సైనస్ ఇంకా ఛాతి భాగంలోని సమస్యలని ఎలా తొలగించుకోవలో, హఠ యోగా  ప్రక్రియ ద్వారా ఈ సమస్యని ఎలా తగ్గించుకోవచ్చో సద్గురు సమాధానమిస్తున్నారు.

ప్రశ్న: సద్గురు, నాకు ఛాతి భాగంలో, ఇంకా నా సైనస్ లో బిగదీసినట్టుగా అనిపిస్తుంది. ఈ సైనస్ కంజెషన్ ఎలా తగ్గించుకోవచ్చు? దీన్ని ప్రభావితం చేసే విధానం ఏదైనా ఉందా?

సద్గురు: సైనస్ లు అంటే ప్లంబింగ్ పని వంటిది. అవి ఎక్కడ మూసుకుపోయాయో, ఎక్కడ కారుతున్నాయో అన్న విషయానికి అనేక కారణాలు ఉండవచ్చు. సహజంగా ప్రజలు సైనస్ ఒత్తిడిని పడుకున్నప్పుడు అనుభూతి చెందుతారు. ఇది ఎన్నో విధాలుగా జరగచ్చు. మీరు మీ సైనస్ లను ఎలా ఒక సమతుల్యంలో, అందులోని ద్రావకాలను ఎలా అట్టిపెట్టుకోవచ్చు, మీ తల భాగంలో ఉన్న ద్రావకాలు ఎలా ఉంటాయి అన్నది వివిధ విషయాలను ప్రభావితం చేస్తుంది. మీ మెదడు ఎలా పని చేస్తుంది? మీ శ్రేయస్సు ఎలా ఉంటుంది? మీ సమతుల్యత? మీ బుద్ధికుశలత, మీ పంచేద్రియాలు ఎంత బాగా పని చేస్తాయి? వంటి విషయాలని అది ప్రభావితం చేస్తుంది.

హఠ యోగ ద్వారా పూర్తీ స్థాయిలో ఉపశమనం

యోగ ప్రక్రియలో మీ సైనస్ ను సమతుల్యంలో అట్టిపెట్టుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం. ఇది మనం ఎలా సాధించాలి? మీరు కనక “శక్తిచలన క్రియ, శూన్య ఇంటెన్సివ్ ప్రోగ్రామ్” చేసి ఉన్నట్లయితే, అందులో మీరు కపాల-భాతిని ప్రభావవంతంగా చేయడం ద్వారా ఇది సమతుల్యతకు చేరుకుంటుంది. దీనికి సిద్ధమయ్యేందుకు మీరు జలనేతిని(ఈశా హఠ యోగా కార్యక్రమంలోని ఒక విభాగం) కూడా మీరు చేయవచ్చు. ఇది మీ వ్యవస్థలోని శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. కానీ దీన్ని మీకు సరిగ్గా చెప్పేవారు ఉండాలి. హఠ యోగా టీచర్లు మీకు ఇది కావాలంటే నేర్పించగలుగుతారు. మీకు ఎక్కువ శ్లేష్మం ఉండడం వల్ల దిబ్బడలు వేస్తూ ఉంటాయి కాబట్టి ఒక విధానం ఏంటంటే శ్లేష్మాన్ని తగ్గించడం. ఇంకొక అంశం ఏవిటంటే - ఒక  ప్రత్యేకమైన చోటున మాత్రమే ఈ సైనస్ లు అన్నవి దిబ్బడలు పడుతున్నాయో మీరు తెలుసుకోవడం.

మీ ఇంట్లో ఎక్కడైనా దుమ్ము, ధూళి ఉంటే కూడా మీ సైనస్ లు మూసుకు పోవచ్చు. అందుకని మీ ఇల్లు ఎప్పుడూ దుమ్ము, ధూళి లేకుండా అట్టేపెట్టుకోవడం అన్నది ముఖ్యమైన విషయం.

