సత్వం, రజస్సు, తమస్సు - మూడు ప్రాథమిక గుణాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు.  మనం నవరాత్రులలోని ఈ అసలు విషయాన్ని వదిలిపెట్టకూడదని చెబుతున్నారు.

సద్గురు : ప్రపంచంలో ఉన్న అన్ని గుణాలు ‘సత్వం, రజస్సు, తమస్సు’ అనే మూడు ప్రాథమిక గుణాలుగా గుర్తించారు. జడత్వాన్ని తమోగుణం గాను, క్రియాశీలతను రజోగుణం గాను, పరమోత్తమ సాత్విక గుణాన్ని సత్త్వగుణం గాను అన్నారు.

ఈ మూడు ప్రమాణాలు లేకుండా భౌతికమనేది ఏదీ ఉండదు. ఒక్క పరమాణువు కూడా ఈ మూడు ప్రమాణాలు లేకుండా ప్రమాణాలకు(స్తబ్దత, శక్తి, స్పందనలకు) అతీతంగా ఉండవు. ఈ మూడు గుణాలు లేకపోతే మీరు దేనిని ఒకటిగా ఉంచలేరు. అది విచ్ఛిన్నం అవుతుంది. అది కేవలం సత్వ గుణం అయితే మీరు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేరు, మీరు వెళ్ళిపోయి ఉంటారు. కేవలం రజో గుణం ఉన్నా, అది పని చేయదు, కేవలం తమస్ అయితే మీరెప్పుడు నిద్ర పోతూనే ఉంటారు. అంటే అన్నింటిలో ఈ మూడు గుణాలు ఉంటాయి. ఇక ఉన్న ప్రశ్న అంతా మీరు మూడు గుణాల ఏ రకమైన సమ్మేళనం అనే.

ఈ నవరాత్రి తొమ్మిది రోజులు, ఈ మూడు గుణాల పరంగా విభజించారు. ఈ నవరాత్రిని జరుపుకోవడం, ఆ మూడింటినీ ఉపయోగించుకోవడం మంచిది. బ్రహ్మచర్యం, ఇంకా అటువంటి కొన్ని ఇతర సాధన చేసేవారికి ఏరోజైనా ఒకటే. కానీ మిగతా వారికి అది ఆవశ్యకము. ప్రకృతి అందించే ఆ మూడింటి సహాయాన్ని ఉపయోగించుకోవడం మంచిది. మీ సొంత శక్తితో ముందుకు వెళ్ళటం అసాధ్యమని కాదు, కానీ చాలా తక్కువ ఉంది మాత్రమే అలా సాధించగలిగారు. 

అన్నింటికీ మించి జీవితంలోని ప్రతి ప్రమాణాన్ని ఉత్సాహంగా స్వీకరించటం ముఖ్యం.

అన్నింటికీ మించి జీవితంలోని ప్రతి ప్రమాణాన్ని ఉత్సాహంగా స్వీకరించటం ముఖ్యం. మీరు అన్నింటిని ఉత్సాహంగా స్వీకరిస్తే, పూర్తిగా పాలుపంచుకుంటూనే, మీరు జీవితం గురించి ఆందోళన రహితంగా ఉంటారు. కానీ చాలామంది మానవులతో ఉన్న సమస్య ఏమిటంటే, వారు ఏదన్నా ముఖ్యమనుకుంటే, దాని పట్ల ఎంతో ఆందోళనగా ఉంటారు. వారు ముఖ్యంకాదు అనుకుంటే పట్టించుకోరు, దాని గురించి కావలసిన శ్రద్ధ చూపించరు. ఇంగ్లీషులో మీరు ‘అతను సీరియస్ గా ఉన్నాడు’ అంటే, ఇక అతని ఆరోగ్యం ఆ తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు. మరి చాలామంది ఇలా సీరియస్ గానే ఉన్నారు.

జీవిత రహస్యం ఏమిటంటే అన్నింటినీ ఆందోళన లేకుండా చూడటం, అయినా పూర్తిగా నిమగ్నమై ఉండటం, ఒక ఆటలాగా. అందుకే జీవితంలోని ఎంతో గంభీరమైన విషయాలను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నిర్వహిస్తారు, దానివల్ల కావలసిన అసలు దానిని మీరు తప్పిపోరు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు