Sadhguruమీరు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలంటే, మీరు  మీ మనసులో ఒక మధురానుభూతిని నిలుపుకోవాలి. ఇదే భక్తి. భక్తి అంటే స్థిరమైన మధురానుభూతి. “ఓ.. అయితే, ఇక్కడున్న వారిలో ఎవరితో నేను ప్రేమలో పడాలి?” అన్నది మీ ప్రశ్న. ఒక చిన్న పిల్లాడికి కూడా  ప్రేమ అనేది ఇలా జరిగేది కాదు అన్న విషయం తెలుసు.

మీకు, అందరూ అప్పుడప్పడూ బానే అనిపిస్తారు. కానీ ప్రతి క్షణం మీ జీవితంలో మధురానుభూతుల్ని నింపేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాంటి మనుషులు ఎవ్వరూ ఉండరు. ఎవరైతే దేవతలంతటి వారిని వివాహం చేసుకున్నారో వాళ్ళ అనుభూతులు కూడా ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు. పార్వతిని చూడండి, సతిని చూడండి, సత్యభామని చూడండి, రుక్మిణిని చూడండి - వీళ్ళందరి అనుభూతులు కూడా అప్పుడప్పుడు బావుంటాయి అప్పుడప్పుడు ఉండవు. మీ భార్య, మీ భర్తతో కూడా ఎక్కువగా జరిగేది ఇదే.  కనీసం మీలో చాలామందిలో మీ భార్యలకో, మీ భర్తలకో మీరు ఆశ్రమంలో చాలా సమయం గడుపుతున్నారు కాబట్టి వాళ్లకి  చాలా హాయిగానన్నా ఉంది. వాళ్లకి కొంత స్వాంతన. స్వాంతన  అనేది ఎంతో పెద్ద విషయం కదా.

ప్రజలు ఎదో ఒక  ప్రేమ వ్యవహారం నడిపిస్తే వాళ్ళు పూర్తిగా  ప్రేమమయం అయిపోతారనుకుంటారు, వివాహంతో దాన్ని మరింత బలపరుచుకోవచ్చు నని అనుకుంటారు. ఈ మాధుర్యాన్ని మరింత బలపరుచుకుందాం అనుకుంటారు. ఇహ పిల్లలు పుట్టారు అంటే మాధుర్యమే మాధుర్యం. కానీ నిజానికి జీవితం ఇలా జరుగదు. ఒకరోజు ఏమయిందంటే, ఓ యువకుడు రాత్రిపూట పార్టీ  అయిన తరువాత పొద్దున ఎనిమిది గంటలకు తిరిగి వస్తున్నాడు. దారిలో అతని తండ్రిని ఎదురుపడ్డాడు. తండ్రి ఎంతో పెద్ద, ధనవంతుడైన స్టాక్ బ్రోకర్. అప్పుడు ఈ కొడుకు ఎంతో ఉత్సాహంగా వస్తూ, తండ్రిని చూసి “నాన్న, ఈరోజు మీకు ఎంతో బాగుండాలి”  అని అన్నాడు. ఆ తండ్రి ఆ కొడుకుని చూసి “చాలా ధన్యవాదాలు, కానీ నువ్వు నాతో ఎందుకు ఇలా అన్నావు?” అని అడిగాడు. అప్పుడు ఆ కొడుకు “అవును నాన్నా.. నీకు రోజు మంచిగా ఉంటేనే కదా, నాకు కూడా రోజు మంచిగా ఉండేది” అని అన్నాడు.

కానీ భక్తి అంటే ఏంటంటే మీకు బయట నుంచి ఎటువంటి సహాయం లేకుండా మీ మనసులో ఒక ప్రేమ వ్యహారం నడపడమే