ఆధునిక వైద్యం మీకు రసాయనిక పరమైన మాత్రలను ఇచ్చి అక్కడ ఉన్న ద్రావకాలను ఎండిపోయేలాగా చేస్తుంది. మీరు యాంటి హిస్టమైన్డ్ కనక తీసుకుంటే అది అక్కడ ఉన్న ద్రావకాలను పూర్తిగా ఎండిపోయేలాగా చేస్తుంది. కానీ మనకి ఈ ద్రావకాలు అన్నవి ఎంతో అవసరం. మన మానవ వ్యవస్థ సరిగ్గా పని చేయాలి అంటే  ముఖ్యంగా పంచేద్రియాలు సరిగ్గా పని చేయాలంటే ఈ ద్రావకాల కదలిక అన్నవి జరగాలి. అందుకని మీకు విపరీతమైన ఎల్లెర్జిలు ఉంటే తప్పితే ఇలాంటి ద్రావకాలను ఎండిపోయేలాగా చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఎలెర్జీలను ఎలా తగ్గించుకోవాలి? సైనస్ దిబ్బళ్ళు అనేవి ఎలెర్జి వల్ల కూడా కలగచ్చు. మీ ఇంట్లో ఎక్కడైనా దుమ్ము, ధూళి ఉంటే కూడా మీ సైనస్ లు మూసుకు పోవచ్చు. అందుకని మీ ఇల్లు ఎప్పుడూ దుమ్ము, ధూళి లేకుండా అట్టేపెట్టుకోవడం అన్నది ముఖ్యమైన విషయం.

ఇంకొకటి ఏవిటంటే మీకు ఎలెర్జీలు కలగకుండా కొంత నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. దీనికి ఒక సరళమైన విధానం ఏవిటంటే, మీరు భోజనం చేసిన తరువాత ఒక  చెంచా పెరుగు, ఒక చెంచా తేనె తీసుకుని, ఆ తరువాత ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు మంచి నీళ్లు తాగకుండా ఉండడం. ఇది ఇస్నోఫీల్స్ స్థాయిని ఎంతగానో తీసుకొచ్చి, మీరు ఎల్లెర్జిల బారిన పడకుండా చూస్తుంది. కానీ ఇది ఒక ఆవు నుంచి పితికి తీసిన పాల నుంచి తోడు వేసిన పెరుగుతో మాత్రమే సాధ్యమౌతుంది. మీరు కొట్లో కొనుకొచ్చిన పెరుగుతో, పెరుగు అన్నది ప్యాకెట్ల లో వచ్చేది, అది ఎన్నో వేల ఆవుల నుంచి వచ్చిన పాల కలయిక. ఇలా ఫ్యాక్టరీలో తయారైన పాలు తాగడం అన్నది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలాంటి పాలు తాగడం వల్ల ఉపయోగాల కంటే దురుపయోగాలే ఎక్కువ. ఎందుకంటే ఎన్నో జంతువుల నుంచి వచ్చిన పదార్ధాలను కలిపినప్పుడు, వాటి జన్యువులు కూడా ఒక సంక్లిష్టమైన స్థాయిలో కలుస్తాయి. మీరు కనీసం ఒక జంతువు నుంచి వచ్చినది తీసుకుంటే పర్వాలేదు. కానీ మీరు ఈ విధమైన డైరీ ప్రోడక్ట్స్ ని తగ్గిస్తే మీ శ్లేష్మం సమస్యలు కూడా తగ్గుతాయి.

మీరు కనీసం ఒక జంతువు నుంచి వచ్చినది తీసుకుంటే పర్వాలేదు. కానీ మీరు ఈ విధమైన డైరీ ప్రోడక్ట్స్ ని తగ్గిస్తే మీ శ్లేష్మం సమస్యలు కూడా తగ్గుతాయి.

కేవలం ఒకటి,రెండు వారాల్లో మీరు అవి తగ్గడం గమనించవచ్చు. ఇంకో సరళమైన విషయం ఏవిటంటే మీరు గోరు వెచ్చటి నీళ్లల్లో తేనెను కలుపుకుని ఉదయాన్నే తాగితే అది మీ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. అన్నిటినీ మనం కలిపి ఒక మాటలో చెప్పాలంటే మీరు ప్యాకెట్లలో వచ్చే ఫ్యాక్టరీలలో తయారయ్యే పాలను, పెరుగును వాడకుండా ఉండి, గోరు వెచ్చటి నీళ్లలో తేనెను వేసి కలుపుకుని నీళ్లు తాగడం, మీరు కపాల భాతిలను ఒక నిర్దిష్ట స్థాయిలో చేయడం, సూర్య నమస్కారాలు కానీ సూర్య క్రియ కానీ చేయడం, మీరు మీ శరీరంలో తగినంత ఉష్ణాన్ని సమత్ ప్రాణాన్ని కనక  ఉత్పన్నం చేయగలిగితే మీకు ఈ శ్లేష్మం సమస్యలు అన్నవి మాయమైపోతాయి. మీరు మందులు వాడడం ద్వారా శ్లేష్మాన్ని ఎండిపోయేలాగా చేయడం అన్నది మంచి పద్ధతి కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు