Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
ఇతరుల ఎలా ప్రవర్తించాలి అన్నదాని పట్ల మీకు ఏ అపేక్షలు లేనప్పుడు, మీ సంబంధం ఫలప్రదమైనదిగా అవుతుంది.
మీకు ఏవిధమైన ఆప్యాయతా, గుర్తింపు అవసరం లేకుండా అందరిపై అప్యాయతను కురిపించగలగడం – అదే స్వేచ్ఛ.
ఆధ్యాత్మికత అంటే మంచి ప్రశాంతమైన జీవనం అనుకోకండి. దాని అర్థం ప్రజ్వలిస్తూ ఉండటం.
మీ కనుముక్కు తీరు ఎలా ఉన్నప్పటికీ , ఆనందంగా ఉన్న ముఖం ఎప్పుడూ అందమైన ముఖమే. ఆనందంగా మారండి - అందంగా అవ్వండి.
జీవితంతో మమేకం కానప్పుడే విసుగు పుడుతుంది. ఎందుకంటే మీరు మీ సొంత ఆలోచనల్లో, భావోద్వేగాల్లో మునిగిపోయుంటారు.
మీ గురించి మీరేమనుకుంటున్నా, ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నా, దానికి అస్తిత్వపరంగా ఎటువంటి ప్రాముఖ్యతా లేదు.
యుగయుగాలుగా, మన నదులు మనలను మన తల్లుల వలె ఆదరించి, పోషించాయి. ఇప్పుడు మనం వాటిని ఆదరించి, సంరక్షించవలసిన సమయం వచ్చింది.
పరిపూర్ణులుగా ఉండటానికి మీరేమీ చేయనక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు, లేదా అనుభూతి చెందనక్కర్లేదు. మీరున్న విధంగానే మీరు ఓ పరిపూర్ణ జీవి.
మీ జీవిత పరిస్థితుల్లో ఎటువంటి సంక్షోభం ఎదురైనా, మిమ్మల్ని మీరు ఒక సంక్షోభంగా మార్చుకోకండి.
బోధన అనేది ఒక వృత్తి కాకూడదు - అది ఒక అభిరుచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే విద్య వాస్తవాలను రుద్దడం నుండి సత్యాన్ని అన్వేషించడం వైపు వెళ్ళగలదు.
ఒత్తిడి అనేది జీవితంలో సహజమైన అంశం కాదు. మీ వ్యవస్థను సరిగ్గా నిర్వహించుకోలేకపోవటం వల్లనే ఒత్తిడి వస్తుంది.
మీకు మరణం ఉందన్న విషయాన్ని ఎదుర్కొన్నప్పుడే, దానిని దాటి వెళ్లాలనే తపన నిజమైన శక్తిగా మారుతుంది. లేదంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ కేవలం ఒక వినోదమే.