్సిన అవసరం లేదు – జీవితమే పని, పనే జీవితం.
వ్యవసాయం వర్ధిల్లేది సారవంతమైన భూమి మీదనే - వేరే మార్గమే లేదు. మట్టిని పునరుజ్జీవింపజేయడం అంటే అది జీవ పునరుద్ధరణే.
మీ వ్యవస్థలోని ప్రతి పరమాణువు నిరంతరం మొత్తం బ్రహ్మాండంతో లావాదేవీలు జరుపుతోంది. కేవలం మీరే, ‘మీరొక ప్రత్యేకమైన అస్తిత్వం’ అని అనుకుంటున్నారు.
ప్రపంచంలోని చాలా మంది నిజంగా బిజీగా లేరు - వాళ్ళు పరధ్యానంలో ఉన్నారంతే.
మంచి ఉద్దేశాలు ఉంటే సరిపోదు. అవసరమైన ఫలితాలను సాధించడానికి సరైన ఎరుకతో, సరైన పనులు చేయాలి.
జీవితమంటే నిమగ్నమవడం. ఎక్కడైతే నిమగ్నత ఉండదో అక్కడ జీవితం ఉండదు.
ఈ గురుపూర్ణిమ రోజున, మిమ్మల్ని మీరు మీ అంతర్గత శ్రేయస్సుకై అర్పించుకోండి. మీ సాధన, ధ్యానం చేయండి. మీ మనసును ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకోండి.మీ గురువు కృప మీతో ఉంది.అమితమైన ప్రేమాశీస్సులతో
నాకు తెలీదు' అనేది ఒక గొప్ప సంభావ్యత. 'నాకు తెలీదు' అని మీరు గుర్తించినప్పుడే, తెలుసుకోవాలనే ఆకాంక్ష, అన్వేషణ, ఇంకా తెలుసుకునే అవకాశం పుడతాయి.
మీరు ఏదో ఒక దానిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను, అది ఏదైనా సరే. ఎందుకంటే మనిషి తన దృష్టిని నిలపగలిగితే, ఈ విశ్వమే తనకి దాసోహం అవుతుంది.