FILTERS:
SORT BY:
జీవితం, మీరు ఏమి చేశారు అన్న దాని గురించి కాదు. అదంతా మీరు దాన్ని ఎలా చేశారు అన్న దాని గురించే.
విద్యకు కావాల్సింది స్ఫూర్తి, కేవలం సమాచారం కాదు. స్ఫూర్తి పొందిన మనుషులే తమ జీవితాలను మార్చుకోగలరు, ఇంకా తమ చుట్టూ ఉన్నవారి జీవితాలను మార్చగలరు.
సమృద్ధి మీ బట్టలకు, ఇంటికి, కారుకు సంబంధించినది కాదు. నిజమైన సమృద్ధి మీరెంత ఆనందంగా, ప్రేమగా, ఉల్లాసంగా ఉన్నారన్నదానికి సంబంధించినది.
శ్వాస, హృదయ స్పందనలు శరీరానికి ఎంతో ముఖ్యం. ధ్యాన స్థితిలో ఉండడం మనిషికి ఎంతో ముఖ్యం.
ఓ బలమైన దేశాన్ని నిర్మించాలంటే, స్పష్టమైన దూరదృష్టి, అంకిత భావం, ఇంకా సరైన పనులు చేసేందుకు కావాల్సిన ధైర్యంతో మనం దానిని తీర్చిదిద్దాలి. ఈ భూమ్మీద భారతదేశం అత్యంత తేజోవంతమైన దేశంగా ఎదగాలంటే, మనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.
జీవితం దాని లక్ష్యంలో లేదు, జీవితం దాని ప్రక్రియలో ఉంది – ఈ క్షణం మీరు దాన్ని ఎలా అనుభూతిచెందుతున్నారన్న దానిలో ఉంది.
మీ కలలు నిజం కాకూడదు గాక, మీ ఆశలు నెరవేరకూడదు గాక, ఎందుకంటే అవి మీ పరిమిత జ్ఞానం నుండే పుట్టాయి. మీరు ఇంతకు ముందెన్నడూ స్పృశించని సరికొత్త అవకాశాలను అన్వేషించాలి.
ఈ రోజు నుంచి, మీ అడుగులను భారంగా వేయకండి. మీరేం చేస్తున్నా, ఏం జరుగుతున్నా, మీ జీవితమంతా ఓ నాట్యంలా గడిపేయండి.
మీరు ఎరుకతో ఉంటే, నేను ఎప్పుడూ ఉంటాను – మీ జీవితాంతం ఇంకా ఆపై కూడా, నేను నా శరీరాన్ని విడిచిన తర్వాత కూడా నా సాన్నిధ్యం అలాగే ఉంటుంది.
కొత్త పరిస్థితులు ఎదురైనప్పుడు - మీకు నచ్చని వాటిని కూడా - స్వీకరించండి. మీలో ఎంత తక్కువ ప్రతిఘటన ఉంటే, మీరంత చురుగ్గా, ప్రభావవంతంగా అవుతారు.
మీరు ఆనందంగా ఉన్నప్పుడు, మీకు ఎవరితోనూ సంఘర్షణ ఉండదు, అప్పుడు మీరు అత్యంత అద్భుతమైన పనులు చేస్తారు.
ప్రేమ వివేకాన్ని ఇవ్వదు. అది ఒక మంచి ఉద్దేశాన్ని మాత్రమే ఇస్తుంది.