Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
మనుషులతో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే, వారికి వారి ఆలోచనలనూ, మనోభావాలనూ ఎలా నిర్వహించుకోవాలో తెలియదు.
గొప్పతనం కోసం మీరేమీ పాకులాడక్కర్లేదు. మీరు ‘నా సంగతేమిటి’ అనే ఆలోచనలకు అతీతంగా వెళితే, మీరు ఎలాగూ గొప్పవారే.
మీరు ఏదోక రోజు చనిపోతారన్నది మీ ఎరుకలో ఉంటే, అప్పుడు మీరు మీకూ, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ, ఏది నిజంగా అవసరమో అది తప్ప మరేదీ చేయరు.
మీరు తినే తీరు మీ శారీరక ఆరోగ్యాన్నే కాదు, మీ ఆలోచనలు, భావనలు, ఇంకా మీరు జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని కూడా నిర్ణయిస్తుంది.
మీరు మిమ్మల్ని బాధపెట్టుకోవాలనుకుంటే, లెక్కలేనన్ని అవకాశాలున్నాయి, ఎందుకంటే ఎప్పుడూ, ఎవరో ఒకరు మీకు నచ్చనిదేదో చేస్తుంటారు.
యోగా అనే పదానికి అర్థం ఐక్యం. అంటే మీరు ఎరుకతో మీ వ్యక్తిత్వపు హద్దుల్ని చెరిపేసి, మిగతా విశ్వంతో ప్రతిధ్వనించడం.
స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరమే.
మీరు విముఖత నుండి సుముఖతకు, జడత్వం నుండి ఉత్తేజం దిశకు మళ్లితే, మీ జీవితం ఆనందమయంగా, సునాయాసంగా ఉంటుంది.
ధ్యానలింగం ఆవరణలో కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంటే చాలు, ధ్యానం అంటే ఏమిటో తెలియని వారు కూడా, గాఢమైన ధ్యానస్థితిని అనుభూతి చెందగలరు.
జీవం అన్నింటినీ కలుపుకుంటుంది. కేవలం మీ మనసే ప్రత్యేక భావనతో ఉంటుంది.
మీరు ఎంత చేస్తున్నారన్నది కాదు, మీ అనుభూతి ఎంత లోతుగా ఉన్నది అన్నదే మీ జీవితాన్ని సుసంపన్నం చేసి, సంతృప్తినిస్తుంది.