అందుకని అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అది సరే, మనం అందులోకి వెళ్ళద్దు. కానీ భక్తి అంటే ఏంటంటే మీకు బయట నుంచి ఎటువంటి సహాయం లేకుండా మీ మనసులో ఒక ప్రేమ వ్యహారం నడపడమే. దీనికి బయట నుంచి ఊతం అక్కరలేదు. మీరు దేనితోనైన ప్రేమలో పడతారు. మీకు తెలుసా చాలామంది భగవంతుడితో ఎందుకు ప్రేమలో పడాలనుకున్నారో, ఎందుకంటే ఇది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి పురుషులు, స్త్రీలు అంత స్థిరంగా ఉండరు. కుక్కలు  చాలా తొందరగా మరణిస్తాయి. కానీ భగవంతుడు చూసారా? ఇది ఎంతో  తెలివిగల ప్రేమ వ్యవహారం. ఎందుకంటే మీరు దీన్ని ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. అసలు ఓ ప్రేమవ్యహారం ఎందుకు అర్ధవంతంగా మారుతుంది? ఇది ఇద్దరి మధ్య జరిగే విషయం వల్ల అర్ధవంతంగా మారదు. ఇది మీలో ఎలాంటి మాధుర్యాన్ని నింపుతుందో దాని వల్ల ఇది మీకు ముఖ్యం అవుతుంది. ఇప్పుడు మీరు భగవత్ స్వరూపంతో ప్రేమలో పడ్డారనుకోండి అది శక్తి పరంగా మంచి స్పందనతో ఉందనుకోండి, అప్పుడు మీకు ఒక రకమైన ప్రతిస్పందన కూడా దొరుకుతుంది లేదా మీ  ప్రతి స్పందనతోనున్న దానినుంచి మీకు శక్తి వస్తుంది. అంతేకాని ఈ ప్రేమ వ్యవహారంతో ఏమి అనర్ధం జరగదు. ఎందుకంటే అవతలి వాళ్ళు ఏదో చేయాలని మీకేమీ అంచనాలు ఉండవు కాబట్టి. అవతలి వ్యక్తి  ఏదో చేయాలి అని మీరు ఆలోచించట్లేదు అనుకోండి అప్పుడు అది ఓ ఫలప్రదమైన ప్రేమ వ్యవహారం. మీరు నాతో ఏకీభవిస్తారా?

ప్రేమ వ్యవహారం ఎందుకు చెడిపోతోంది అంటే  మీరు అనుకున్నట్టు ఎవరో ప్రవర్తించటంలేదు కాబట్టి. అవునా? అందుకే, “నాకు దీన్నుంచి ఏమి వస్తుంది?” అన్న అంచనాలతో కాకుండా, కేవలం ఆ ప్రేమలోని మాధుర్యం  అనుభూతి చెందడానికి  మీరు దేనితోనైనా ప్రేమలో ఉంటే, మీరు మాధుర్యంతో నిండిపోయే ఉంటారు. మీలో కనుక ఈ మాధుర్యం ఉందనుకోండి మీరు చేసే సాధన ప్రభావం ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. మీ మార్గం మరింత దగ్గరగా, మరింత చిన్నదిగా మారిపోతుంది. ఇది మీరు ఎంత ‘ఆనందంగా ఉన్నారు’  అన్నదాని మీద ఆధారపడుతుంది. ఈ మార్గం పెద్దదో, చిన్నదో అన్న విషయం మీలోని పారవశ్యాన్ని బట్టి ఉంటుంది.

నేను  కొంచెం తెలివిగల వాడ్ని అనుకునే సరికి మీరు ఎవ్వరితోను సరిగ్గా  ఉండలేకపోతారు.

దురదృష్టవశాత్తూ నేను నా చుట్టూరా ఎంతోమందిని ఇలా చూసాను. అదేమిటంటే నేను వారిని  పారవశ్యానికి ఇంత దగ్గరగా తీసుకువచ్చినా సరే, వారిని ఒక్క రోజు వదిలేశాను అనుకోండి, వాళ్ళు పూర్తిగా వెనకబడిపోతారు. గురువు అవడంలోని దురదృష్టం ఇదే. మీరు ఎన్నోసార్లు వాళ్ళని ఎంతో దగ్గరగా తీసుకువస్తారు, మీరు ఇంత దగ్గరగా వచ్చిన తరువాత మీరు అక్కడ వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే , ఆత్మ జ్ఞానం అనేది ఎవరికి వారికి సంబంధించినది. మీరు ఇంత దగ్గరకి తీసుకు వచ్చేసాక,  ఇహ వాళ్ళు ఆ మిగతా అడుగు వేస్తారని మీరనుకుంటారు. కానీ, అది అలా జరుగదు. ఎందుకంటే ఓ పెద్ద సమస్య ఏంటంటే మీ విద్యా విధానం. అందులో మీ మనోభావాలకి విలువలేదు. మీ ఆలోచనలకు మాత్రమే విలువ. ఇది మీకు రోజువారి ఎన్నో సమస్యల్ని సృష్టిస్తుంది, మీరు ఎవ్వరితోను, సరిగ్గా ఉండలేరు. నేను  కొంచెం తెలివిగలవాడ్ని అనుకునే సరికి మీరు ఎవ్వరితోను సరిగ్గా ఉండలేకపోతారు. కనీసం మీ సృష్టికర్తతో కూడా మీరు సజావుగా ఉండలేకపోతారు. ఎందుకంటే  మీరు ఎంత తెలివిగలవారంటే మీకు మీరే ఒక ప్రపంచం అయిపోయారు.

ఈ సృష్టికర్త సృష్టిలో ఇహ  మీరు ఉండలేకపోతున్నారు. మీరు మీ సొంత సృష్టిలో ఉన్నారు. మీరు ఇలా మీరు సృష్టించుకున్న స్థితిలో ఉండడమేమి గొప్ప విషయం కాదు. మీరు మీ ఉనికితో ఉండడం మానేసి మీ పిచ్చిలో మసులుతున్నారని అర్ధం. ఈ పరిణామాన్ని మీరు చూస్తున్నారు. ఇది పనికిరానిదా అంటే కాదు, ఇది పనికి వచ్చేదే. కానీ ఇది మార్గం కాదు అని మీరు తెలుసుకోవాలి. ఇది మీరు తెలుసుకున్నప్పుడు, అప్పుడు మీరు దేన్నైనా పెంపొందించచ్చు, భాగించచ్చు, కూడించచ్చు. నేను కూడడం, భాగించడం, తీసివేయడం అన్నప్పుడు అన్నిటి గురించీ నేను మాట్లాడుతున్నాను. మీరు ధనం సమకూర్చుకోవడం గురించి, మీరు వివాహం చేసుకోవడం గురించి , మీరు పిల్లల్ని కనడం గురించి, మీరు విడాకులు తీసుకోవడం గురించి, ఏదో ఒకరోజు మరణించడం గురించి. ఇవన్నీ ఏముంది కూడికలు, తీసివేతలు, భాగించడాలు అంతే కదా. అవునా కాదా? మీకు ఇది నచ్చలేదు కదూ? ఇందులో ఉన్నది గణిత శాస్త్రం అంతే కదా ! మీరు కూడికలు చేస్తున్నారు, లేదా తీసివేస్తున్నారు, లేదా భాగిస్తున్నారు లేదా గుణిస్తున్నారు అంతే కదా. మీరు ఈ భౌతికంతో ఇది మాత్రమే చేయగలరు.

ఏది బలమైనదో  దాన్ని వాడుకోవడమే తెలివితేటలు, ఇది మీకు మీరే గమనించి చూసుకోండి? మీలో మీ మేధస్సు బలీయమైన శక్తా? లేకపోతే  మీ భావావేశాలు బలీయమైనవా?

ఇప్పుడు భక్తికి సమయం  ఆసన్నమైంది. భక్తి ఎంతో గొప్ప సాధనం. ఇది తెలుసుకోవాలంటే ఎంతో తెలివి ఉండాలి. మీ మేధస్సు, మీ మనోభావాలు ఈ రెండిటిని మీరు పరిశీలించిచూడండి. మీలో ఇంకా పారవశ్యం ఉండకపోవచ్చు, మీలో ప్రేమ ఉండకపోవచ్చు, మీలో కారుణ్యం  ఉండకపోవచ్చు కాని మీకు కోపం వస్తుంది కదా. మీలో ఏది బలమైనది : కోపమా? మీ మనోభావమా? లేక మీ ఆలోచనా?  మీరు దాన్ని తీసుకోవాలి, మీలో ఏది  బలమైనదో  దాన్ని వాడుకోవాలి. ఏది బలమైనదో  దాన్ని వాడుకోవడమే తెలివితేటలు, ఇది మీకు మీరే గమనించి చూసుకోండి? మీలో మీ మేధస్సు బలీయమైన శక్తా? లేకపోతే  మీ మనోభావాలు బలీయమైనవా? ఈ మనోభావం ఎన్నో రకాలుగా రూపు దాల్చగలదు. ఇది  ఎంతో మాధుర్యంగా ఉండగలదు, ఇది ఎంతో దారుణంగా, ఘోరంగా  ఉండగలదు. అందుకని మొదటి పని ఏం చేయాలి అంటే మీరు ఇది మధురమైన, అందమైన  రూపం తీసుకునేలాగా దానికి శిక్షణని ఇవ్వాలి. ఒకసారి ఇది ఎంతో అందమైన రూపం దాల్చింది అనుకోండి మీ మేధస్సు అనేది ఓ పెద్ద విషయంగా అనిపించదు, నిజంగా! మీకు తెలియాల్సినవన్నీ కూడా అన్నిటిని మీలో ఇముడ్చుకోవడం వల్లే  మీకు తెలుస్తాయి.

దేన్నో జయించడం వల్ల ఏమి ఉపయోగం లేదు. మీరు పెద్ద  దండయాత్ర  చేసినా సరే మీరు ఏమీ పొందలేరు. మీరు ఈ ప్రపంచాన్నంతా జయించారనుకోండి, మీరు ఏం చేస్తారు, ఈ ప్రపంచమంతా మిమల్ని మీరు విస్తరించుకోగలరా ? మీరు ఏదో ఓకే చోట మాత్రమే ఉంటారు. అవునా? మీరు వేరేవారికి బలవంతులుగా, శక్తివంతులుగా కనబడుతారు. మీరు అలెగ్జాన్డర్ ది గ్రేట్ అనుకుందాం, ఇప్పుడు  మీరు సగం ప్రపంచం, లేదా పూర్తి ప్రపంచాన్నే జయించారు అనుకుందాం. కానీ మీరు మొత్తం ప్రపంచాన్నంతా వినాశనం చేసేసిన తరువాత ఇంక మీ కోసం చప్పట్లు కొట్టేవారు ఎవరుంటారు? మీరొక్కరే ఇక్కడ కూర్చుని ఉంటారు. ఏం చేయగలుగుతారు? మీరు ఊహించుకోండి. మీకు ఎన్నో వేల కోట్లు దొరికాయి మీరు ఒక్కరే ఉన్నారు, అప్పుడు మీరేం చేస్తారు? మీరు గొప్ప, మీరు గోప్ప అని చెప్పడానికి మీకు ఎవరో ఒక్కళ్ళు కావాలి. మీ చుట్టూరా ఇలాంటి మూర్ఖులు కొంతమంది మీకు కావాలి. మీరు ఎంతో గొప్పవారు అని  మీ చుట్టూ ఉన్నవారు మీకు చెప్పాలి. లేకపోతే మీ అనుభూతి ఎంతో ఘోరంగా ఉంటుంది కదూ! కానీ మీ భావావేశాలు ఎంతో అద్భుతంగా, మధురంగా మారాయి అనుకోండి మీరిక్కడ ఒక్కరే కూర్చున్నా సరే, మీకు ఆనంద పారవశ్యంలో అలా  ఆనందభాష్పాలు వస్తాయి. మీకు ఒకరే ఉండాలని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఇది ఎంతో గొప్ప అనుభూతిగా అనిపిస్తుంది.

మీరు వెంటనే మీలోని  వాతావరణం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఈ క్రియ రూపంలో ఇచ్చిన సాధన ఏదైతే ఉందో, ఈ ఆసనాల రూపంలో గాని ఇతరమైనవి గనీ,  ఇవి ఎంతో శక్తివంతమైనవి. మీ శరీరం, మీ శక్తి పరిణితి చెందుతోంది. కానీ చాలా మందికి వారి మేధస్సు పరిణితి చెందడంలేదు. నేను ఈ విషయాన్ని రోజు గమనిస్తూనే ఉన్నాను. మీరు శారీరకంగా, శక్తిపరంగా పరిణామం చెందుతున్నారు. కానీ మీ ఆలోచనా విధానం కూడా పరిణితి చెందవలసిన అవసరం ఉంది. దానికై మీరు ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు