ప్రపంచ జనాభాదినోత్సవం సందర్భంగా సద్గురు ‘ఒకే  సంతానం ఉంటే వారికి ఒంటరితనంగా అనిపిస్తుందా’ అన్న ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ మానవ జనాభా ఇప్పటికే చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు.

ప్రశ్న: నాకు ఒక బిడ్డ ఉంది కానీ అందరూ మరొకరు ఉండాలని సలహా ఇస్తున్నారు. ఒకే సంతానం ఉంటే వారికి ఒంటరితనంగా అనిపిస్తుందని. ఒక కుటుంబానికి ఒక సంతానం సరిపోతుందా లేక ఇంకా ఎక్కవ మంది పిల్లలు ఉండాలా?

ప్రస్తుతం, ప్రపంచ జనాభా 7.2 బిలియన్ ప్రజలు. ఇది అనూహ్యమైన సంఖ్య. చరిత్రలో మునుపెన్నడూ మానవుల జనాభా భూమిపై ఇంత ఎక్కువ స్థాయిలో లేదు. దీని అర్థం ఏంటంటే, ఇప్పటివరకు ఈ గ్రహం మీద నివసించిన ప్రజల్లో 6.5 % మంది  ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఈ సంఖ్య 1% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది ఒక తీవ్రమైన సమస్య.

ఈ రోజుల్లో మరింత మంది పిల్లల్ని కలిగి ఉండడం దాదాపుగా ఒక నేరం ఎందుకంటే మనకున్న అతి పెద్ద సమస్య జనాభానే.

ఈ రోజుల్లో మరింత మంది పిల్లల్ని కలిగి ఉండడం దాదాపుగా ఒక నేరం ఎందుకంటే మనకున్న అతి పెద్ద సమస్య జనాభానే. మనం గ్లోబల్ వార్మింగ్ పెద్ద సమస్య అనుకుంటాము కానీ కాదు, అది జనాభానే. జనాభా తగ్గితే, గ్లోబల్ వార్మింగ్ జరగదు. మీరు అధికంగా పునరుత్పత్తి చేస్తే, ఎవరూ తమ పూర్తి జీవితకాలం వరకు జీవించలేరు. ఎందుకంటే అప్పటికే ఉన్న వివిధ రకాల లేమి వల్ల, కొరతల వల్ల, ప్రజలు మరణించడం ప్రారంభమౌతుంది. ఇది ఇప్పడు మొదలయిపోయింది కదా. భూమిమీద సగం మంది  ప్రజలు సరిగా తినలేక పోతున్నారు. సజీవంగా ఉన్నవారు సుదీర్ఘంగా, ఫలవంతమైన జీవితం జీవించడం మనకు కావాలి. కానీ ఇంకా పుట్టనివారిని మనం ఆపవచ్చు.

మీ పిల్లలకు ఒంటరితనంగా అనిపిస్తోందంటే, దానికి కారణం చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలుకు అపరిచితులు. అందుకే మీ పిల్లలకు ఒంటరిగా అనిపిస్తుంది. పిల్లల విషయానికి వస్తే, మీరు వారితో ఒక బాస్ లా వ్యవహరించకూడదు. మీ పిల్లలకు ఒక మంచి స్నేహితుడు అవసరం. అతనికి  తల్లిదండ్రుల రూపంలో ఉన్న ఒక బాస్ అవసరం లేదు. ఒక అణచివేసే బాస్ ఉన్నారంటే, 12 మంది పిల్లలు ఉన్నా కూడా, వారికి అప్పటికీ ఒంటరిగా ఉన్న అనుభూతే ఉంటుంది. కాబట్టి,  మీ పిల్లలతో క్రూరంగా, అణచివేస్తూ ఉండకండి. వాళ్ళతో ఒక మంచి స్నేహితుడులా ఉండండి. అప్పుడు వారు ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలకు నిజంగా మంచి స్నేహితులుగా ఉంటే, వారికి ఎందుకు ఒంటరితనంగా ఉంటుంది ? అతని చుట్టూ మరొక సంతానమెందుకు? అటువంటిది ఏమి అవసరముండదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు