ప్రశ్న: నమస్కారం సద్గురు, ఈ మధ్య మన దేశ రాజకీయాలు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది ఎందుకని? 

సద్గురు: ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎక్కడైనా ఏదైనా ప్రతికూలంగా జరుగుతుంటే “దీంట్లో చాలా రాజకీయం ఉంది” అంటున్నాం. ఇది చాలా దురదృష్టకరం. రాజకీయం అంటే దేశ విధి విధానాలు రూపొందించే అతి ముఖ్యమైన ప్రక్రియ, ఒక దేశం ఏ దిశగా ఎలా వెళ్తుందో నిర్ణయించే ప్రక్రియ. ఇది రాజకీయ నాయకులు తెచ్చిపెట్టుకున్న దురదృష్టకరమైన పరిస్థితి. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అయితే కొందరు పనిగట్టుకొని ప్రతికూల ప్రచారాలు చేస్తున్నారు. వారికి దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేదనుకుంటా. 

ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం దీర్ఘకాలికమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. వీటికి ఎంతో ధైర్యం ఇంకా ధృడసంకల్పం కావాలి. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక వంటి ప్రముఖ సంస్థలు ఇంకా కొన్ని రేటింగ్ ఏజెన్సీలన్నీ భవిష్య భారతదేశం ఆర్ధిక ప్రగతి వైపు అడుగులు వేస్తుందని చెప్తున్నాయి. అయితే కొంతమంది ఇందుకు పూర్తి విరుద్ధంగా కొంతమంది అంతా తప్పుగా నడుస్తోందని ప్రచారం చేస్తున్నారు. కొందరు ఇదంతా కుమ్మకై చేస్తున్నపని అంటున్నారు. నేనే మనుకుంటున్నానంటే, మన ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక వేదిక, మూడీస్ వంటి సంస్థలతో కుమ్మకై ఇలా చేయగలిగితే, మనం చాలా గొప్ప వాళ్ళమే కదా..!

చాలా మందికి అక్రమ వ్యాపారాలు చేయడం అలవాటయ్యింది. ఖాతా లెక్కలు లేని పన్నులు కట్టని ఈ డబ్బును మనం నల్ల ధనం అంటున్నాం. ఈ మధ్య కాలం వరకు కేవలం మూడు శాతం భారతీయులు మాత్రమే పన్నును కట్టేవారు, ఇప్పుడు నోట్లరద్దు ఇంకా GST రావడం వల్ల పన్ను రాబడి దాదాపు వంద శాతం పెరిగింది. కేవలం అరవై నాలుగు శాతం కంపెనీలే పన్ను చెల్లించినా, వంద శాతం పన్ను రాబడి పెరిగింది. మిగిలిన ముప్పై ఆరు శాతం వారు కూడా చెల్లిస్తే నూట యాభై శాతం వరకు రాబడి పెరగవచ్చు. 

ప్రతీఒక్కరూ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రక్రియలో పాల్గొన్నప్పుడే దేశం వృద్ధి చెందుతుంది. నా చుట్టూ ఒక చిన్న ఆర్ధిక వ్యవస్థ, మీ చుట్టూ ఒక చిన్న ఆర్ధిక వ్యవస్థ నడిపితే ఒక దేశం వృద్ధిచెందదు. ఇలా ఎవరైతే ఇటువంటి వాటికి అలవాటుపడ్డారోవారు షాక్ తిని బాధపడుతున్నారు. చాలా చట్టబద్దమైన వ్యాపారాలు , సంస్థలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నాయి . కానీ ఈ ఇబ్బంది అనివార్యం, ఎందుకంటే నలభై రెండు రకాల పన్నులు ఒకే పన్నుగా  మార్చబడ్డాయి. ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలో కేవలం ఏడు దేశాలు మాత్రమే  ఈ పద్ధతిని తీసుకొచ్చాయి.. ఈ ఏడిటిలో ఐదు దేశాలు ఫెడరల్ టాక్స్ ఇంకా స్టేట్ టాక్స్ పద్ధతి పాటిస్తే రెండుదేశాలు మాత్రమే GST ని విజయవంతంగా అమలు పరిచాయి. భారతదేశం మూడో దేశం. భారతదేశం ఎంతో విభిన్నమైనది ఇంకా ఇక్కడి ఆర్ధిక వ్యవస్థ ఒక వ్యవస్థీకృతమై  అభివృద్ది చెందలేదు, చిన్న వ్యాపారాలుగా, ప్రతీ పట్టణం ఒక ఆర్ధిక వ్యవస్థగా, ప్రజలు నెలకొల్పిన ఒక ఆర్ధిక వ్యవస్థ.

పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో భారతదేశం ఒక ఆర్ధిక శక్తిగా ఎదగాలంటే, అది చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలుగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థీకరించడానికి   ఇదే సరైన సమయం.. ఇక్కడ ఆర్థిక శక్తి అన్నప్పుడు, నాకు ముఖ్యమైన అంశం ఏంటంటే, మన దేశంలో అరవై శాతం జనాభా సరిగ్గా తిన లేకపోవడం వల్ల పోషకాహార లోపం ఉంది. ఆర్థిక శక్తి అంటే వీళ్ళందరూ కడుపునిండా తినగలగాలి. నా ఉద్దేశంలో ఆర్థిక శక్తి అంటే ఇంకొక దేశంపై పెత్తనం చేయాలను కోవడం కాదు, దేశంలో ప్రజాలందరికీ సరైన పోషణ అందాలి, అది ఎంతో ముఖ్యం.

మనం ఏ రాజకీయ పార్టీకి, ఏ మతానికి చెందిన వారిమైనా మంచి జరుగుతున్నప్పుడు అభినందించి వారికి అండగా ఉండాలి. ఒకవేళ మనకు కొంత వ్యక్తిగత ఇబ్బంది కలిగినప్పటికీ వారికి మద్దతుగా నిలబడాలి. అందరికీ జరిగే మంచిని మీ శత్రువు చేస్తున్నప్పటికీ మీరు చప్పట్లు కొట్టి అభినందించాలనే చైతన్యం కలిగి ఉండాలి. ఇలా చేయగలితేనేమీరు వివేకవంతులు. కేవలం నాకు మీరంటే ఇష్టం లేనందు వల్ల మీరేం చేసినా అది తప్పు అంటే అది మూర్ఖత్వం.  దీనివల్ల ప్రపంచానికి ఏ మంచీ జరగదు. 

భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలకడ సాధిస్తుందని అన్ని ప్రధాన ఆర్థిక కొలమానాలు సూచిస్తున్నాయి, కానీ కొంతమంది వారి డబ్బు కోల్పోవడం వల్ల ఏడుస్తున్నారు. నోట్లరద్దు జరిగినప్పుడు “సద్గురు ఇది చాలా దారుణం, మీరేమంటారు?” అని అడిగారు. మీ దగ్గర ఉన్నది జేబు నిండా డబ్బే అయితే  సమస్యే లేదు, మీరు వెళ్లి మార్చుకోవచ్చు కానీ మీ దగ్గర ఒక గోదాము నిండా డబ్బుంటే అది నేరం, దానికి మీరు ఇబ్బంది పడాల్సిందే.  కరెన్సీ అంటే ఒక దగ్గర నిల్వ ఉంచే వస్తువు కాదు దానికి చలనం ఉండాలి అని కఠినంగా తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. కరెన్సీ ఒక చలామణి వ్యవస్థే కానీ ముడిసరకు కాదు. మీరు ధాన్యాన్ని నిల్వచేయచ్చు, దేన్నైనా నిల్వచేయచ్చు కానీ కరెన్సీ నోట్లను కాదు, అవి కచ్చితంగా చలనంలో ఉండాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు