Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
పరిపూర్ణులుగా ఉండటానికి మీరేమీ చేయనక్కర్లేదు, ఆలోచించనక్కర్లేదు, లేదా అనుభూతి చెందనక్కర్లేదు. మీరున్న విధంగానే మీరు ఓ పరిపూర్ణ జీవి.
ఓ మనిషిగా, జీవితం మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెళుతుందోనని ఆలోచించకండి. మీరు దాన్ని ఎక్కడకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఆలోచించండి.
బుద్ధి కుశలత అంటే మరొకరిని అధిగమించడం కాదు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం.
మీ ఆలోచనలు, భావోద్వేగాలు మీరు సృష్టించుకున్నవే. వాటి పట్ల మీకున్న మమకారం, వాటితో ఏర్పరచుకున్న బంధనాలు కూడా మీ సృష్టే.
మీకు మరణం ఉందన్న విషయాన్ని ఎదుర్కొన్నప్పుడే, దానిని దాటి వెళ్లాలనే తపన నిజమైన శక్తిగా మారుతుంది. లేదంటే, ఆధ్యాత్మిక ప్రక్రియ కేవలం ఒక వినోదమే.
గణేషుడు లేక గణపతి ఓ గొప్ప మేధావి మాత్రమే కాదు – ఆయన విఘ్న నాశకుడు కూడా. అన్నింటికీ మించి, మీరే మీ జీవితానికి విఘ్నం కాకుండా చూసుకోండి.
మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్నారు అనేదేమీ ఉండదు. ఒక మనిషిగా, మీరు అనంతమైన సంభావ్యత కలవారు.
అందరూ మీతో ప్రేమలో పడాలనుకుంటే, మొదట మీరు వారందరితో ప్రేమలో పడాలి.
మీ అభిప్రాయాలు అడ్డుగోడలు - ఇతరులకే కాదు, మీకు కూడా. మూసుకుపోయిన మనసంటే, మూసుకుపోయిన అవకాశాలే.
మనుషులు రెండు రకాలు: విషయాలు జరిగేలా చూసేవారు; అవి బాగా జరిగితే ఆనందించి, సరిగా జరగనప్పుడు ఫిర్యాదు చేసేవారు.
అలవాటుగా చేసే పనులు సులువుగా అనిపించవచ్చు. కానీ ఎరుక లేకుండా చేస్తే, ఎదుగుదల ఉండదు.
ప్రతిరోజూ మీరొక పరిమితిని అధిగమిస్తే, మీకు ఎన్ని పరిమితులు ఉన్నా, ఏదోక రోజు మీరు విముక్తులవుతారు.