ఒక చెక్కు చెదరని, మనుషులు అస్సలు కనపడని అడవిలోకి మీరు వెళ్ళారనుకోండి, మీరు కేవలం అక్కడికి వెళ్లి కళ్ళు మూసుకుని కూర్చొంటే, అక్కడ మీకు ఒక దేవాలయంలో కూర్చొన్న అనుభూతి కలుగుతుంది. మీకు సహకారంగా అక్కడ ఒక అసాధారణ మొత్తంలో శక్తి ఉంది ఎందుకంటే ఈ మొత్తం జీవ ప్రక్రియ – ఒక సూక్ష్మ జీవీ నుంచి ఒక క్రిమి వరకు, ఒక పురుగు, ఒక పక్షి, ఒక జంతువు, ఒక చెట్టు, ఒక మొక్క, ప్రతీది ఈ ఉదేశ్యంతోనే ఉంటుంది – అవి ఇప్పుడు ఉన్న దాని కంటే ఇంకా కొంత ఎక్కువగా ఉండాలనే. ఈ ఉదేశ్యం తనదైన ఒక ప్రాణ ప్రతిష్టను సృష్టిస్తుంది, తనదైన ఒక పవిత్రతను సృష్టిస్తుంది.

బహుశా మనిషి జ్ఞానానికి ఆరంభం ఇలానే జరిగిందేమో. మనుషులు ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ కూర్చుని, ప్రతీదీ తన పరిమితులను దాటి ఎదగాలను కుంటుందని వారు అకస్మాత్తుగా తెలుసుకున్నారు. అప్పుడు వారికిది అకస్మాత్తుగా తట్టింది, “ నేను చేసేది దీనికి వ్యతిరేకంగా వెళ్తుంది?” అందువల్ల ఈ గ్రహాన్ని మనం ఇంతకు ముందు ఉన్నది ఉన్నట్లుగా ఉండనిస్తే మీరు ఇక్కడ అలా కూర్చున్నా లేక పడుకున్నా ఈ మొత్తం ప్రదేశం ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రదేశంగా మారటం మీరు తెలుసుకుంటారు.

ప్రాణ ప్రతిష్ట చేసిన రూపాలు లేక దేవాలయాల వంటి స్థలాలు సృష్టించటానికి చేసే ప్రయత్నం ఎందుకోసమంటే మానవ సంఘాలు ఎంతో విభిన్నమైన ఉద్దేశ్యాలను సృష్టిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉండే భార్య, భర్తా ఉద్దేశ్యాలు చాలా విభిన్నమైనవి. ఇద్దరూ భాగస్వాములే, వారికి ఒక్క ఉమ్మడి ఉద్దేశ్యము ఉండవచ్చు, కానీ మిగతా అన్నీ ఉద్దేశ్యాలు విభిన్నమైనవే. అది ఒక ఉద్దేశ్యాల అపశ్రుతి. ఎందుకంటే అది అనుభూతి చెందటానికి తగిన స్థలం లేదు. ఒక ప్రాణ ప్రతిష్ట చేయబడిన స్థలం ముఖ్యంగా సహజ జీవన వాంఛను ముందుకు తీసుకురావడానికై  సాగుబడి చేసిన ఒక పరిస్థితి.

మీకు ఇది ప్రకటితమైయ్యేకొద్దీ, మీరు ప్రకృతి ఒడిలోకి పూర్తిగా చేరేకొద్దీ, మీరు అన్నిటినీ అనుభూతి చెందే విధానం మీరు సినిమాలలో, ఫోటోలలో చూసి అర్ధం చేసుకున్నదానికి చాలా విభిన్నంగా ఉంటుంది.  యోగులు ఎప్పుడూ అడవులలోకి, పర్వత గుహలలోకి వెళ్ళటానికి గల కారణం ఇదే. ఎందుకంటే కేవలం అక్కడ కూర్చోవటంతో మీకు ప్రకృతి యొక్క ఉద్దేశ్యం చాలా స్పష్టంగా అవగతమవుతుంది. ముఖ్యమైనది మిమల్ని ఇప్పుడు నియంత్రిస్తున్న అన్నీ పరిమితులని దాటి ఎదగటమే. ఈ ఉద్దేశ్యము ప్రతీ మట్టి రేణువులోనూ వ్యక్తమవుతుంది, అందుకని దాన్ని వదులుకోకండి. మీరు ఎటువంటి ఉద్దేశ్యము లేని వారుగా మారితే మీకు ఈ సృష్టి యొక్క ఉద్దేశ్యము అనుభావంలోకి వస్తుంది. మీరు దానితో ఒక్కటైనప్పుడు మీరు ఆ దిశలో చాలా సునాయాసంగా ప్రయాణిస్తారు.