మన అనుభవంలో లేని విషయాలను నమ్మటమా లేక నమ్మక పోవటమా అన్న  ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు,  సందేహంతో ఉండటం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు.

ప్రశ్న: నమస్కారం సద్గురు! మన అనుభవంలోలేని విషయాలను గుడ్డిగా నమ్మకుండా, అలాగే వాటిని  ఊరికే కొట్టిపారవేయకుండా ఉండడం చాలా ముఖ్యం అని మీరు చాలా సార్లు చెప్పటం విన్నాను. కానీ నా మెదడు ఎంతో ద్వంద్వంగా ఉంది – అది అటో లేక ఇటో వెళ్ళాలి అనుకుంటుంది, నిజమేమిటో లేక అబద్ధమేమిటో తెలుసుకోవాలి అనుకుంటుంది. అదే సమయంలో నేను మీ మీద ఎంతో నమ్మకం ఏర్పరచుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పినవి ఎన్నో నా జీవితంలో నిజమైయ్యాయి. అనుమానంతో ఉండటం, ఆలోచనలని విశాలంగా ఉంచుకోవడం - ఈ రెంటి మధ్య సమతుల్యంతో ఎలా ఉండగలను?

సద్గురు: దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. “సందేహం” అనేది ఒకటి, “అనుమానం” అనేది మరొకటి. అనుమానం ఒక రోగం ఎందుకంటే మీరు ఎదో ఒకటి తప్పుగా ఉండి తీరుతుంది అని ఊహించుకుంటున్నారు. అనుమానంతో ఉండే మెదడు ఒక రోగంతో ఉన్న మెదడు లాంటిది. సందేహం అనేది వేరే రకమైనది – అదేమిటో మీకు తెలియదని దాని అర్ధం. తెలియకపోవటం ఒక నేరం కాదు. ఎవరైనా ఏదైనా చెప్తే, చెప్పిన వారి మీద మీకు నమ్మకం ఉంటే మీరు కొంత సమయం, శక్తి మరియు సాధనాలను ఉపయోగించి అన్వేక్షణ చేసి తెలుసుకోవచ్చు. మీకు ఆ వ్యక్తి మీద నమ్మకం లేకపోతే మీరు మీ సమయాన్ని, శక్తిని వెచ్చించలేరు ఎందుకంటే సమయం , శక్తి పరిమితమైనవి.

మీరు నమ్మేది ఎలా? ఒకటి మీకది అర్ధవంతంగా అయినా అనిపించాలి లేదా రెండొవది మీకు అది మీకు పనిచేసినప్పుడు. 

ప్రాధమికంగా, జీవితం అంటే కొంత నిర్దిష్ట సమయం ఇంకా శక్తి. ఒకవేళ అది ఒక అబద్దాల మూట అయితే మీ శక్తి ఇంకా సమయం వెచ్చించటం అంటే మీ జీవితాన్ని వృద్ధా చేసుకోవటమే. ఆ దృష్టితో చూస్తే, మీకు నమ్మకం కావలి, కానీ మీరు నమ్మటానికి లేక నమ్మకుండా ఉండటానికి ప్రయత్నం చేయకూడదు. మీరు నమ్మేది ఎలా? ఒకటి, అది మీకు పర్వాలేదు అని అనిపించాలి. రెండోది అది మీకు పని చేసి అయినా ఉండాలి. ఒకవేళ అది మీకు పని చేయకపోయినా మీ చుట్టూ ఉన్నవారికి పని చేస్తుందంటే మీరు కొంత సమయాన్ని వెచ్చించి అది ఏమిటో తెలుసుకోవచ్చు, అనుమానపడకండి. తగినంత శ్రద్ధ చూపించి అన్వేక్షిస్తే మీకు తెలిస్తుంది. నమ్మకాన్నుంచి అపనమ్మకానికి, విశ్వాసాన్నుంచి అనుమానానికి దూకకండి.

మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమానికి వస్తే అన్నీ అర్ధవంతంగా అనిపిస్తాయి ఎందుకంటే ఆ కార్యక్రమ స్వభావం అది. మీరు భావ స్పందనకు వస్తే మీకు ఏదీ అర్ధవంతంగా అనిపించదు, కానీ ఆ మూడు రోజులు మిమల్ని మీరు అర్పిస్తే అది మిమల్ని పేల్చేస్తుంది. అది మీకు అలా జరగనట్లయితే మీకు ఏదీ అర్ధం అవ్వదు కానీ అది మీ చుట్టూ ఉన్న వారికి పని చేస్తున్నట్లు అనిపిస్తుంది. వారు విస్పోటనను అనుభూతి చెందుతూ ఉంటారు కానీ మీరు ఇంకా సరిగ్గా చేయాలా లేదా అనే చర్చలో ఉంటారు.

