“మాటీ కహే కుమ్హార్ కో- కబీర్ రాసిన ఒక పద్యం”

మాటీ కహే కుమ్హార్ కో, తూ క్యా రోంధే మోహే

ఎక్ దిన్ ఐసా ఆయెగా, మై రోన్ధూంగీ తోహే

ఆయే హై సో జాయేంగే, రాజా రంక్ ఫకీర్

అందరూ ఏదోనాడు వెళ్లిపోవాల్సిందే, రాజైనా పేదైనా సరే]

ఎక్ సింహాసన్ చడ్ చలే, ఏక్ బంధే జంజీర్

కబీర్ నేర్పిన సత్యాన్నిమరచిపోతున్నాం

సద్గురు: ఇవాళ కబీర్ జయంతి. కబీర్ వృత్తిరీత్యా ఒక సాలెవాడు. కానీ అతని కవిత్వం వల్ల అతడు అజరామరుడయ్యాడు. ఆయన రాసిన, పాడిన కవిత్వం అంతా ఆయన జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. మూడొంతులు సమయం ఆయన బట్టలు నేస్తూనే గడిపేవాడు. ఆయన కవిత్వం మాత్రమే మనకు తెలుసు గనుక ఆయన కవిత్వం మాత్రమే రాసేవాడనే అందరూ అనుకుంటారు. ఆయన జీవితమంతా నేతపనితోనే నిండి ఉండేది - కవిత్వంతో కాదు. ఆయన నేసిన బట్టలు ఇప్పుడు లేవు కానీ ఆయన చెప్పిన కవిత్వం అక్కడక్కడా మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఎంత కవిత్వం కనుమరుగైపోయిందో తెలీదు కానీ మిగిలిన కొంచెం కూడా అత్యద్భుతం అనే అనాలి.

ఆయన ఇంత అద్భుతమైన వ్యక్తి అయినా కూడా, మనకి ఆయన కవిత్వం తప్పితే ఇంకేమీ తెలీదు. ఆయన ఎంతో లోతైన జ్ఞ్యానం, అనుభవం కలిగినవాడని అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన జీవితాంతం, అతని మరణ సమయంలో, మరణానంతరం కూడా మనుషులకి అతని మార్మికత కానీ, జ్ఞ్యానం కానీ, ఆయన తీసుకురావాలనుకున్న నిశిత దృష్టి కానీ ఎవరికీ పట్టలేదు. అందరికీ కావల్సింది ఆయన హిందువా లేక ముస్లిమా? అనే. అదే పెద్ద ప్రశ్న వాళ్ళకి. మీకు తెలియని పక్షంలో, నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాన్ని చెబుతాను: ఎవరూ హిందువుగానో, ముస్లింగానో, ఇంకోటిగానో పుట్టరు. అలాగే ఎవరూ హిందువుగానో, ముస్లింగానో చనిపోరు. కానీ మనం జీవించి ఉన్నంత కాలం ఒక పెద్ద సామాజిక నాటకం నడుస్తుంది అంతే.

మీరు తయారు చేసుకున్నదంతా - మీ ఆలోచనలు, మీరెవరు అనేది, మీరు ఏ మతానికి చెందుతారు, ఏది మీది, ఏది మీది కాదు - అంతా అబద్ధం. నిజం...అలా ఉంటుంది అంతే. దానికి మీరు చెయ్యవలసింది ఏమీ లేదు. మనందరం సత్యం ఒడిలోనే ఉనికి సాగిస్తున్నాం. నిజం అంటే, మీరు చెప్పేది కాదు; సత్యమంటే ఈ జీవాన్ని, లోకమంతటినీ కొనసాగించేలా చేసేందుకు ఉన్న ప్రాథమిక ధర్మాలు. మీకున్న అవకాశాలు రెండే - ఒకటి దానితో మమేకమవ్వటం రెండు కాకపోవటం. సత్యాన్ని మీరు కనిపెట్టక్కర్లేదు. దాన్ని అధ్యయనం చెయ్యక్కర్లేదు, స్వర్గం నించి క్రిందికి దించక్కర్లేదు.

ఒక చెట్టు ఎదుగుతుందంటే దాని అర్ధం దానికి జీవించటానికి అవసరమైన వనరులన్నీ సమకూరుతున్నాయి - అందుకే అది జీవించి ఉంది. అలాగే, మీరు ఇక్కడ ఉన్నారంటే దాని అర్ధం కూడా ఈ జీవితానికి అవసరమైనవన్నీ ఇక్కడే ఉన్నాయని అర్ధం. లేకపోతే మీరు ఇక్కడ ఉండరు కదా! మీరు ఆ వనరులతో, శక్తులతో మమేకం అయ్యి ఉన్నారా లేక వాటికి వ్యతిరేకంగా ఉన్నారా అనేదే ప్రశ్న .

“నేను ఎందుకు జీవశక్తులకి వ్యతిరేకంగా ఉంటాను?” అంటారా? మీరు, కాని విషయాన్ని మీరే అనుకున్న మరుక్షణమే మీరు దానికి వ్యతిరేకం అని అర్ధం. మీరు చాలా మత తత్పరులు (ధార్మికులు) అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే మీరు అందులో ఇరుక్కుపోయారు. మీరు ఒక మానసిక నాటకాన్ని సృష్టించుకుని దానిలో పాత్రలై నటిస్తున్నారు. మీరు ఆ సృష్టికర్త యొక్క సృష్టిని పూర్తిగా విస్మరించి మీ సొంత బుర్ర సృష్టించే కథల్లో మునిగిపోతున్నారు.

ఆత్మసాక్షాత్కారం – అజ్ఞ్యానంతో వేడుక (సంబరం)

“నాకు ఏదీ తెలీదు” అని మీరు గ్రహించినప్పుడే మీరు సత్యం వైపు అడుగులు వెయ్యగలరు. “మీకు తెలుసు” అని మీరు అనుకుంటే, మీ అడుగులు అసత్యం వైపు పడుతున్నట్టే ఎందుకంటే ‘నాకు తెలుసు’ అనేది ఒక ఆలోచన మాత్రమే. ‘నాకు తెలీదు’ అనేది నిజం, అది ఒక వాస్తవికత. మీకు ఎంత తొందరగా ఈ విషయం తెలిస్తే అంత మంచిది. మీరు జీవితంలో గొప్పగా గ్రహించేది ఏదైనా ఉంటే అది ‘నాకు తెలియదు’ అనేదే. ‘నాకు తెలియదు’ అనేది గొప్ప సంభావ్యత. ‘నాకు ఏదీ తెలీదు’ అని మీకు తెలిసినప్పుడే, మీ అన్వేషణ, తెలుసుకోవాలనే కోరిక సత్యాన్ని చూసే అవకాశాన్ని కలిగిస్తాయి. ఈ సంస్కృతిలో మనం ఎప్పుడూ అజ్ఞ్యానులం అనే అనుకున్నాం ఎందుకంటే, మనకి తెలిసింది చాలా తక్కువ. మనకి ఎంత జ్ఞ్యానం ఉన్నా సరే మన అజ్ఞ్యానం మాత్రం ఎల్లలు ఎరుగనిది. అందువల్ల మీరు మీ అజ్ఞ్యానాన్ని గుర్తిస్తే, ఒక విధంగా మీరు అనంతం అయినట్టే ఎందుకంటే మీరు గుర్తించేదంతా మీ లక్షణం అయ్యి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, ఆత్మసాక్షాత్కారం అంటే, మన అజ్ఞ్యానాన్ని గ్రహించి మనం చేసుకునే సంబరం. ఒక తాదాత్మ్యతతో కూడిన అజ్ఞ్యానం. మీరు, జ్ఞ్యానమనే ఈ రొదలో చిక్కుకోనప్పుడే, మీరు ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు, అంతే. జ్ఞ్యానమనే రొదలో చిక్కుకుంటే, మీరు దేనినీ ఉన్నది ఉన్నట్టుగా చూడలేరు - అన్నిటినీ మీరు పక్షపాతంతోనే చూస్తారు.

కబీర్ ఒక ఆత్మజ్ఞానం పొందిన సాలెవాడు, ఇంకా మార్మికుడు. మార్మికత అనేది ఎక్కడో గతంలో ఒక వ్యక్తికి చెంది, ఆయన కవిత్వం వల్ల అప్పుడప్పుడూ బైటికి రాకూడదు. మార్మికత అంటే, ప్రతి దినం, జీవితంలో ఒక కొత్త అనుభవంలోనికి అడుగుపెట్టటం. మీకు తెలియనిది ఏదో మీకు అనుభవంలోకి రావాలి ఈ రోజు. మార్మికత అంటే పోగు చేసుకున్న జ్ఞానం కాదు. మార్మికత అంటే ఒక శోధన. మీరు నమ్మకాలతో ఉంటే, ఏదీ శోధించలేరు. మీకు తెలియదు అని మీరు గ్రహించినప్పుడే మీరు నిష్కళంకముగా శోధించగలరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు