ఒక భారతీయ టోపీల వ్యాపారి ఇంకా అతని మనవడి కథతో మొదలుపెట్టి, సద్గురు ఒక విషయం వివరిస్తున్నారు, అదేంటంటే, మీరు మనిషిగా పుట్టాక, ప్రకృతిపరంగా పరిణామం చెందే ప్రక్రియ మీ విషయంలో ముగిసిపోతుంది. చైతన్యపూర్వకంగా పరిణామం చెందడమే ఏకైక మార్గం. ఎందుకంటే, మనిషి అనేది ఒక స్థిరమైన స్థితి కాదు. మనిషి తనని తాను ఎలా మలచుకుంటాడనే దానికి ఎన్నో అవకాశాలున్నాయి. దాన్ని చైతన్యంతో స్వీకరిస్తే అదొక గొప్ప వరం కాగలదు, లేదంటే అది పెద్ద శాపంగా మారగలదు, ఎందుకంటే తను ఎలా కావాలనుకుంటే అలా అయ్యే అవకాశం మనిషికి ఉంది.