మీరు సంయమ కార్యక్రమానికి వచ్చి ధ్యానంలో నిమగ్నం కాగలిగితే, నేను దేవుడని మీరు అనుకుంటారు ఎందుకంటే అక్కడ సృష్టించిన శక్తి, అక్కడ మీ అనుభవాలు అలా ఉంటాయి. ఒకవేళ మీరు ధ్యానంలో మునగలేకపోతే, చివరికి మీకు మిగిలింది తిమ్మిరి ఎక్కిన కాళ్ళు, నడుము నొప్పి మాత్రమే అయితే మీరు నా గురించి ఏమనుకుంటారో నేను మాటల్లో చెప్పలేను! కానీ ఏమి చేయగలము, నేను మీతో ఆ అవకాశం తీసుకుంటున్నాను.

నేను నమ్మినదో లేక నమ్మనిదో నేను చేయటం లేదు. నాకు ఏదయితే పని చేసిందో అదే నేను చేస్తున్నాను. అది మీకు ఇప్పుడు పని చేయకపోతే కేవలం ఇంకా కొంచం ఎక్కువ సన్నాహక ప్రయత్నం అవసరమనే దీని అర్ధం. “ ఇది బహుశా మీకు పని చేసిందేమో కానీ నేను వేరేగా తాయారు చేయబడ్డాను”, అని మీరు అనుకోవచ్చు. కానీ అదృష్టవశాత్తూ మీరు వేరేగా తయారు చేయబడలేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ మనిషికైనా ప్రాధమిక మెకానిక్స్ ఒకేలా ఉంటాయి. పైపైన మన ఇష్టాఇష్టాలు వేరుగా ఉండవచ్చు, మన చేతనంగా ఉండే జ్ఞాపకాలు వేరేగా ఉండవచ్చు కానీ ప్రాధమికమైన మెకానిక్స్ వేరే విధంగా ఉండదు.

ఒకవేళ మీకు ఇది పని చేయకపోతే బహుశా మీరు సూచనలను సరిగ్గా వినటం లేదేమో. అది కచ్చితంగా సంభవమే. కొంతమంది జనాలకు వారు సూచనలు తప్పుగా అర్ధం చేసుకున్నారు అని తెలుసుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టచ్చు. లేకపోతే మీరు ధ్యాస పెట్టి సరిగ్గా వినటం లేదేమో. లేకపోతే మీకు ఇంకా కొంచం ఎక్కువ సన్నాహక సాధన చేయాల్సి ఉందేమో. ఎలా అయినా సరే , అది అస్సలు పని చేయకుండా ఉండదు ఎందుకంటే అది నా మీద పని చేసింది కదా !

ఈ మధ్యకాలంలో, ఒకరు హాబీయాస్ కార్పస్ కేసును న్యూ యార్క్ డిస్ట్రిక్ట్ కోర్టులో రెండు చింపాంజీల కోసం వేసారు. ఒక విశ్వవిద్యాలయం వాటిని వారి ప్రయోగాల కోసం వాడుతోంది. న్యాయానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తినైనా జైల్లో పెడితే హాబీయాస్ కార్పస్ కేసును వేసి విడిపించినట్లు, ఆ చింపాంజీలకు ఆలోచనలు, భావోగ్వేదలు మనిషికి చాలా దగ్గరిగా ఉంటాయి అని చెప్పి వాటి విడుదలను కోరారు. ఆ కోర్టు గందరగోళంలో పడింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి కేసు రాలేదు.

మీరు ప్రత్యేకమైన వారు అని ఎప్పుడూ చెప్పుకోకండి. నిజంగా దీనికై పని చేయటానికి మీరు ఇంకా సిద్ధంగా లేరంతే. మీకు వెనువెంటనే ఫలితాలు కావలి. మీకు వెంటనే ఫలితాలు కపిస్తాయి కానీ అవి నిలిచి ఉండవు. ఒక క్షణపాటు అనుభవం అందరికీ అందించగలము, కానీ దానిలోకి ఎదగటం ఉత్తమమైనది. దానికి కొంత సమయం పట్టచ్చు కానీ మీరు దానిలోకి ఎదిగితే దాన్ని మీనుంచి తీసేయలేరు. మిమల్ని హట్టాతుగా తీసుకువెళ్తే, అలా వెళ్లి ఇలా వస్తారు. అది కలకాలం ఉండాలి అంటే అలా నిలిచిపోయేటట్లు ఏదైనా చేయాలి. నాకు ఇది మాత్రం తెలుసు – నాలో ఏది పని చేస్తుందో ప్రతీ మనిషిలోనూ పనిచేస్తుంది ఎందుకంటే మౌలికమైన మెకానిక్స్ ఒక్కటే కనుక.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు