మౌని రాయ్: గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ల మధ్య సంబంధాలు ఎందుకు చాలా సంక్లిష్టంగా ఉంటాయి?

సద్గురు: నమస్కారం మౌని. మానవ సంబంధాలు ఎంత తియ్యగా ఉంటాయో అందరికీ తెలిసిందే, కానీ దానిలో చాలా చేదు కుడా ఉండి మీ అనుభవంలోకి రావటం మొదలవుతుంది. దురదృష్టవశాత్తూ ఈరోజు, పాశ్చాత్య దేశాలనుంచి వచ్చిన తలంపు ఏమిటంటే, మీరు “సంబంధం” అనే పదం వాడగానే, అది శారీరక సంబధం అనే విధంగా ప్రజలు అర్థంచేసుకుంటున్నారు. కానీ బంధాలు అనేవి ఎన్నో రకాలు ఉంటాయి. 

సంబంధాలు శారీరకమయితే, శరీరంపై ఉన్న పరస్పర కోరిక సాధారణంగా కొంత కాలానికి చచ్చిపోతుంది. మీరు ఏదయితే శాశ్వతం అనుకున్నారో, అది కొంతకాలానికి శాశ్వతం కాకుండా పోతుంది. ఏదయితే వారిని ఒకటి చేసిందో అది కరిగిపోవటం మొదలవ్వటం  ద్వారా వారు ఎదగడం సహజమే. కారణమేమీ లేకుండానే, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా పోతుంది, ఎందుకంటే నిజానికి ఇతరులలోని అందాన్ని ఆనందాన్ని పొందటానికి ఏర్పడిన బంధం అది. కొంతకాలం తరువాత ఇంతకుముందు పొందే సుఖం ఇప్పుడు ప్రయత్నించినప్పుడు దొరకకపోతే, కొద్దిగా చేదు అనేది మొదలవుతుంది. 

సంబంధాలు శారీరకమయితే, శరీరంపై ఉన్న పరస్పర కోరిక సాధారణంగా కొంత కాలానికి చచ్చిపోతుంది. మీరు ఏదయితే శాశ్వతం అనుకున్నారో, అది కొంతకాలానికి శాశ్వతం కాకుండా పోతుంది.

మీకు వయస్సు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు రావచ్చు. నిన్నటి నుంచి నేటికి మీరు కొంచెం వయస్సు పైబడ్డారు. కాబట్టి ఈరోజు, మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడే, మీ జీవితంలోని అన్ని బంధాల గురుంచి ఆలోచించాలి, శారీరకమైనవే కాదు. ఇది ఆనందోత్సాహాలను వ్యక్తీకరించే విధంగా ఉండాలేగానీ, అవి లాక్కొనే విధంగా కాదు. 

ఇది జరగాలంటే, మీరు స్వభావరీత్యా మీఅంతట మీరే ఉల్లాసంగా ఉండాలి. మీరు అత్యంత ఉత్సాహంగా ఉండటం మీద దృష్టి పెట్టి, మీ బంధాల్లో ఈ ఉత్సాహాన్ని పంచితే, సాధారణంగా మనుషుల బంధాల్లో ఉండే ఎగుడుదిగుడు విన్యాసాల గురుంచి మీరు చింతించవలసిన అవసరం ఉండదు. 

బంధాల నిర్వహణ

ఒక బంధమనేది జీవితములో ఒక అంశానికి చెందినది కాదు. మనుషులు కలిసివున్నప్పుడు, వారు ఎన్నో పంచుకోవలసి ఉంటుంది. సహజంగానే, చాలా చిన్న విషయాలలో కుడా పరస్పరం కల్పించుకోవలసి ఉంటుంది. ఇది ఎన్నో పరస్పర చర్చలకు దారి తీస్తుంది, ఇంకా చెప్పాలంటే అది వివాదాలకు దారి తీస్తుంది, అలా జరుగుతుంది.

వీటన్నింటిని మీరు ప్రతీరోజూ నిర్వహిచలేరు. కాబట్టి, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ సహజంగానే ఆనందోత్సాహాలతో నింపుకోవటమే ఉత్తమం. ఇదే జరిగితే, మీ బంధాలు అవసరం మీద ఆధారపడవు. 

బంధాలు అవసరం మీద ఆధారపడినప్పుడు, మీకు అవసరమైంది దొరక్కపోతే, మీరు దానిని దొంగిలించటానికి సిద్దపడతారు. మీరు పిర్యాదులు చెయ్యటం మొదలుపెడతారు, మీకు కావాల్సింది దొరకలేదని చెడుగా ఆలోచిస్తారు. మీరు ఈ అవసరాన్ని మీనుంచి తొలగించి, మీలో ఉత్సాహాన్ని సహజంగా  ఉరకలెత్తిస్తే మీరు ఎవ్వరితోనైనా అధ్బుతమైన సంబంధాలను నడపగలరు. వారు మీలాంటి వారే కానవసరం లేదు. మీకు మీ జీవితంలో అందమైన సంబంధాలుండు గాక..

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image