భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటీ అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. వీటిలోకొన్నిరూపాల వెనుక ఉన్న అంతరార్ధాన్నిసద్గురు మనకి వివరించారు.  ఆ రూపాలను గురించి మనం ఈ వారం ఈ సీరీస్ లో  తెలుసుకుందాం....వీటితో పాటు సౌండ్స్ ఆఫ్ ఈశా వారి త్రిగుణ్ సిడి నుంచి మీకు ఓ స్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం..విని ఆనందించగలరు..!!


త్రయంబకుడు - అంతః దృష్టికి ప్రతిరూపం

శివుడికి మూడో కన్ను ఉంది కాబట్టి ఆయనని త్రయంబకుడు అని కూడా అంటారు . మూడో కన్ను అంటే నుదురులో ఒక చీలిక ఉంటుందని కాదు. ఆయన అవగాహనా  స్థాయి అత్యుత్తమ సంభావ్యతకు చేరుకుందని అర్ధం. మూడో కన్నంటే అవగాహనా దృష్టి. మనకు ఉన్న రెండు కళ్ళు కేవలం ఇంద్రియాలు మాత్రమే. మీరు చూసేదంతా నిజం కాదు కదా, పైపెచ్చు ఆ కళ్ళు మెదడుకు అన్ని రకాల చెత్తను చేరవేస్తాయి. మీరు వీరిని, వారిని చూసి ఏదేదో అనుకుంటారు కాని వారిలో ఉన్న శివుణ్ణి మీరు చూడలేకపోతున్నారు. అందుకే మరొక కన్ను, అంటే గాడమైన ఆ లోతుకు చేరుకోగలిగిన మూడో కన్ను తెరుచుకోవాలి!

మీ దృష్టి తెరుచుకున్నప్పుడే, మీకు అంతః దృష్టి కలిగినప్పుడు మాత్రమే  పరిపూర్ణమైన  స్పష్టతొస్తుంది .

అయితే ఎంత ఆలోచించినా, ఎంత సిద్ధాంతీకరించినా మీ మెదడుకు స్పష్టత రాదు. మీ తర్కంతో సృష్టించుకున్న స్పష్టతను ఎవరైనా పటాపంచలు చేయచ్చు.అంతేకాదు కష్టమైన పరిస్థితులు దాన్నెంతో  బాధకు లోనుచేయవచ్చు. మీ దృష్టి తెరుచుకున్నప్పుడే, మీకు అంతః దృష్టి కలిగినప్పుడు మాత్రమే  పరిపూర్ణమైన  స్పష్టతొస్తుంది .

మనం శివుడు గా చెప్పుకునేది ఈ పరమోత్తమ స్పష్టతకు తార్కాణమే. ఈ (సంబంధ) పరంగానే ఈశా యోగ సెంటర్లో మహా శివరాత్రి పండుగ జరుపుకుంటాము. మీ అవగాహనను ఒక్క మెట్టు అయినా పెంచుకోవటానికి ఇది ఒక అవకాశం. ఇదే శివ అంటేనూ, యోగా అంటేనూ. ఇది ఒక మతం కాదు ఇది ఒక అంతర్గత పరిమాణ శాస్త్రం.

భిల్వాష్టకం

https://soundcloud.com/soundsofisha/bilvashtakam?in=soundsofisha/sets/trigun

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pc:vibaa.files.wordpress.com