Sadhguruముద్ర అంటే అచ్చమైన అర్థం ఒక మూతలాంటిదని. ఇది మీ చేతిని ఒక నిర్దిష్టమైన విధానంలో ఉంచడం. మీ శరీరాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో అట్టిపెట్టగల సున్నితమైన శాస్త్రమే ముద్రలు. మీ వ్యవస్థ ఎలా పని చేస్తోందో; అది మీ చేతుల కదలిక వల్ల మనం మార్చవచ్చు. ఈ శాస్త్రం, దానికదే ఒక సంపూర్ణ శాస్త్రం. ఇది మీ శరీర జ్యామితికి సంబంధించినది.  మీరు ఒక ముద్రను పెట్టి ఉంచడంవల్ల మీ శక్తిని మీకు కావలసిన విధంగా ప్రసరించేలాగా మీరు చేయవచ్చు. యోగాలో మీరు మీ శ్వాసను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో తీసుకుంటూ కొన్ని గణనాలతో మీకు మీ వ్యవస్థను ఏవిధంగా కావాలంటే ఆవిధంగా అట్టిపెట్టుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు మీ శక్తిని మీ శరీరంలో ఏ కణం దగ్గర కేంద్రీకరించాలనుకుంటే అక్కడ కేంద్రీకృతం చేయవచ్చు. ముద్రలు ఈ సృష్టినే మీకు ఆవిష్కరింపజేస్తాయి.

మీరు ఈ చేతులని ఎలా వాడవచ్చునంటే మీరు వాటిని ఇక్కడ కదిలిస్తే ఎక్కడో ఎదో జరిగేలాగా మీరు చేయవచ్చు.

మీ చేతులకు కేవలం తినడం, భౌతికమైన పనులు చేయడమే కాకుండా ఇంకా ఎంతో చేసిపెట్టగల సామర్థ్యం ఉంది. మీరు ఈ చేతులని ఎలా వాడవచ్చునంటే మీరు వాటిని ఇక్కడ కదిలిస్తే ఎక్కడో ఎదో జరిగేలాగా మీరు చేయవచ్చు.  మీరు మీ చేతులను ప్రతీదానికీ ఒక సాధనంగా వాడుకోవచ్చు. మీకు ఏవి ఎక్కడ కేంద్రీకృతం కావాలనుకుంటే వాటిని అక్కడ కేంద్రీకృతం చేయవచ్చు. ఇవి ప్రతీ దానికీ కూడా ఒక కంట్రోల్ పానెల్ లాంటివి. మీరు ఈ మానవ వ్యవస్థను ఒక చిన్న మానవుడిలా అయినా అట్టిపెట్టుకోవచ్చు లేదా దీనిని ఎంతగానో పెంపొందించుకోవచ్చు. ఏవిధంగా ఉండాలనుకున్నా సరే, కంట్రోల్ పానెల్ అన్నది ఇక్కడే ఉంది. మీరు కనుక ఈ వ్యవస్థతో సరైన పనులు చేసినట్లైతే మీరు ఎంతో అద్భుతమైన జీవితం జీవించవచ్చు. కానీ దీనికి ఎంతో పరిశోధన, ఎంతో సాధన అవసరం.

మీరు కనుక ఈ వ్యవస్థతో సరైన పనులు చేసినట్లైతే మీరు ఎంతో అద్భుతమైన జీవితం జీవించవచ్చు.

కొన్ని వందల కొలదీ ముద్రలు ఉన్నాయి. కొన్ని ఆరోగ్యం కోసం, కొన్ని శ్రేయస్సు కోసం, మరికొన్ని నిర్దిష్టమైన ప్రక్రియల కోసం ఇలా జీవితంలో వివిధ అంశాలకు వివిధ రకాల ముద్రలు ఉన్నాయి. మన భారత సంస్కృతిలో ప్రతీదానికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆసనం, ఒక ముద్ర ఒక విధమైన శ్వాస ఉంటుంది. ఇది మానవునిలో ఏదైతే ఉత్తమమో అది జరిగేలా చేస్తుంది. ఈ రోజుకి కూడా ఈ సంస్కృతిలో ఇది ఇంకా సజీవంగానే ఉంది. కానీ మనకు దీనిపట్ల తగినంత అవగాహన ఎరుక లేకుండానే దీనిని మనం సాధన చేస్తున్నాము.

ప్రేమాశిస్సులతో,
సద్గురు